ఆ విషయంలో చాలా ఇబ్బందిపడ్డా.. ప్రభాస్‌పై నిధి అగర్వాల్ కామెంట్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా నటిస్తున్న లేటేస్ట్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja Saab). ఈ మూవీపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మొదట్లో ఈ సినిమాపై పెద్దగా బజ్ లేకపోయినా, మూవీ టీమ్ విడుదల చేసిన పాటలు, టీజర్, ట్రైలర్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తి ఒక్కసారిగా పెరిగింది. రొమాంటిక్ హారర్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ మూవీ 2026 సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌ను జోరుగా నిర్వహిస్తోంది. ఇటీవల 'ది రాజాసాబ్' ప్రమోషన్స్‌లో భాగంగా హీరోయిన్ నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్‌పై కామెంట్స్ చేసింది. ఈ ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఏమన్నారంటే?
రాజాసాబ్ ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ నిధి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'హరి హర వీర మల్లు' విడుదల తర్వాత తన కెరీర్‌లో కొత్త అధ్యాయం ప్రారంభమైందని తెలిపారు. ఆ సినిమా తర్వాత మూడు తెలుగు చిత్రాలకు సైన్ చేశానని, అందులో 'ది రాజాసాబ్' తనకు చాలా ప్రత్యేకమైన ప్రాజెక్ట్ అని చెప్పారు. ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్‌తో పనిచేయడం తన కెరీర్‌లో ఓ మైలురాయి అని పేర్కొన్నారు. ఇక రాజాసాబ్ మూవీలోని పాటల షూటింగ్ కోసం గ్రీస్‌కు వెళ్లిన అనుభవాన్ని నిధి గుర్తు చేసుకున్నారు. షూటింగ్ సమయంలో తాను పూర్తిగా స్వతంత్రంగా ఉండాలని భావించి, ఉదయం బ్రేక్‌ఫాస్ట్ నుంచి రాత్రి డిన్నర్ వరకు స్వయంగా వండుకుని తిన్నానని చెప్పారు.

'ది రాజాసాబ్' విషయంలో మరో ప్రత్యేక విషయం ఏమిటంటే.. ఈ సినిమాకోసం నిధి తొలిసారిగా తెలుగులో స్వయంగా డబ్బింగ్ చెప్పడం. ఇప్పటివరకు ఇతర సినిమాల్లో డబ్బింగ్ ఆర్టిస్టులపై ఆధారపడిన నిధి, ఈసారి మాత్రం తన పాత్రకు పూర్తి న్యాయం చేయాలనే ఉద్దేశంతో తానే డబ్బింగ్ చెప్పానని వెల్లడించారు. దీంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యే అవకాశం ఉందని ఆమె భావిస్తున్నారు. ఇక ఇదే ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి మాట్లాడుతూ నిధి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కెరీర్‌లో తొలిసారిగా ఎత్తు విషయంలో ఫీల్ అయ్యాననీ, హీరో ప్రభాస్ ఎత్తుకు సరిపడేందుకు 'ఆపిల్ బాక్స్' ఉపయోగించాల్సి వచ్చిందని నవ్వుతూ చెప్పారు. ప్రభాస్‌తో సీన్స్‌లో సహజంగా కనిపించేందుకు ఇది అవసరమైందని తెలిపారు. అదే సమయంలో, కొన్ని సన్నివేశాల్లో ప్రభాస్‌తో కలిసి నటించడం కొద్దిగా ఇబ్బందిగా అనిపించిందని, ఆయన ఎత్తు, స్క్రీన్ ప్రెజెన్స్ వల్ల తాను కొంచెం టెన్షన్ ఫీలయ్యానని చెప్పుకొచ్చారు.
అయితే ప్రభాస్ చాలా సపోర్టివ్‌గా ఉండి, తనను కంఫర్ట్‌గా ఫీల్ అయ్యేలా చేశారని ప్రశంసలు కురిపించారు. ఇటీవల తన చుట్టూ జరిగిన వివాదాలను పక్కనపెట్టి, పూర్తిగా 'ది రాజాసాబ్' ప్రమోషన్స్‌పైనే ఫోకస్ చేస్తున్నట్లు నిధి స్పష్టం చేశారు. ఈ సినిమా తన కెరీర్‌కు మంచి టర్నింగ్ పాయింట్ అవుతుందనే నమ్మకం ఉందని చెప్పారు.
టాలెంటెడ్ డైరెక్టర్ మరుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు మలవిక మోహనన్, రిధ్ధి కుమార్ కూడా హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంగీత దర్శకుడు ఎస్.ఎస్.తమన్ అందించిన పాటలు ఇప్పటికే భారీ రెస్పాన్స్ వస్తోంది. తాజాగా విడుదలైన ట్రైలర్ కూడా అంచనాలను మరింత పెంచింది.
ఇలా భారీ అంచనాల మధ్య ఈ మూవీ జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్నది. ది రాజాసాబ్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఆసక్తిగా వేచి ఎదురుచూస్తున్నారు. నిధి అగర్వాల్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఈ సినిమాపై క్రేజ్‌ను మరింత పెంచాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.


Click it and Unblock the Notifications











