మా అన్న ఇంటిని ముక్కలు చేశావు... త్రిషపై దళపతి విజయ్ ఫ్యాన్స్ దారుణంగా
కోలీవుడ్ సూపర్‌స్టార్, టీవీకే అధినేత దళపతి విజయ్ వరుసపెట్టి కష్టాలను ఎదుర్కొంటున్నారు. తమిళ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని ప్లానింగ్‌తో వెళ్తున్న ఆయనను వరుస వివాదాలు ఇబ్బంది పెడుతున్నాయి. కరూర్ తొక్కిసలాట, సీబీఐ కేసు, జన నాయగన్ సినిమా వాయిదా, టీవీకే జెండాపై కోర్టులో వివాదం చాలవన్నట్లు ఇటీవల ఆయన భార్య సంగీత.. పెద్ద షాకిచ్చారు. తనకు విజయ్ నుంచి విడాకులు కావాలని చెంగల్పట్టు కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
విడాకుల నోటీసు ఇవ్వడం అనేది ఈ రోజుల్లో సినీ వర్గాలతో పాటు సామాన్యుల్లోనూ సర్వసాధారణం అయిపోయినా.. విజయ్ లాంటి మాస్ ఇమేజ్ ఉన్న వ్యక్తికి, తమిళనాడుకు కాబోయే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న సెలబ్రిటీకి ఇబ్బందికర పరిణామం. అన్నింటిలోకి విజయ్‌కి నటి త్రిషకి మధ్య గత కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం నడుస్తోందని గత కొన్నేళ్లుగా మీడియాలో గాసిప్స్ వినిపిస్తున్నాయి. వీటికి మరింత బలాన్ని చేకూరుస్తూ.. తమిళనాడు బీజీపీ చీఫ్ నైనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.

విజయ్‌కి రాజకీయ అనుభవం లేదు. ముందు ఇంటిని చక్కదిద్దుకున్న తర్వాత తమిళనాడు రాజకీయాలను నడిపించాలి. అలాగే త్రిష ఇంటిని విడిచిపెట్టి వస్తేనే విజయ్‌కి వాస్తవాలు తెలుస్తాయని నాగేంద్రన్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. దీనిపై త్రిష సీరియస్‌గా స్పందించారు. సంబంధం లేని విషయాల్లోకి తన పేరును లాగడం ఉన్నత స్థానాల్లో ఉన్న వారికి సరికాదని వ్యాఖ్యానించారు. తాను ఏ రాజకీయ పార్టీతోనూ, నేతలతోనూ సన్నిహితంగా ఉండటం లేదని తెలిపారు. అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో నైనార్ నాగేంద్రన్ క్షమాపణలు చెప్పారు.
ఈ వివాదం సద్దుమణిగిన కొద్దిరోజులకే విజయ్ సతీమణి విడాకుల కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ నటితో తన భర్తకు వివాహేతర సంబంధం ఉందని ఆమె పిటిషన్‌లో ఆరోపించారు. నటి విషయంగా ఆయనతో తనకు పలుమార్లు గొడవ జరిగింది.. ఇద్దరం రెండేళ్లుగా వేర్వేరుగా ఉంటున్నామని సంగీత పేర్కొన్నారు. ఈ పరిణామాలతో అందరి వేళ్లూ త్రిషవైపు చూపిస్తున్నాయి. దాంతో విజయ్ అభిమానులు రెచ్చిపోతున్నారు. తమ అభిమాన నేత జీవితాన్ని నాశనం చేసి, ఆయన కుటుంబాన్ని ముక్కలు చేస్తోందంటూ త్రిషపై వారు ట్రోలింగ్‌కు దిగుతున్నారు. దారుణమైన కామెంట్స్‌తో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
సంగీత తన భర్తకు విడాకుల నోటీసు ఇచ్చిన నాటి నుంచి త్రిష మౌనంగానే ఉన్నారు. దళపత విజయ్‌కి ఫలానా నటితో సంబంధం ఉందని సంగీత ఎలాంటి ఆధారాలు చూపలేదు. కానీ అందరి కన్నూ త్రిష మీదే. అయితే అందరూ తనపై ఆరోపణలు చేస్తున్నా, సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నా త్రిష ఏమాత్రం బయటపడటం లేదు. చివరిసారిగా తిరుమలకు వెళ్లిన ఫోటోలు మాత్రమే ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నాయి. ఇప్పటికే రెచ్చిపోతున్న విజయ్ ఫ్యాన్స్.. త్రిష ఇన్‌స్టాగ్రామ్ పోస్టుల్లోకి వెళ్లి దారుణంగా కామెంట్స్ పెడుతున్నారు. ఒక ఇంటిని ముక్కలు చేసినందుకు అభినందనలు, విజయ్ అన్నని వదిలేయ్, ప్రతి సంబంధానికి పరిమితులు ఉంటాయి.. వారు కుటుంబాన్ని కలిగి ఉండటానికి అర్హులు కాదా వంటి కామెంట్స్‌తో త్రిషను లక్ష్యంగా చేసుకున్నారు. దీంతో ఈ ఊహాగానాలకు తెరపడాలంటే త్రిష స్పందించాల్సి ఉంది. లేదంటే పరిస్ధితులు దారుణంగా తయారయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications











