బ్రా కూడా లేకుండా సాయి తేజ్ హీరోయిన్ ఫ్రీ షో: తిక్క పుట్టిస్తోన్న హాట్ వీడియో
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీల్లోకి వేరే దేశాల వనితలు కూడా హీరోయిన్లుగా పరిచయం అవుతోన్న విషయం తెలిసిందే. ఇలా ఇప్పటికే ఎంతో మంది భామలు మన దేశంలోని పలు భాషల్లో నటించి సందడి చేశారు. అందులో బ్రెజిల్‌కు చెందిన లారిస్సా బొనేసి ఒకరు.
బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ చాలా సినిమాల్లో నటించిన ఈ చిన్నది.. ఈ మధ్య కాలంలో పెద్దగా సినిమాలు చేయడం లేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం లారిస్సా బొనేసి యమ హల్చల్ చేస్తూ రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ హాలీవుడ్ భామ ఓ హాట్ వీడియోను షేర్ చేసింది. అది మీరే చూడండి!

చిన్నప్పుడే ఫుల్ పాపులారిటీ: లారిస్సా బొనేసి చిన్న వయసులోనే మోడల్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే ఆమె ఎన్నో అంతర్జాతీయ బ్రాండ్లకు ప్రచారకర్తగా చేసింది. దీంతో ఆమెకు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కింది. దీంతో లారిస్సా బొనేసికి హాలీవుడ్‌లో కొన్ని సిరీస్‌లు, ఆల్బమ్స్‌లో నటించే అవకాశం దక్కింది. ఇలా టీనేజ్‌లోనే ఈ బ్యూటీ ఫుల్ పాపులర్ అయిపోయింది.
హాలీవుడ్ నుంచి బాలీవుడ్‌లో: మోడల్‌గా చేస్తోన్న సమయంలోనే లారిస్సా బొనేసికి హాలీవుడ్‌లో కొన్ని సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. అక్కడ సత్తా చాటుతోన్నప్పుడే ఈ బ్యూటీ ఇండియాకు వచ్చి బాలీవుడ్‌లో 'గో గోవా గాన్' అనే సినిమాలో నటించింది. 2013లో విడుదలైన ఈ మూవీతో ఆమెకు మంచి పేరు వచ్చింది. కానీ, ఆ తర్వాత మాత్రం ఆమె బాలీవుడ్‌లో సినిమాలు చేసేందుకు ఒప్పుకోలేదు.

సాయి తేజ్‌తో.. సచిన్‌తోనూ: బాలీవుడ్‌లో ఒక్క సినిమాతోనే యమ హైలైట్ అయిన లారిస్సా బొనేసికి చాలా ఇండస్ట్రీల నుంచి అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన 'తిక్క' అనే సినిమాతో ఈ చిన్నది తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇది అంతగా ఆడకున్నా.. ఆ వెంటనే సచిన్ హీరోగా నటించిన 'నెక్ట్స్ ఏంటి' అనే సినిమాలోనూ భాగం అయింది.
మ్యూజిక్ వీడియోలు.. గ్యాప్: తెలుగులో చేసిన రెండు సినిమాలూ పెద్దగా ఆడకపోవడంతో లారిస్సా బొనేసి కెరీర్‌కు కాస్త బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత మళ్లీ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది 'అర్ యూ కింగ్', 'ఎస్ ఒర్ నో', 'హోలీ రంగిలి హోలీ' అనే మ్యూజిక్ ఆల్బమ్‌లలో ఆడిపాడింది. ఆ వెంటనే హిందీలో 'పెంట్ హౌస్' అనే సినిమాలోనూ నటించింది. ఇక, లారిస్సా ఇప్పుడేమీ చేయడం లేదు.

సోషల్ మీడియాలో సందడి: విదేశీ అమ్మాయే అయినా ఇండియాలో కాలం పాటు వరుస పెట్టి సినిమాలు చేసినా.. ఈ మధ్య ఖాళీగానే ఉంటోన్నా లారిస్సా బొనేసి మాత్రం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. దీని ద్వారానే ఈ అమ్మడు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు, విశేషాలతో పాటు కెరీర్ గురించిన ప్రతి విషయాన్ని ఫాలోవర్లతో పంచుకుంటూ క్రేజ్‌ను పెంచుకుంటోంది.
హద్దు దాటి మరీ ప్రదర్శన: గతంలో మాదిరిగా ఇప్పుడు పెద్దగా సినిమాలు చేయకున్నా ఫారెన్ బ్యూటీ లారిస్సా బొనేసి పేరు మారుమ్రోగుతూ ఉండడానికి ఆమె సోషల్ మీడియాలో చేసే హాట్ షోనే అని చెప్పొచ్చు. ఇందులో ఈ అమ్మడు హద్దు దాటి మరీ అందాలను ఆరబోస్తుంది. ఇందులో భాగంగానే నిత్యం తన హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. తద్వారా తరచూ ట్రెండింగ్‌లోనే ఉంటోంది.
హాట్ వీడియో వదిలిన నటి: సోషల్ మీడియాను తన గ్లామర్‌తో షేక్ చేసి పడేస్తోన్న లారిస్సా బొనేసి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమె బ్రా కూడా ధరించకుండా టాప్ విప్పేసి ఫోజులిచ్చింది. దీంతో ఇందులో ఆమె ఎద అందాలు యమ రెచ్చగొడుతోన్నాయి. ఫలితంగా ఈ వీడియోకు భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. తద్వారా ఇది వైరల్‌గా మారిపోయింది.


Click it and Unblock the Notifications











