సెన్సేషనల్ పాత్రలో నివేత థామస్.. సూపర్‌స్టార్‌కు కూతురిగా.. దర్శకుడు ఎవరంటే!

దక్షిణాదిలో విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తున్న యువ నటి నివేత థామస్ మరో విభిన్నమైన చిత్రంలో నటించారు. తాజాగా 118 చిత్రంలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకొన్న ఈ అందాల సుందరి ప్రస్తుతం సూపర్‌స్టార్ రజనీకాంత్ కూతురుగా నటించబోతున్నారు. ప్రముఖ దర్శకుడు ఈ చిత్రానికి దర్శకుడు. గత కొద్దికాలంగా తమిళ, మలయాళ చిత్రాలకే పరిమితమైన నివేత ప్రస్తుతం తమిళంలో ఓ భారీ చిత్రంలో ఆఫర్‌ను సొంతం చేసుకోవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే

 రజనీకి కూతురిగా

రజనీకి కూతురిగా

తలైవర్ రజనీకాంత్ 167వ చిత్రాన్ని దర్శకుడు ఏఆర్ మురగదాస్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో కూతురు పాత్రలో నటించాలని నివేతా థామస్‌ను కోరారట. ఈ మేరకు పాత్ర స్వభావం నచ్చడంతో వెంటనే ఒప్పేసుకొన్నారట. త్వరలోనే ఈ పాత్రకు సంబంధించిన ఫొటోషూట్‌ను ఇటీవల నిర్వహించారట. గతంలో కమల్ హాసన్ కూతురిగా నివేత థామస్ పాపనాశనంలో నటించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈమె రోల్‌ గురించి చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించునున్నది.

పోలీస్ అధికారిగా రజనీకాంత్

పోలీస్ అధికారిగా రజనీకాంత్

తన కెరీర్‌లో 167వ చిత్రంగా రూపొందుతున్న చిత్రంలో రజనీకాంత్ పోలీస్ అధికారిగా నటిస్తున్నట్టు తాజా సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన స్టిల్ సోషల్ మీడియాలో హంగామా చేసింది. చాలా రోజుల తర్వాత రజనీ ఖాకీ పాత్రలో కనిపించడం విశేషంగా మారింది.

లీకైన ఫోటోలను షేర్ చేయొద్దని

లీకైన ఫోటోలను షేర్ చేయొద్దని

ఇటీవల లీక్ అయిన రజనీకాంత్ ఫోటో గురించి అధికార ప్రతినిధి రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ.. సినిమాకు సంబంధించిన స్టిల్స్‌ను, లీకైన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయవద్దు. అధికారికంగా మేము రిలీజ్ చేయడానికి ఇబ్బందులు ఎదురవుతాయి. రజనీ‌కాంత్ ఫ్యాన్స్ ఈ విషయంలో సహకారం అందించాలి అని కోరారు.

ఏప్రిల్ 10న షూటింగ్ ప్రారంభం

ఏప్రిల్ 10న షూటింగ్ ప్రారంభం

తలైవర్ 197 సినిమా చెన్నైలో ఏప్రిల్ 10 తేదీన ప్రారంభం కానున్నది. మార్చిలో ప్రారంభం కావాల్సిన షూటింగ్ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నది. సంతోష్ శివన్ సినిమాటోగ్రఫర్‌గా, అనిరుధ్ రామచంద్రన్ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X