సాయిపల్లవిని ముద్దు పెట్టుకొన్న అభిమాని.. అందరు చూస్తుండగా ఆ ప్లేస్‌లో కిస్!
లేడీ పవర్ స్టార్ సాయి పల్లవికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే. తమిళ చిత్రాలతో నటిగా మారిన ఈ నేచురల్ బ్యూటీ తెలుగు ఆడియెన్స్ లోనూ ఎంత సెన్సేషన్ గా నమారిందో అందరికీ తెలిసిందే. ఆమె సినిమాలు, నటన, డ్యాన్స్ తో ప్రేక్షకులనూ కట్టిపడేస్తోంది. ప్రతి చిత్రంతో మరింత ఫ్యాన్ బేస్ ను పెంచుకుంటూ పోతోంది. దక్షిణాదిలో సాయిపల్లవికి ఉన్న ఫ్యాన్ ఫాయిలోయింగ్ మరో హీరోయిన్ కు లేదంటే అతిశయోక్తి కాదు. ఆమెకు డై హార్ట్ ఫ్యాన్స్ ఉంటారనేది ముమ్మాటికి వాస్తవం.
సాయిపల్లవి ప్రస్తుతం ఏ మూవీలో నటించిన మినిమమ్ హిట్ టాక్ దక్కించుకుంటోంది. రోటీన్ కు భిన్నంగా సినిమాలు చేస్తున్న సాయిపల్లవి ప్రేక్షకులకు మంచి కథలతో సినిమాలను అందిస్తోంది. థియేటర్లలో తన నటవిశ్వరూపం చూపిస్తూ ఆకట్టుకుంటోంది. ఇక రీసెంట్ గా 'తండేల్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాయి పల్లవి మరో బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. అక్కినేని నాగచైతన్యతో కలిసి నటించినా సాయిపల్లవికి రావాల్సిన క్రెడిట్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఒకింత తనకే మరింత క్రెడిట్ దక్కిందంటున్నారు సినీ విశ్లేషకులు.

ఇక 'తండేల్' విడుదలకు ముందుకు 'తండేల్ జాతర' జరిగిన విషయం తెలిసిందే. ఆ ఈవెంట్ లోని ఒక వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. అదేంటో కాదు.. సాయి పల్లవి ఫ్యాన్ రేంజ్ ను చూపించే వీడియో. అదేంటంటే.. సాయి పల్లవి 'తండేల్ జాతర'కు హాజరైన సందర్భంగా ఓ మహిళా అభిమాని వెనకాల నుంచి అందరినీ దాటుకుంటూ సాయి పల్లవి వద్దకు వచ్చింది. అభిమానిని చూసి సాయిపల్లవి షేక్ హ్యాండ్ ఇచ్చింది. వెంటనే అభిమాని సాయిపల్లవి చేతికి ముద్దు పెట్టింది. భాష సినిమాలో రజినీకాంత్ పోషించిన మాణిక్ బాషాను గుర్తు చేసింది.
మాణిక్ బాషకు అతని అనుచరులంతా వచ్చి చేతికి ముద్దుపెట్టి వెళ్తుంటారు. అదే సీన్ ఇప్పుడు సాయిపల్లవి చేతిని అభిమాని ముద్దుపెట్టడంతో రిపీటైందంటున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. లేడీ పవర్ స్టార్ ట్యాగ్ ఉన్న సాయిపల్లవి ఈ సీన్ తో తన క్రేజ్ తగ్గ ట్యాగ్ ను పొందిందనిపించింది. ఇక సాయి పల్లవి నటించిన 'తండేల్' ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. తొమ్మిదిరోజుల్లోనే వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం రూ.100 కోట్లకు పైగా గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
సాయిపల్లవి కూడా తనకున్న వ్యక్తిత్వానికి తగ్గట్టుగానే ఆఫ్ స్క్రీన్ ప్రజెన్స్ కూడా ఇస్తుంది. ఎక్కడా తన అభిమానులను అప్సెట్ చేయకుండా నడుచుకుంటూ ఉంటుంది. ఇక రొమాంటిక్ సీన్లకు ఈ నేచురల్ బ్యూటీ దూరంగా ఉంటూ కూడా సెన్సేషనల్ హిట్లను దక్కించుకుటోంది. 'తండేల్' చిత్రానికి ముందు తమిళంలో శివ కార్తీకేయ సరసన 'అమరన్' చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఆ చిత్రం కూడా మంచి సక్సెస్ ను అందుకుంది. ఇక బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తూ 'ఎక్ దిన్', 'రామాయణ : పార్ట్ 1' చిత్రాలు చేస్తోంది.


Click it and Unblock the Notifications











