ఓటీటీలో సలార్ సెన్సేషన్.. టాప్ 3లో నెంబర్ వన్, మిగతా స్థానాల్లో ఏమన్నాయంటే?
ఓటీటీల వేధికగా అనేక సినిమాలు విడుదల అవుతున్నాయి. వీకెండ్ వచ్చిందంటే చాలు ఎన్నెన్నో అద్భుతమైన సినిమాలు సందడి చేసేందుకు మన ముందుకు వస్తున్నాయి. చిన్న, పెద్ద, తేడా లేకుండా చాలా సినిమాలు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. అయితే తాజాగా ప్రభాస్ సలార్ సినిమా ఓటీటీలో తెగ సందడి చేస్తోంది. సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. సినిమా వచ్చి చాలా రోజులే అవుతున్నా టాప్ ట్రెండింగ్ లో ఉంటూ తెగ అలరిస్తోంది. తాజాగా ఆర్మాక్స్ మీడియా సంస్థ ఓటీటీని షేక్ చేస్తున్న టాప్ 3 సినిమాల లిస్టును విడుదల చేసింది. అందులో ఒకటి సలార్ కాగా మిగతావి ఏ సినిమాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
టాప్ 1 సినిమాలో మొన్నటి వరకు యానిమల్ ఉండగా.. ఇప్పుడు ఆ స్థానంలో ప్రభాస్ సలార్ చిత్రం వచ్చింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హాంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ కిరాగందుర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అలాగే ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా కనిపించిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 22వ తేదీన విడుదల చేయగా... బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 200 కోట్ల రూపాయలతో తెరకెక్కించిన ఈ సినిమా 800 కోట్ల వసూళ్లు సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. నెల రోజులు కూడా తిరక్కముందే ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం డిన్నీ ప్లస్ హాట్ స్టార్ వేధికగా ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది.

ఇక టాప్ 2లో యానిమల్ సినిమా నిలిచింది. డిసెంబర్ ఒకటో తేదీన యానిమల్ సినిమా థియేటర్లలో ఈ సినిమా చాలా గ్రాండ్ గా విడుదల కాగా... జనవరి 26వ తేదీన ఓటీటీలోకి వచ్చేసింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను టి - సిరీస్ ఫిల్మ్స్, భద్రకాళి పిక్చర్స్, సినీ వన్ స్టూడియోస్‌పై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్ ఖేతాని, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించారు. పక్కా యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో ప్యూర్ ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ డ్రామాగా రిలీజై సూపర్ బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకుంది.
ఈ సినిమా ఓటీటీలోకి వచ్చి దగ్గరదగ్గర నెల రోజులు అవుతుండగా.. ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉంది. చాలా మంది ఈ చిత్రాన్ని చూస్తూనే ఉన్నారు. ఈ చిత్రం ఓటీటీలో అడుగు పెట్టినప్పటి నుంచి టాప్ 1లోనే నిలిస్తూ సెన్సేషన్ క్రియేట్ చేయగా ఇప్పుడే టాప్ 2లోకి వచ్చింది. ఇక టాప్ 3లో మొన్నటి వరకు గుంటూరు కారం నిలవగా.. ఇప్పుడు మాత్రం షారుక్ ఖాన్ డంకీ చిత్రం వచ్చింది. ప్రస్తుతం టాప్ 3 సినిమాగా ఇదే కొనసాగుతోంది.
జియో స్టూడియోస్, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, రాజ్‌కుమార్ హిరానీ ఫిల్మ్స్ బ్యానర్‌పై రాజ్‌కుమార్ హిరాణీ, గౌరీ ఖాన్, జ్యోతి దేశ్‌పాండే నిర్మించిన ఈ సినిమాకు రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించాడు. షారుఖ్‌ఖాన్, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, బొమన్ ఇరానీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను డిసెంబర్ 21వ తేదీన గ్రాండ్ గా విడుదల చేశారు. 120 కోట్ల రూపాయలతో తెరకెక్కించిన ఈ సినిమా 458 నుంచి 470 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ప్రస్తుతం ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ అవుతుంది.


Click it and Unblock the Notifications











