‘హీరోలలో మేకవన్నె పులులు.. టైం చూసి అమ్మాయిల్ని.. నా కళ్లతో చూశా’

చిత్ర పరిశ్రమ బయటికి కనిపించేంత మంచిగా ఉండదని తెరవెనుక ఎన్నో చీకటి బాగోతాలు జరుగుతుంటాయని ఎంతో మంది బయటపెట్టారు. పైకి పెద్ద మనుషుల్లా నటించే వారంతా మంచివాళ్లు కాదని మనకి తెలియని సంగతులు చాలానే ఉన్నాయని నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎన్నో సీక్రెట్స్ బయటపెట్టారు. తాజాగా స్టార్ హీరోయిన్ మాళవిక మోహనన్ సినీ పరిశ్రమలోని బాగోతాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

రాజా సాబ్‌తో టాలీవుడ్ ఎంట్రీ
టాలెంటెడ్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న మాళవిక మోహనన్.. ఇప్పటి వరకు తమిళ, మలయాళ భాషలపై ఫోకస్ పెట్టి స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- మారుతి కాంబోలో తెరకెక్కుతోన్న ది రాజా సినిమాలో మాళవిక నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్ ఈ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. అనుకోకుండా హీరోయిన్ అయిన మాళవికకు నిజానికి దర్శకురాలిగానో, సినిమాటోగ్రాఫర్‌గానో స్థిరపడాలని అనుకున్నారు. తండ్రి కేయూ మోహనన్ ఫేమస్ సినిమాటోగ్రాఫర్ కావడంతో ఇది కూడా ఓ కారణం కావొచ్చు. అయితే ఆమె అందమే మాళవికను కెమెరా ముందుకు తీసుకొచ్చింది.

The Raja Saab Actress Malavika Mohanan make sensational comments on dark side of Film Industry

ప్రభాస్‌పై ప్రశంసలు
తెలుగులో తొలిసారి నటించడంపై మాళవిక చాలా సంతోషంగా ఉన్నారు. అది కూడా ప్రభాస్‌తో కావడంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోతోంది. అందరూ అనుకున్నట్లు ప్రభాస్ రిజర్వ్‌డ్ టైప్కాదని.. ఆయన మంచి మాటకారి అని.. సూపర్ ఫన్నీ అని అన్నారు. డార్లింగ్ పక్కనే ఉంటే అసలు బోర్ కొట్టదని.. తన సహనటులకు ఎప్పుడూ ఏదో ఒక రుచి చూపిస్తూనే ఉంటారని మాళవిక చెప్పారు. కల్కి లాంటి హిట్స్ తర్వాత ప్రభాస్ చాలా సింపుల్‌గా ఉంటారని, ఆయన డౌన్ టు ఎర్త్ అని ప్రశంసించారు. ప్రస్తుతం రాజా సాబ్ తో పాటు తమిళంలో కార్తీ హీరోగా తెరకెక్కుతోన్న సర్దార్ 2 చిత్రంలోనూ నటిస్తున్నారు మాళవిక.

ముద్దు ఇవ్వమని వెంటపడ్డాడు
సోషల్ మీడియాలోనూ, మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటారు మాళవిక మోహననన్. సమయం కుదిరినప్పుడల్లా మీడియాతో చిట్ చాట్ నిర్వహిస్తుంటారు. కొద్దిరోజుల క్రితం ముంబై లోకల్ ట్రైన్‌‌లో తనకు జరిగిన చేదు అనుభవాన్ని పంచుకున్నారు. చదువుకుంటున్న రోజుల్లో రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ముంబై లోకల్ ట్రైన్‌లో ప్రయాణఫిస్తుండగా.. ఒక వ్యక్తి తన సమీపానికి వచ్చి ముద్దు అడిగాడని చెప్పింది. ఆ సమయంలో నాతో ఉన్న స్నేహితురాళ్లు ఆ సమయంలో ఏం చేయాలో తెలియక భయపడ్డానని మాళవిక ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆ తర్వాతి స్టేషన్‌లో ప్రయాణికులు తమ బోగీలోకి రావడంతో అతని నుంచి తప్పించుకున్నామని గుర్తుచేసుకున్నారు.

మేకవన్నె పులులు
ఇక చిత్ర పరిశ్రమలోని పరిస్ధితులు, మనుషుల గురించి ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు మాళవిక మోహనన్. చిత్ర పరిశ్రమలో ఆడ, మగ వివక్ష చూపిస్తున్నారని.. హీరోలకు దొరికే గౌరవం, మర్యాద మహిళా నటులకు ఇవ్వరని ఆరోపించారు. రెమ్యునరేషన్ విషయంలో హీరోలు ఎంత చెబితే అంత అని.. కానీ హీరోయిన్లకు మాత్రం గీచి గీచి బేరాలు ఆడతారని మాళవిక పేర్కొన్నారు. అలాగే ఇండస్ట్రీలో కొందరు మేక వన్నె పులులు లాంటి హీరోలు, నటులు ఉన్నారని కెమెరా ముందు ఒకలా, దాని వెనుక మరోలా వారు ఉంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా అమ్మాయిల ముందు మంచివారిగా నటిస్తూ, అదను చూసి ముసుగు తీసేస్తారని, ఇండస్ట్రీకి వచ్చిన నాటి నుంచి తాను ఇలాంటి కళ్లారా చూశానని మాళవిక మోహనన్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X