వ్యభిచార గృహంలో ఫ్యామిలీ స్టార్ హీరోయిన్.. గదిలో దగ్గరుండి మరీ అలా చూడడంతో!
ఈ మధ్య కాలంలో సినిమాల్లోకి వచ్చే వారిలో చాలా మంది దేశ వ్యాప్తంగా గుర్తింపును సొంతం చేసుకుని సత్తా చాటుతోన్నారు. అలాంటి వారిలో క్యూట్ లేడీ మృణాల్ ఠాకూర్ ఒకరు. చాలా కాలం క్రితమే ఈ అమ్మడు బాలీవుడ్‌లో సినిమాలు చేయగా.. తెలుగులోకి వచ్చినప్పటి నుంచి మరింత పేరు తెచ్చుకుంది.
దీంతో వరుసగా అవకాశాలను సొంతం చేసుకుంటూ హవాను చూపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా మృణాల్ ఠాకూర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా గతంలో వ్యభిచార గృహంలో గడిపిన విషయాలను పంచుకుంది. ఆ వివరాలను మీరే చూసేయండి!

అప్పుడే అలా పాపులర్
మోడలింగ్ రంగంలో సత్తా చాటుతోన్నప్పుడే మృణాల్ ఠాకూర్.. 'ముజ్‌కే కుచ్ కెహతీ.. యే కామోషియాన్' అనే సీరియల్ ద్వారా నటిగా పరిచయమైంది. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సీరియళ్లలో నటించింది. ఈ క్రమంలోనే 'విట్టి దండు' అనే మరాఠీ మూవీతో హీరోయిన్‌గా పరిచయమైంది. అప్పటి నుంచి వరుసగా మూవీలు, సీరియళ్లు, ఆల్బమ్‌లు చేసి పాపులర్ అయింది.

సీతగా ఫుల్ సెన్సేషన్
బాలీవుడ్ చిత్రాలు, సీరియళ్లతో సత్తా చాటిన మృణాల్ ఠాకూర్.. దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన 'సీతా రామం'తో తెలుగులోకి హీరోయిన్‌గా పరిచయమైంది. భారీ అంచనాలతో ప్యూర్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో మృణాల్ ఠాకూర్‌కు టాలీవుడ్‌లో సెన్సేషన్ అయింది. అలాగే, క్రష్ లిస్టులోనూ చేరిపోయింది.

మరో హిట్.. ఓ ఫ్లాప్‌తో
'సీతా రామం' హిట్‌తో మృణాల్ ఠాకూర్ పేరు తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్‌గా మారిపోయింది. ఫలితంగా ఫాలోయింగ్‌ను అమాంతం పెంచుకోవడంతో పాటు వరుసగా ఆఫర్లను కూడా దక్కించుకుంటోంది. ఇలా ఇప్పటికే 'హాయ్ నాన్న'తో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అయితే, ఇటీవలే వచ్చిన 'ది ఫ్యామిలీ స్టార్' మూవీ మాత్రం ఆమెకు నిరాశనే మిగిల్చింది.
అక్కడ సినిమాలతోనే
టాలీవుడ్‌లో వరుస హిట్లతో యమా పేరు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్‌కు ఇక్కడ చాలా అవకాశాలు వచ్చినా తనకు నచ్చిన వాటినే చేస్తోంది. అయితే, ఇప్పుడు మాత్రం ఈ ముద్దుగుమ్మ 'Pooja Meri Jaan' అనే బాలీవుడ్ మూవీలోనే నటిస్తోంది. దీనితో పాటు తెలుగులో సైతం కొన్ని సినిమాల కోసం చర్చలు జరుగుతోంది. అలాగే, వెబ్ సిరీస్‌లకూ ఓకే చెప్తోంది.

వ్యభిచార గృహంలోకి
గతంలో కంటే ఈ మధ్య కాలంలో మృణాల్ ఠాకూర్ ఫుల్ బిజీగా మారిపోయింది. ఈ క్రమంలోనే ఆమె వరుసగా ఇంటర్వ్యూలు, చిట్ చాట్‌లు జరుపుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా చాలా కాలం క్రితం వ్యభిచార గృహంలో గడిపిన అనుభవం గురించి మృణాల్ ఠాకూర్ మీడియాతో పంచుకుంది.

డిప్రెషన్‌లోకి వెళ్లింది
తాజా ఇంటర్వ్యూలో మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ.. 'నేను 2018లో లవ్ సోనియా అనే సినిమాలో నటించాను. అందులో మహిళల అక్రమ రవాణా నుంచి తన చెల్లిని కాపాడే పాత్రను చేశాను. ఈ సినిమాలో నా పాత్రను రియలిస్టిక్‌గా చేయాలన్న ఉద్దేశంతో దాదాపు రెండు నెలల పాటు వ్యభిచార గృహాల్లో గడిపాను. దీనివల్ల డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను' అంటూ చెప్పుకొచ్చింది.
అలా కోలుకున్నానని
ఇదే ఇంటర్వ్యూలో మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ.. 'వ్యభిచార గృహాల్లో మగ్గుతోన్న యువతుల బాధలు, కన్నీటి గాథలను విన్న తర్వాత డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. ఆ సమయంలో డైరెక్టర్ తబ్రేజ్ నూరానీ నాకు బాసటగా నిలిచి కౌన్సెలింగ్ ఇప్పించారు. ఆయన వల్లే ఇప్పుడు ఇలా ఉన్నాను. లేకుంటే పరిస్థితి ఎలా ఉండేదో ఆలోచించలేను' అని ఆవేదన వ్యక్తం చేసింది.


Click it and Unblock the Notifications











