ఈ ప్రేమలో స్వేచ్ఛ లేదు, గడీల గురించి విని ఆశ్చర్యపోయా: శివాత్మిక రాజశేఖర్
రాజశేఖర్ కూతరు శివాత్మిక త్వరలో 'దొరసాని' అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఆమెకు జోడీగా ఆనంద్ దేవరకొండ నటిస్తున్నాడు. తాజాగా మీడియాతో శివాత్మిక ఈ చిత్రానికి సంబంధించిన విషయాలు పంచుకున్నారు.
సాధారణ ప్రేమకథా చిత్రాల్లో కనిపించే స్వేచ్ఛ ఈ ప్రేమకథో ఉండదు. మా ప్రేమ కళ్ళలోనే తెలుస్తుంది. అదే ఈ కథను కొత్త గా ప్రజెంట్ చేస్తుంది. నా క్యారెక్ట్ కి పెద్దగా డైలాగ్ కూడా ఉండవు, పాత్రలోని ఎమోషన్స్ అన్నీ కళ్ళలోనే పలించడం ఛాలెంజ్‌గా అనిపించిందని తెలిపారు.
'దొరసాని' షూటింగ్ కోదాడ దగ్గర ఒక గడీలో 25 డేస్ షూట్ చేశాం. 150 యేళ్ళ క్రితం నాటి గడీ అది. షూటింగ్ సమయంలో డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ గడీల గురించి చెప్పే విషయాలు విని ఆశ్చర్యపోయినట్లు శివాత్మక తెలిపారు.

'దొరసాని' కథ గురించి వివరిస్తూ... దొరసాని అని పిలవబడే దేవకి అనే అమ్మాయి బయటి ప్రపంచం తెలియకుండా పెరుగుతుంది. రాజు అనే కుర్రాడు దొరసాని జీవితంలోకి వచ్చాక ఏం జరిగిందనేది ఆసక్తికరంగా ఉంటుంది అని శివాత్మిక తెలిపారు.
దొరసాని మూవీ ద్వారా 'షార్ట్ ఫిల్మ్ మేకర్ కెవిఆర్ మహేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ద్వారా ఆయన మెయిన్ స్ట్రీమ్ మూవీ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. దొరసాని చిత్రాన్ని నిర్మాత యష్ రంగినేని, మధుర శ్రీధర్‌లు నిర్మిస్తున్న ఈ సినిమా సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
1980 కాలం నాటి పరిస్థితులకు అద్దం పడుతూ రియల్ లైఫ్ సంఘటనలను స్పూర్తిగా తీసుకుని 'దొరసాని' కథను తయారు చేసినట్లు, దీన్ని పూర్తి చేయడానికి తనకు 5 సంవత్సరాల సమయం పట్టినట్లు కెవిఆర్ మహేంద్ర తెలిపారు.


Click it and Unblock the Notifications











