twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సమంత ఐటెం సాంగ్ అందుకే ఒప్పుకుంది.. అసలు నిజం బయట పెట్టిన సుకుమార్!

    |

    పుష్ప సినిమాలో సమంత చేసిన ఐటమ్ సాంగ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.. సమంత తన కెరీర్ మొత్తంలో మొట్టమొదటిసారిగా ఐటమ్ సాంగ్ చేయడం అది కూడా బాగా బోల్డ్ గా ఉండడంతో ఈ సాంగ్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తాజాగా ఈ సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి సమంత ఎలా ఒప్పుకుంది? అనే విషయం మీద సుకుమార్ కీలక విషయాలు వెల్లడించారు. ఆ వివరాల్లోకి వెళ్తే

    కొత్త రికార్డులు

    కొత్త రికార్డులు

    అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం పుష్ప.. డిసెంబర్ 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. విడుదలైన రెండు రోజుల్లోనే ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది. నైజాంలో అయితే ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా సాధించినటువంటి కలెక్షన్లు సాధించి రికార్డు బద్దలు కొట్టి కొత్త రికార్డులను సెట్ చేసింది.

    అంచనాలకు తగినట్లుగానే

    అంచనాలకు తగినట్లుగానే

    ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో సునీల్, ఫాజిల్, అనసూయ, అజయ్ ఘోష్, అజయ్, అరవింద్, జగదీష్ లాంటి వారు కీలక పాత్రల్లో నటించారు. అల్లు అర్జున్ పూర్తి స్థాయి మాస్ లుక్ లోకి మారిపోయి చేసిన సినిమా కావడంతో ఈ సినిమా మీద ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టే సుకుమార్ టేకింగ్ కూడా ఉండడంతో సినిమా మీద భారీ అంచనాలు పెరిగాయి. అంచనాలకు తగినట్లుగానే సినిమా ఉండడంతో అంతకంతకు మంచి పేరు తెచ్చుకుంటోంది.

    మగవాళ్ళంటేనే అసహ్యం

    మగవాళ్ళంటేనే అసహ్యం

    అయితే ఈ సినిమాలో సమంత చేసిన ఐటమ్ సాంగ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇందులో మగవారు అందరూ తప్పు అన్నట్టుగా ఉన్న లిరిక్స్ ఒక కారణంగా చెప్పవచ్చు. ఆమె ఇటీవల కాలంలోనే నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న కారణంగా ఆమెకు మగవాళ్ళంటేనే అసహ్యం కలుగుతోందని, ఆ కారణంగానే ఈ పాటలు లిరిక్స్ నచ్చి ఆమె సాంగ్ చేయడానికి ఒప్పుకున్నట్లు ప్రచారం జరిగింది. కానీ అసలు ఆమె ఈ పాట చేయడానికి ఎందుకు ఒప్పుకుంది అనే విషయాన్ని తాజాగా సుకుమార్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

    సందేహంతోనే ఉంది

    సందేహంతోనే ఉంది

    ''సమంతను ఐటెం సాంగ్‌ లో భాగం చేయాలనేది నా ఆలోచన. అయితే ఈ విషయంలో సమంతను ఒప్పించడం కష్టమైంది. నేను అడిగిన వెంటనే ఆమె ఒప్పుకోలేదు" సుకుమార్ అన్నారు. ''ఇప్పుడు అవసరమా? అని అడుగుతూ ఆమె నో చెప్పింది. 'నువ్వు అన్ని రకాల క్యారెక్టర్లు చేశావు... ఐటెమ్ నంబర్‌లో కనిపిస్తే ఒక సర్కిల్ కంప్లీట్ అవుతుంది' అని ఆమెను ఒప్పించడానికి ప్రయత్నించాను.' ఆమెను చాలా రకాలుగా ఒప్పించేందుకు ప్రయత్నించాను. ఆఖరి క్షణం వరకు ఆమె చేయాలా వద్దా అనే సందేహంతోనే ఉంది'' అని సుకుమార్ వెల్లడించారు.

     సాంగ్ హిట్ కావడంతో

    సాంగ్ హిట్ కావడంతో

    ఏదైతేనేం ఈ మాస్ సాంగ్ ని జనం ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. కాగా, సమంత తన తదుపరి చిత్రం యశోద షూటింగ్‌లో ఉంది. ఇవి కాక ఆమె ఒప్పుకున్న మరిన్ని సినిమాలు కూడా లైన్ లోనే ఉన్నాయి. ఇక మొత్తం మీద ఐటెం సాంగ్ హిట్ కావడంతో మేకర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

    English summary
    This is How Samantha Convinced by sukumar To Do Pushpa Item Song.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X