బ్లాక్‌బస్టర్ మూవీ సీక్వెల్‌తో అనుష్క.. స్వీటీ బంపర్ ప్లాన్‌ను లీక్ చేసిన థమన్

దాదాపు ప్రతీ సినిమా ఇండస్ట్రీలో కూడా మేల్ హీరోల డామినేషన్ నే ఎక్కువగా ఉంటుంది అని అందరికీ తెలుసు. కానీ ఇలాంటి స్టార్స్ ఉన్నప్పటికీ కూడా కేవలం కొంతమంది స్టార్ హీరోయిన్స్ మాత్రమే ఎవర్ గ్రీన్ స్టార్డంతో మిగిలిపోయే వాళ్లు కూడా ఉంటారు. మరి ఇలా టాలీవుడ్ లో కూడా చాలా మంది స్టార్ హీరోస్ తో పాటుగా వారిలానే మంచి ఆదరణ, మార్కెట్ ని సొంతం చేసుకొని ఏళ్ల తరబడి ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వగలుగుతున్నారు.

కాగా ఇప్పుడు తెలుగు సినిమాలో స్టార్ హీరోయిన్స్ చాలా మంది ఉన్నప్పటికీ ది రియల్ ఓజి ఎవరు అంటే దాదాపు చెప్పే హీరోయిన్ పేరే అనుష్క శెట్టి. అభిమానులు ముద్దుగా స్వీటీ అని పించుకునే అనుష్కకి తెలుగులో మంచి మార్కెట్ ఉంది. అలాగే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.

Thaman leakes Anushka Shetty s Bhagamathie sequel plans on Indian Idol show

అయితే అనుష్క అప్పట్లోనే స్టార్ హీరోస్ రేంజ్ లో భారీ హిట్ "అరుంధతి" అనే హిట్ కొట్టి పెద్ద హీరోల రికార్డులకు సైతం చెమటలు పట్టించింది. ఇలా టాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు అంటే మళ్ళీ అనుష్క తోలి ఛాయిస్ గా మారింది. అక్కడ నుంచి అనుష్క చాలా హిట్స్ కొట్టింది కానీ మళ్ళీ అరుంధతి తర్వాత తనపై సోలోగా వచ్చి సాలిడ్ హిట్ అయ్యిన సినిమానే "భాగమతి".

మంచి సస్పెన్స్ థ్రిల్లర్ గా 2018 లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అనుష్క క్రేజ్ ని చూపించింది. బాహుబలి లాంటి సినిమా తర్వాత తన నుంచి పర్ఫెక్ట్ సినిమాగా ఇది వచ్చి అదరగొట్టింది. అయితే ఈ సినిమాకి ఇప్పుడు మేకర్స్ సైలెంట్ గా పార్ట్ 2 పనులు చేసేస్తున్నారట. అవును ఇది నిజమే. ప్రస్తుతం భాగమతీ 2 పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

Thaman leakes Anushka Shetty s Bhagamathie sequel plans on Indian Idol show

ఈ విషయాన్ని స్వయంగా సంగీత దర్శకుడు థమన్ ఎస్ రివీల్ చేసాడు. కాగా ఇపుడు అనుష్క దర్శకుడు క్రిష్ తో ఘాటీ అనే సినిమా చేస్తుండగా దీనితో పాటుగా తన నుంచి క్రేజీ యాక్షన్ థ్రిల్లర్ భాగమతి 2 కూడా తన నుంచి రాబోతుంది అని చెప్పాలి. కాగా ఈ చిత్రాన్ని దర్శకుడు జి అశోక్ తెరకెక్కిస్తుండగా పార్ట్ 2 కూడా థానే డిజైన్ చేసినట్టుగా తెలుస్తుంది.

ఇలా మొత్తానికి అనుష్క ఫ్యాన్స్ కి మాత్రం ఇది ఒక ఊహించని గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మరి చివరిసారిగా అనుష్క క్లీన్ హిట్ చిత్రం "మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి" అనే సినిమాలో నటించగా ఇది గత ఏడాది ఇదే సెప్టెంబర్ లో రిలీజ్ అయ్యి కొన్ని రోజులు కితమే ఏడాది పూర్తి చేసుకుంది. అలాగే ఈ సినిమాలో యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి హీరోగా నటించాడు. మళ్ళీ ఈ సినిమా తర్వాత గ్యాప్ ఎక్కువ తీసుకుంటుంది అనుకుంటున్న ఫ్యాన్స్ కి మాత్రం రానున్న రోజుల్లో మంచి సర్ప్రైజ్ లతోనే తాను రాబోతుంది అని చెప్పాలి.

More from Filmibeat

Read more about: anushka shetty arundhathi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X