ఓ రేంజ్‌లో తెగించిన నిధి అగర్వాల్.. ఉల్లిపొరలాంటి డ్రెస్‌లో అందాల ప్రదర్శన

చూపు తిప్పుకోకుండా చేసే అందం, అదిరిపోయే నటనతో తెలుగు చిత్ర పరిశ్రమలో స్పెషల్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరోయిన్ నిధి అగర్వాల్. సాదాసీదాగానే సినిమాల్లోకి వచ్చిన ఈ అమ్మడు.. అనతి కాలంలోనే అద్భుతమైన పేరును సొంతం చేసుకుంది. దీంతో వరుసగా ఆఫర్లను అందుకుంటూ ముందుకు సాగుతోంది. ఇలా ఇప్పుడు ఎన్నో భారీ ప్రాజెక్టుల్లో భాగం అవుతోంది. అదే సమయంలో నిధి అగర్వాల్ సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఓ క్రేజీ పిక్‌ను షేర్ చేసింది. దాని మీద మీరు కూడా ఓ కన్నేయండి మరి!

హైదరాబాద్ పిల్ల ఎంట్రీ
హైదరాబాద్ నగరానికి చెందిన నిధి అగర్వాల్ తన చదువును ఇక్కడే పూర్తి చేసుకుంది. ఆ తర్వాత ఈమె ఫ్యామిలీ కర్నాటకకు వలస వెళ్లిపోయింది. అక్కడ ఈ చిన్నది మోడల్‌గా మొదలు పెట్టుకుంది. ఈ క్రమంలోనే ఎన్నో బ్రాండ్లను ప్రమోట్ చేసింది. ఆ తర్వాత అంటే 2017లో 'మున్నా మైఖేల్' అనే హిందీ సినిమాతో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా పరిచయం అయింది.

The Raja Saab Heroine Nidhhi Agerwal Latest Nice Looking Photo Viral

వరుసగా ఫ్లాప్‌లే వచ్చినా
హీరోయిన్‌గా పరిచయం అయిన తర్వాత నిధి అగర్వాల్ 'సవ్యసాచి' అనే మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ, ఇది ఆమెకు మంచి ఆరంభాన్ని అందించలేదు. ఆ తర్వాత అఖిల్‌తో 'మిస్టర్ మజ్నూ' సినిమాలోనూ నటించింది. ఇది కూడా నిరాశనే మిగల్చడంతో నిధి అగర్వాల్‌కు ఆరంభంలోనే ఫ్లాప్‌లు ఎదురయ్యాయి. అయినప్పటికీ నటన పరంగా పేరు దక్కింది.

ఇస్మార్ట్ హిట్.. అది షాక్
సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా నిధి అగర్వాల్‌కు ఆఫర్లు మాత్రం బాగానే వచ్చాయి. అలా ఈ అమ్మడు రామ్ 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో అవకాశం అందుకుంది. ఈ మూవీతో నిధి అగర్వాల్‌కు మొదటి విజయం కూడా వచ్చింది. అయితే, ఆ వెంటనే నిధి అగర్వాల్‌ నటించిన 'హీరో' మూవీ మాత్రం నిరాశనే మిగిల్చింది. దీంతో టాలీవుడ్‌కు కాస్త గ్యాప్ ఇచ్చేసింది.

The Raja Saab Heroine Nidhhi Agerwal Latest Nice Looking Photo Viral

పవన్, ప్రభాస్‌‌కు జోడీగా
నిధి అగర్వాల్ వరుసగా సినిమాలు చేయకున్నా.. తనదైన రీతిలో క్రేజీ ఆఫర్లతో హవాను చూపిస్తోంది. ఈ అమ్మడు ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు'లో నటిస్తోంది. అలాగే, ప్రభాస్ - మారుతి 'ది రాజా సాబ్' మూవీలోనూ హీరోయిన్‌గా చేస్తోంది. వీటితో పాటు వెబ్ సిరీస్‌లు, ప్రారంభోత్సవాలు, స్పెషల్ ఈవెంట్లతో నిధి అగర్వాల్ హడావిడి చేసేస్తోంది.

అందులో హల్చల్‌గానే
సినిమాల పరంగా పెద్దగా సక్సెస్ కాలేకపోయినా అవకాశాలను మాత్రం నిధి అగర్వాల్ బాగానే దక్కించుకుంటోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటూ ఫాలోయింగ్‌ పెంచుకుంటోంది.

The Raja Saab Heroine Nidhhi Agerwal Latest Nice Looking Photo Viral

అందాల ఆరబోతతోనూ
నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో చేసే గ్లామర్ షో గురించి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఈ అమ్మడు అందాల ఆరబోత మరింత ఎక్కువ అయిపోయింది. ఇక, ఈ మధ్య తరచూ నిధి అగర్వాల్ గ్లామర్‌ను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వదులుతోంది. దీంతో నిధి అగర్వాల్ దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అయిపోతోంది.

నిధి హాట్ ఫొటో వైరల్‌
తాజాగా నిధి అగర్వాల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను వదిలింది. ఇందులో ఆమె ట్రాన్స్‌పరెంట్ డ్రెస్ వేసుకుని కనిపించింది. దీంతో ఆమె క్లీవేజ్ యమా హైలైట్ అవుతోంది. ఫలితంగా ఈ చిన్నది అందాలతో కుర్రాళ్లను కవ్విస్తోంది. దీంతో ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. ఫలితంగా నిధి అగర్వాల్ పిక్ యమ వైరల్ అయిపోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X