Malavika Mohanan: బోల్డ్ సీన్స్ చేయడంపై మాళవికా మోహనన్ షాకింగ్ కామెంట్స్

Malavika Mohanan: ఫేమస్ సినిమాటోగ్రాఫ‌ర్ మోహ‌న‌న్ కుమార్తె అయిన మాల‌విక మోహ‌న‌న్ హీరోయిన్‌గా దూసుకుపోతోంది. మ‌ల‌యాళం, త‌మిళం, హిందీ అనే తేడా లేకుండా ప‌లు సినిమాల్లో న‌టించిన ఈ హాట్ బ్యూటీ తనకంటూ సొంత ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. పట్టం పోల్ అనే మలయాళ సినిమాలో మొదటిసారిగా నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది. తర్వాత బియాండ్ ది క్లౌడ్స్, ది గ్రేట్ ఫాదర్, పెట్టా, మాస్టర్, మారన్, క్రిస్టీ, అనే మూవీల్లో అవకాశం కొట్టేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ సర్దార్ 2, యుధ్రా, రాజా సాబ్ ప్రభాస్ సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం రాజాసాద్ సినిమా షూటింగ్స్ శరవేగంగా జరుపుకుంటున్నాయి. ఈ క్రమంలో రొమాంటిక్ సీన్లపై నటి మాళవిక ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఏంటో మీరు కూడా ఓ లూక్కేయండి.

నటి మాల‌విక మోహ‌న‌న్ సినీ కెరీర్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటుంది. ఈ ముద్దగుమ్మ నటించిన సినిమాలు కూడా మంచి టాక్‌తో దూసుకుపోతున్నాయి. వాస్తవానికి కాస్ట్యూమ్ డిజైనర్ హెల్త్ ఇష్యూ కారణంగా మాలవిక తన సొంత ప్రాజెక్టు కోసం డిజైనర్‌గా కూడా పని చేసింది. ఒక తమిళ బ్రాహ్మణ యువకుడు, ఒక క్రిస్టియన్ అమ్మాయి మధ్య సంబంధాన్ని వివరించిన రొమాంటిక్ డ్రామా చిత్రం కోసం వర్క్ చేసింది. కానీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు.

thangalaan actress Malavika Mohanan made interesting comments on intimate scenes romantic scenes

ఇటీవల మాళవికా మోహనన్ బ్లాక్ బస్టర్ సినిమా తంగలాన్ లో నటించింది. ఆరతిగా తన అద్భుతమైన నటనతో విమర్శకుల దృష్టిని ఆకర్షించింది. తనలోని సరికొత్త టాలెంట్‌ను బయటకు తీసుకొచ్చింది. ఇందులో మాళవిక శక్తివంతమైన పాత్ర పోషించింది. ఎమోషనల్ కాంప్లెక్సిటీతో పాటు గాఢమైన ఫిజిలిటీని బ్యాలెన్స్ చేసుకుంటూ మాళవిక అద్భుతంగా నటించింది. ఇకపోతే ఈ బ్యూటీ యుధ్రా అనే హిందీ సినిమాలో నటిస్తుంది. బాలీవుడ్‌లో ఇదే మాళవికకు మొదటి చిత్రం. ఈ సినిమాలో మాళవిక ముద్దు సీన్లలో,ఇంటిమేట్ సన్నివేశాల్లో నటించారు. తాజాగా రొమాంటిక్ సీన్లపై మాళవిక ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రొమాంటిక్ సీన్స్ ల్లో నటించడం అంత ఈజీ కాదని మాళవిక చెప్పుకొచ్చింది. అలాంటి సీన్స్ షూటింగ్ చేసేటప్పుడూ ఏ మూవీ సెట్ లో అయినా కో-ఆర్టినేటర్లను నియమిస్తారని తెలిపింది. నటీనటులు ఇబ్బంది పడకుండా.. ఎలా నటించారో వారు చెబుతారని పేర్కొంది. యూద్రా మూవీలోని సాథియా సాంగ్ గురించి సిద్ధాంత్ కు, తనకు చెప్పినప్పుడు ఫస్ట్ చాలా కంగారు పడ్డామని వెల్లడించింది. అసలూ ఈ సాంగ్ చేయగలమా? అని అనుమానం కూడా వచ్చిందని చెప్పింది.

thangalaan actress Malavika Mohanan made interesting comments on intimate scenes romantic scenes

సముద్ర తీరంలో షూటింగ్ అందులో విపరీతమైన చలి.. ఆ చలికి తట్టుకోలేక ఏదో ఒకరకంగా చేయడం బెటర్ అనుకుని తొందరగా కంప్లీట్ చేశామని తెలిపింది. డైరెక్టర్ చెప్పినట్లుగా చేశామని తెలిపింది. ఇంటిమేట్ సన్నివేశాల్లో నటించేటప్పుడు వాతావరణం అనుకూలంగా ఉండాలని మాళవిక వెల్లడించింది. ఇకపోతే యుధ్రా మూవీకి రవి ఉద్యావర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సిద్ధాంత్ చతుర్వేది కథానాయకుడిగా నటిస్తున్నాడు. శ్రీధర్ రాఘవన్ రాసిన ఈ స్టోరీ సెప్టెంబరు 20 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. రీసెంట్2గా సాథియా అనే మూవీ విడుదలైన విషయం తెలిసిందే.

More from Filmibeat

Read more about: malavika mohanan yudhra bollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X