Thalaivan Thalaivii: ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోలేక.. అందుకే ఒంటరిగా.. నిత్యా మీనన్

భారతీయ చిత్ర పరిశ్రమలో ఉన్న అతికొద్దిమంది అద్భుతమైన నటీమణుల్లో నిత్యా మీనన్ ఒకరు. కళ్లతో భావాలను పలికించిగల సత్తా ఆమె సొంతం. గ్లామర్ పాత్రలకు, అందాల ఆరబోతకు దూరంగా నటనకు ప్రాధాన్యమున్న పాత్రలలో నటిస్తూ సత్తా చాటుతున్నారు నిత్యామీనన్. బాలనటిగా కెరీర్ ప్రారంభించిన నిత్యామీనన్.. ఇండస్ట్రీలో అడుగుపెట్టి 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. 40 ఏళ్లకు దగ్గరపడుతున్నా ఇంకా పెళ్లి మాట ఎత్తకపోవడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. తాజాగా విలక్షణ నటుడు విజయ్ సేతుపతితో నిత్యామీనన్ నటించిన తలైవన్ తలైవి చిత్రం జూలై 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తన ప్రేమ, పెళ్లి, కెరీర్‌పై నిత్యామీనన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నిత్యామీనన్‌పై బాడీ షేమింగ్ కామెంట్స్
హీరోయిన్‌గా ఉన్నవాళ్లు ఖచ్చితంగా అందం, డైట్ విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. కానీ తనకు అలాంటివి నచ్చదని, నోరు కట్టేసుకోవడం తన వల్ల కాదని పలుమార్లు చెప్పారు నిత్యామీనన్. పొట్టి పిల్ల, బొద్దు అమ్మాయి అని కూడా బాడీ షేమింగ్ కామెంట్స్ ఎదుర్కొన్నప్పటికీ నిత్యామీనన్ ఏమాత్రం కేర్ చేయరు. గతేడాది తిరుచిత్రఫలం అనే తమిళ చిత్రంలో నటనకు గాను భారత ప్రభుత్వం నుంచి ఉత్తమ నటిగా అవార్డ్ సాధించారు.

Thalaivan Thalaivii Actress Nithya Menen opens up on her marriage

నటన అంటే శరీరాన్ని మార్చుకోవడం కాదు
బెస్ట్ యాక్టింగ్ అంటే బరువు తగ్గడమో, పెరగడమో కాదని.. అసలు శరీరాకృతిని మార్చుకోవడంలో ఉండదని నిత్య అంటారు. సినీ రంగంలో నిజాల కంటే పుకార్లే ఎక్కువగా ప్రచారంలో ఉంటాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నిత్యామీనన్ మోస్ట్ వాంటెడ్. కథ నచ్చితే కానీ ఆమె ఏ ప్రాజెక్ట్‌ను ఓకే చేయరు.. స్టోరీలో తనకు ఇంపార్టెన్స్ ఉందా? లేదా? అనేది ఖచ్చితంగా చూసుకుంటారు.

ఆ హీరోతో నిత్య రిలేషన్
అందరు హీరోయిన్ల మాదిరిగానే నిత్యామీనన్‌పైనా పలు రూమర్స్ వచ్చాయి. కొందరు నటులతో ఆమెకు ఎఫైర్లు ఉన్నాయంటూ అప్పట్లో గాసిప్స్ వైరల్ అయ్యాయి. ముఖ్యంగా కన్నడ సూపర్‌స్టార్ కిచ్చా సుదీప్‌తో నిత్యామీనన్ ప్రేమాయణం సాగిస్తున్నారని.. వీరిద్దరూ సీక్రెట్‌గా ప్రేమించుకుంటున్నారని చిత్ర పరిశ్రమలో పుకార్లు చక్కర్లు కొట్టాయి. నిత్యతో ఎఫైర్ కారణంగా సుదీప్ తన భార్య రాధికతో గొడవలు పడినట్లుగా శాండిల్‌వుడ్‌లో గుసగుసలు వినిపించాయి. ఒకదశలో సుదీప్ తన భార్యకు విడాకులు ఇచ్చేందుకు ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేశారు. కానీ ఏమైందో ఏమో కానీ సుదీప్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. అయితే తాను సుదీప్‌ని ప్రేమిస్తున్నట్లుగా వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని నిత్యామీనన్ క్లారిటీ ఇచ్చారు.

Take a Poll

సోలో లైఫే సో బెటర్
తాజాగా తలైవి తలైవన్ మూవీ రిలీజ్ సందర్భంగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నిత్యామీనన్. నా జీవితంలో ఇప్పుడు ప్రేమకు అంతగా ప్రాధాన్యం లేదని క్లారిటీ ఇచ్చారు. పెళ్లి అనేది నా లక్ష్యం కాదని.. వివాహ బంధంతోనే కాకుండా వేరే రకంగా కూడా జీవితాన్ని ఆనందించవచ్చని అన్నారు. ప్రేమించి వ్యక్తిని జీవిత భాగస్వామిగా చేసుకోవడం ప్రతి ఒక్కరికి సాధ్యం కాదని.. ఒంటరితనంతో కొన్నిసార్లు బాధపడినా సోలో లైఫ్ లీడ్ చేయడం బాగుందని నిత్యా మీనన్ తెలిపారు. రతన్ టాటా కూడా పెళ్లి చేసుకోలేదని.. కానీ ఆయన అర్ధవంతమైన జీవితాన్ని గడిపారని నిత్యామీనన్ గుర్తుచేశారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X