నావి పెద్దగా ఉంటాయి.. వర్కౌట్ చేస్తుంటే అవే చూస్తున్నారు: సీతా రామం హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

సినీ రంగంలో హీరోయిన్లు ఎవరైనా స్టార్లుగా ఎదగాలంటే చాలా సమయం పడుతుంది. అలాంటిది కొందరు భామలు మాత్రం మొదటి చిత్రంతోనే సెన్సేషన్ అవుతున్నారు. అలాంటి వారిలో మృణాల్ ఠాకూర్ ఒకరు. తెలుగులో ఫస్ట్ మూవీతోనే ఎనలేని క్రేజ్‌ను తెచ్చుకున్న ఈ అమ్మడు.. వరుసగా ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. బాలీవుడ్‌లో సైతం తనదైన హవాను చూపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా మృణాల్ ఠాకూర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా తన బాడీ పార్టుల గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ వివరాలను మీరే చూసేయండి!

అక్కడ ముందే ఎంట్రీ
మోడల్‌గా ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న తర్వాత మృణాల్‌ ఠాకూర్‌.. 'ముజ్‌కే కుచ్ కెహతీ.. యే కామోషియాన్' అనే సీరియల్ ద్వారా నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సీరియళ్లను కూడా చేసింది. ఈ క్రమంలోనే 'విట్టి దండు' అనే మరాఠీ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి వరుసగా మూవీలు, సీరియళ్లు, ఆల్బమ్‌లు చేసింది.

The Family Star Actress Mrunal Thakur Reveals about Her Attractive Body Parts

టాలీవుడ్‌లో గ్రాండ్‌గా

హిందీలో ఎన్నో సినిమాలు, సీరియళ్లు చేసిన మృణాల్ ఠాకూర్.. దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన 'సీతా రామం'తో తెలుగులోకి కూడా అడుగు పెట్టింది. భారీ అంచనాలతో ప్యూర్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో మృణాల్ ఠాకూర్‌కు టాలీవుడ్‌లో సెన్సేషన్ అయింది. అలాగే, ఫాలోయింగ్‌ను భారీగా అందుకుంది.

The Family Star Actress Mrunal Thakur Reveals about Her Attractive Body Parts

నానితో హిట్ కొట్టింది
'సీతా రామం' విజయంతో మృణాల్ ఠాకూర్ పేరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిపోయింది. ఫలితంగా ఫాలోయింగ్‌తో పాటు మార్కెట్‌ను భారీగా పెంచుకుంది. దీంతో వరుసగా ఆఫర్లను కూడా అందుకుంటోంది. ఇలా ఇప్పటికే 'హాయ్ నాన్న'తో భారీ విజయాన్ని అందుకుంది. అయితే, ఇటీవలే వచ్చిన 'ది ఫ్యామిలీ స్టార్' మూవీ మాత్రం ఆమెకు బిగ్ షాక్ తగిలినట్లైంది.

The Family Star Actress Mrunal Thakur Reveals about Her Attractive Body Parts

ఇప్పుడు ఆ మూవీలు

తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస హిట్లతో క్రేజ్ తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్‌కు ఇక్కడ చాలా అవకాశాలు వచ్చినా తనకు నచ్చిన వాటిలోనే చేస్తోంది. అయితే, ఇప్పుడు మాత్రం ఈ ముద్దుగుమ్మ 'Pooja Meri Jaan' అనే బాలీవుడ్ మూవీలోనే నటిస్తోంది. దీనితో పాటు తెలుగులో ప్రభాస్‌తో ఓ సినిమాను చేయడానికి సిద్ధం అవుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

The Family Star Actress Mrunal Thakur Reveals about Her Attractive Body Parts

బాడీ పార్ట్‌పై కామెంట్
సౌత్‌లో కాకపోయినా నార్త్‌లో అయినా మూవీలు చేస్తూ మృణాల్ ఠాకూర్ ఫుల్ బిజీగా మారిపోయింది. ఈ క్రమంలోనే ఆమె వరుసగా ఇంటర్వ్యూలు, చిట్ చాట్‌లు జరుపుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా మృణాల్ ఠాకూర్ తన బాడీలోని పార్టుల్లో అందరూ తొడల గురించే మాట్లాడుతున్నారని షాకింగ్ కామెంట్స్ చేసింది.

The Family Star Actress Mrunal Thakur Reveals about Her Attractive Body Parts

నావి పెద్దగా ఉంటాయి

మృణాల్ ఠాకూర్ కొనసాగిస్తూ.. 'నా బాడీ మొత్తంలో తొడలు చాలా పెద్దగా ఉంటాయి. అది నాకు దేవుడు ఇచ్చాడు. కాబట్టి చూపించడంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ, చాలా మంది నేను వర్కౌట్ చేస్తున్న సమయంలో వాటినే చూస్తుంటారు. అవి తగ్గించడానికి ట్రై చేస్తున్నావా అని అడుగుతారు. అయితే, నేను అందుకు చేయడం లేదని వాళ్లకు చెప్తాను' అని చెప్పింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X