‘మహర్షి’ హీరోయిన్ పూజా హెగ్డే.. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో చిక్కిందా? ఏం జరిగిందంటే...
Recommended Video
'మహర్షి' చిత్రంలో హీరోయిన్‌గా నటించిన పూజా హెగ్డే మీద ఓ సంచలన రూమర్ గురువారం ఉదయం నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బుధవారం రాత్రి ఆమె పోలీసులు నిర్వహిస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిందనే ఆ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
'మహర్షి' ప్రీ రిలీజ్ ఈవెంట్ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో వైభవంగా సాగిన సంగతి తెలిసిందే. ఈవెంట్ ముగిసిన అనంతరం ఓ స్టార్ హోటల్‌లో తన టీమ్‌తో కలిసి సెలబ్రేషన్స్‌లో పాల్గొన్న ఆమె మద్యం సేవించిందని, తిరిగి వస్తుండగా పట్టుబడిందని ఆ రూమర్స్ సారాంశం.

అసలు ఏం జరిగిందంటే..
‘మహర్షి' ఆఫ్టర్ పార్టీ నుంచి తిరిగి వస్తుండగా పూజా హెగ్డే మేనేజర్ కారుడ్రైవ్ చేస్తున్నారని, పూజా హెగ్డే వెనక సీట్లో కూర్చున్నట్లు తెలుస్తోంది. అయితే పార్టీలో మేనేజర్ కూడా కాస్త డ్రింగ్ వేసి ఉన్నారట. పోలీసులు చెక్ చేస్తుండగా మేనేజర్ దొరికినట్లు టాక్.

మేనేజర్ కారు సీజ్ చేసిన పోలీసులు?
పోలీసులు చెక్ చేయడంతో మేనేజర్ మద్యం సేవించినట్లు తేలడంతో... అతడి లైసెన్స్ స్వాధీనం చేసుకోవడంతో పాటు, కారును సీజ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వెంటనే పూజా హెగ్డే మరో కారు తెప్పించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అయితే పూజా హెగ్డే డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిందనే విషయంలో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది.

అలాంటి వ్యక్తి కారు నడుపుతుంటే ఎలా ఎంకరేజ్ చేసిందో?
పూజా కారు నడపక పోయినా... మద్యం సేవించిన వ్యక్తి కారు నడుపుతుంటే ఎలా ఎంకరేజ్ చేసిందనే విమర్శలు సైతం కొందరు చేస్తున్నారు. ఏది ఏమైనా ‘మహర్షి' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటుకు వెళ్లి పార్టీ చేసుకుని తిరిగి వస్తుండగా ఇలా జరుగడంతో మీడియాలో హాట్ టాపిక్ అయింది.

మహర్షి
మహేష్ బాబు కెరీర్లో 25వ చిత్రంగా ‘మహర్షి' తెరకెక్కుతోంది. పూజా హెడ్గే హీరోయిన్‌గా నటిస్తుండగా... అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇంకా అనన్య, మీనాక్షి దీక్షిత్, జగపతి బాబు, రాజేంద్రప్రసాద్, సాయి కుమార్, ముఖేష్ రిషి, ప్రకాష్ రాజ్, నాజర్, నరేష్, పోసాని, జయసుధ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మే 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











