Trisha Krishnan : ఆ స్టార్ హీరోతో పహల్గామ్‌లో గడిపిన త్రిష .. 2 నెలలు అతనితోనే
జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో పహల్గామ్ పేరు మారుమోగుతోంది. పహల్గామ్‌లోని బైసరన్ లోయ ప్రకృతి అందాలకు నెలవు. పైన్ చెట్లు, మంచు కొండలు, పచ్చిక బయళ్లతో ఆహ్లాకర వాతావరణానికి ఈ ప్రాంతం పెట్టింది పేరు. అందుకే ఈ ప్రాంతాన్ని స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా, మినీ స్విట్జర్లాండ్ అని పర్యాటకులు ముద్దుగా పిలుచుకుంటారు. నిన్న మొన్నటి వరకు పర్యాటకులతో కళకళలాడిన ఆ ప్రాంతం తాజా ఉగ్రదాడితో నిర్మానుష్యంగా మారిపోయింది. గతంలో ఈ ప్రాంతంలో గడిపిన వారు తాజాగా ఈ వీడియోలు, ఫోటోలను పంచుకుంటున్నారు. దక్షిణాది స్టార్ హీరోయిన్ త్రిష కూడా ఈ ప్రాంతంలో గడిపారు. ఈ వివరాల్లోకి వెళితే..
జమ్మూకాశ్మీర్‌కు వచ్చే పర్యాటకుల్లో ఎక్కువ మంది సదర్శించే ప్రాంతాల్లో పహల్గాం ఒకటి. మార్చి - జూన్ మధ్యకాలంలో పహల్గామ్ వాతావరణం పర్యాటకులకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఈ ప్రాంతం మంచుతో కప్పబడి ఉంటుంది. స్విట్జర్లాండ్‌లోని లంగెర్న్ ఏరియాలోని ప్రకృతి సౌందర్యానికి, పహల్గామ్ వాతావరణానికి చాలా దగ్గరి పోలికలు ఉండటంతో దీనిని స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా, మినీ స్విట్జర్లాండ్‌గా అభివర్ణిస్తారు. పహల్గాం ఏరియాలో పంచతర్ణి, అమర్‌నాథ్ గుహ, బైసరన్, చందన్‌వరీ, శేష్‌నాగ్ లేక్ వంటివి ఇతర టూరిస్ట్ స్పాట్‌లు.

పహల్గాంలోని ప్రకృతి సౌందర్యం నేపథ్యంలో దేశ , విదేశాలకు చెందిన సినిమాల షూటింగ్స్ జరిగాయి. మన తెలుగు సినిమాలు కూడా ఆ ఏరియాలో షూటింగ్ జరుపుకున్నాయి. నా పేరు సూర్య , పెళ్లి సందD, ఖుషీ సహా తదితర సినిమాల చిత్రీకరణ జరిగింది. స్విట్జర్లాండ్‌లో తీయాలని అనుకునే సీన్స్‌ని దర్శక నిర్మాతలు ఇక్కడే చిత్రీకరిస్తారు. అందుకే పహల్గాంలో దాడి విషయం తెలియగానే సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. టాలీవుడ్ నటుడు , నేచురల్ స్టార్ నాని కూడా తాము హిట్ 3 సినిమా షూటింగ్ కోసం 3 నెలలు అక్కడే ఉన్నామని గుర్తుచేసుకున్నారు. దాదాపు 20 రోజుల పాటు 200 మంది యూనిట్ సభ్యులతో కలిసి పనిచేశామని నాని వెల్లడించారు.
ఇకపోతే.. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ కూడా పహల్గాంలో గడిపారు. యాక్షన్ చిత్రాల స్పెషలిష్ట్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఇళయ దళపతి విజయ్ హీరోగా వచ్చిన లియోలో త్రిష ఆయన సరసన హీరోయిన్‌గా నటించారు. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్‌పై ఎస్ఎస్ లలిత్ కుమార్, జగదీష్ పళని స్వామి ఈ చిత్రాన్ని దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. అక్టోబర్ 19, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన లియో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఏకంగా రూ.620 కోట్ల వసూళ్లతో విజయ్ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది.
లియో సినిమా షూటింగ్ ఎక్కువ భాగం జమ్మూకాశ్మీర్‌లోనే జరిగింది. హీరో, హీరోయిన్లు సహా చిత్ర యూనిట్ దాదాపు రెండు నెలలు పాటు కాశ్మీర్‌లోనే ఉన్నారు. అలాంటిది పహల్గామ్‌లో ఉగ్రవాదుల దాడిలో 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడంతో లియో చిత్ర యూనిట్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన మనోజ్ పరమహంస .. నాడు కాశ్మీర్‌లో షూటింగ్ జరిగిన విషయాన్ని పంచుకున్నారు. లియో సినిమా మొత్తం పహల్గామ్‌లోనే చిత్రీకరణ జరుపుకుందని, అలాంటి చోట ఉగ్రవాద దాడి జరగడం బాధాకరమని ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం పరమహంస పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











