‘విజయ్, త్రిష పెళ్లి చేసుకోవాలి.. ఆయనంటే నాకు ఇష్టం.. ఆ కోరిక తీరలేదు’
దేశవ్యాప్తంగా ధళపతి విజయ్ పేరు మీడియాలోను, సినీ, రాజకీయ వర్గాల్లోను మార్మోగుతున్నది. టీవీకే పార్టీ పెట్టి రెండున్నర ఏళ్లలో అధికారం చేపట్టడం సంచలనంగా మారింది. ఆయన చేసిన ప్రచారం.. ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలు గురించి చర్చ నడుస్తున్నది. అదే సమయంలో ఆయన వైవాహిక జీవితం, వివాహేతర సంబంధం విషయం కూడా భారీ చర్చకు దారి తీస్తున్నది. అందుకు కారణం విజయ్‌కి స్టార్ హీరోయిన్ త్రిషా కృష్ణన్‌కు ఉన్న ప్రేమ బంధమే. అయితే ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత త్రిషతో పెళ్లి విషయం గురించి ఎక్కువగా మీడియాలో డిస్కషన్స్ నడుస్తున్నాయి. అయితే వారిద్దరి గురించి బాలీవుడ్ శృంగార నటి రాఖీ సావంత్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఇంతకు రాఖీ చేసిన వ్యాఖ్యల ఏమిటనే వివరాల్లోకి వెళితే..
త్రిష, విజయ్ రిలేషన్‌షిప్ గురించి ఫిల్మీమంత్ర అనే ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాఖీ సావంత్ మాట్లాడుతూ..వారిద్దరూ తప్పకుండా పెళ్లి చేసుకోవాలి. వారు పెళ్లి చేసుకొంటే ఆ వేడుకలో పాలుపంచుకొంటాం. మెహందీ ఫంక్షన్‌లో భాగం కావాలని ఉంది. ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు కోరుకొన్న విధంగానే తాను అలా కోరుకొన్నాను అని రాఖీ సావంత్ అన్నారు.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ సాధించిన విజయంపై రాఖీ స్పందిస్తూ.. తమిళనాడులో అత్యధిక అసెంబ్లీ స్థానాలు గెలుచుకొన్న తొలి క్రిష్టియన్ ఆయనే. వ్యక్తిగతంగా ఆయన అంటే నాకు ఇష్టం. నాకు విజయ్‌తో కలిసి ఓ పాటలో నటించాలనే కోరిక ఎప్పటి నుంచో ఉంది. కానీ నాకు ఆ ఛాన్స్ దక్కలేదు. అయితే ఇప్పుడు ఆయన స్థాపించిన రాజకీయ పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తాను అని రాఖీ సావంత్ అన్నారు.
రాఖీ సావంత్ విషయానికి వస్తే.. పాలిటిక్స్‌తో ఆమెకు సంబంధాలు ఉన్నాయి. 2014 సంవత్సరంలో మహారాష్ట్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా లో చేరిన ఆమె ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైంది. ఆ తర్వాత రాజకీయాల్లో కూడా ప్రభావం చూపలేకపోవడంతో ఆమె క్రీయాశీలక రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. దాదాపు 3 సంవత్సరాల పాటు ముంబై పాలిటిక్స్‌లో హడావిడి చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా విజయ్, త్రిష గురించి ఆమె చేసిన కామెంట్లు జాతీయ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు విజయ్ భార్య సంగీత స్వర్ణలింగం విడాకుల బాంబు పేల్చారు. నా భర్తకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఓ హీరోయిన్‌తో ఉన్న రిలేషన్ వల్ల తాను మానసిక క్షోభకు గురి అవుతున్నాను. గత కొన్నేళ్లుగా వేర్వేరుగా జీవితాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి మాకు విడాకులు మంజూరు చేయండి అంటూ కోర్టుకు విన్నపం చేసుకొన్నారు.
విజయ్ భార్య సంగీత ఆరోపణలతో త్రిషాతో ఉన్న సంబంధం బయటకు రావడమే కాకుండా కొన్ని రూమర్లను నిజం చేశాయనే అభిప్రాయం కలిగింది. భార్య ఆరోపణల నేపథ్యంలో తమిళంలో అగ్ర నిర్మాత ఇంట్లో జరిగిన వివాహానికి త్రిషతో కలిసి విజయ్ రావడంతో వారి మధ్య ఉన్న బంధానికి పక్కా ఆధారం లభించింది. ఇలాంటి నేపథ్యంలో విజయ్‌తో త్రిష పెళ్లి వ్యవహారం భారీ చర్చకు దారి తీస్తున్నది.


Click it and Unblock the Notifications