The Rajasaab: ప్రభాస్‌తో నటించడం విధిరాతే.. ఆ సినిమా ఛాన్స్ పోయినా ఇలా కల నెరవేరింది!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ది రాజాసాబ్ ( The Rajasaab). ఈ ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. హారర్ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్, రొమాన్స్ అంశాల మేళవింపుతో రూపొందుతున్న ఈ సినిమా జనవరి 9న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించి ఏ చిన్న విషయమైనా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారుతోంది.

ఈ చిత్రంతో మలయాళీ బ్యూటీ మాళవిక మోహనన్ తొలిసారిగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుండటం మరో స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది. ఇప్పటికే మలయాళం, తమిళ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మాళవిక, సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇప్పుడు ప్రభాస్ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టడం ఆమె కెరీర్‌లో కీలక మలుపుగా చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో రాజాసాబ్ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మాళవిక మోహనన్, తన కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

The Rajasaab Heroine Malavika Mohanan Says Acting With Prabhas Was Destiny After Salaar

మాళవిక మోహనన్ మాట్లాడుతూ.. ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన 'సలార్' సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం ముందుగా నాకు వచ్చింది. ఆ సినిమాలో శ్రుతి హాసన్ చేసిన పాత్ర కోసం మొదట నన్నే సంప్రదించారు'అని చెప్పింది. 'మాస్టర్' సినిమా విడుదలైన కొన్ని నెలల తర్వాత తనకు కాల్ వచ్చిందని, ప్రభాస్‌తో ప్రశాంత్ నీల్ ఓ సినిమా చేస్తున్నారని, మీట్ కావాలని కోరుతున్నారని చెప్పారని వెల్లడించింది. 'నిజమేనా అనిపించింది. తర్వాత బెంగుళూరు వెళ్లి ప్రశాంత్ నీల్‌ని కలిశాను. ఆయన నన్ను కొన్ని ఫోటోలు తీశారు. అది ఫోటో షూట్ కాదు. ఇండియన్, వెస్ట్రన్ డ్రెస్సుల్లో నేను ఎలా కనిపిస్తానో చూడటానికే' అని వివరించింది.

అన్నీ బాగానే జరిగాయని, దాదాపు ఆ సినిమా తానే చేయబోతున్నాననే స్థాయికి వెళ్లిందని, కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ వర్కౌట్ కాలేదని చెప్పింది. 'ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో, అది కూడా డెబ్యూ మూవీలో నటించే ఛాన్స్ మిస్ అవ్వడం నాకు చాలా బాధ కలిగించింది' అంటూ ఆమె ఎమోషనల్‌గా మాట్లాడింది. అయితే.. సలార్ ఛాన్స్ మిస్ అయిన కొన్ని నెలలకే మళ్లీ ప్రభాస్ పక్కన నటించే అవకాశం వచ్చిందని మాళవిక వెల్లడించింది.

'6-8 నెలల తర్వాత మళ్లీ నాకు కాల్ వచ్చింది. ప్రభాస్ సినిమాలో హీరోయిన్ ఆఫర్ అన్నారు. ఆల్రెడీ వేరే హీరోయిన్ తీసుకున్నారు కదా అనుకున్నాను. కానీ అది సలార్ కాదు, రాజాసాబ్ అని చెప్పారు. వెంటనే ప్రాజెక్ట్ సైన్ చేశాను' అంటూ ఆనందాన్ని వ్యక్తం చేసింది.
'ప్రభాస్ సినిమాతోనే తెలుగులోకి రావాలని డెస్టినీ రాసిపెట్టిందేమో అనిపించింది. ప్రకృతి నన్ను ప్రభాస్‌తో కలిపింది... విధి కలిపింది' అంటూ మాళవిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

'ది రాజాసాబ్' సినిమాలో తాను భైరవి అనే పాత్రలో నటిస్తున్నట్లు మాళవిక తెలిపింది. ఈ పాత్రలో తనకు క్యూట్ సీక్వెన్సులు, ఫన్నీ సీన్స్‌తో పాటు యాక్షన్ సన్నివేశాలు కూడా ఉన్నాయని చెప్పింది. గ్లామర్‌తో పాటు నటనకు కూడా మంచి స్కోప్ ఉందని ఆమె పేర్కొంది. ఇక ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. బాహుబలి కంటే ముందే ప్రభాస్ అంటే నాకు ఇష్టం. బాహుబలి తర్వాత అది ఇంకా పెరిగింది. నాకంటే నా అమ్మకు ప్రభాస్ అంటే ఇంకా ఎక్కువ ఫ్యాన్‌గిర్లిజం' అంటూ సరదాగా చెప్పుకొచ్చింది. మాళవిక చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Read more about: malavika mohanan prabhas rajasaab
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X