ఛలో భామను పెళ్లాడటం అంత ఈజీకాదట
క్యూట్ భామ రష్మిక మందన టాలీవుడ్ లో లక్కీ గర్ల్ గా మారిపోయిన విషయం తెలిసిందే. తెలుగునాట ప్రస్తుతం ఆమెకు మామూలు క్రేజ్ లేదు. చిన్న హీరోల దగ్గర నుండి పెద్ద హీరోల వరకు అంతా ఈ కుర్రదాన్నే కావాలంటున్నారు. నాగశౌర్య 'ఛలో' సినిమాతో ఎంట్రీ ఇచ్చి విజయ్ దేవరకొండతో 'గీత గోవిందం' , 'డియర్ కామ్రేడ్' అనే సినిమాలో నటించింది.
అలానే నితిన్ హీరోగా 'భీష్మ' , సూపర్ స్టార్ మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో బ్లాక్ బాస్టర్ అయిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలతో స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరిపోయింది . తెలుగుతో పాటు తమిళం.. కన్నడంలో మంచి గుర్తింపు దక్కించుకున్న రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమాలో నటిస్తుంది.అయితే ఈ అమ్మడు టాలీవుడ్ లోకి ఎంటర్ అవ్వక ముందు కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి తో నిశ్చితార్ధం చేసుకుంది.

అయితే తెలుగులో వరుసగా ఆఫర్స్ వస్తుండటంతో తన కెరీర్ కు పెళ్లి అడ్డుగా మారుతుందని భావించి ఆ పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ.. టాలీవుడ్ టాప్ హీరోయిన్ లిస్ట్ లో చేరిపోయింది. తాజాగా ఈ భామ సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాదానాలు చెప్పింది ఈ వయ్యారి.
వారిలో ఓ అభిమాని మిమ్మల్ని పెళ్లాడాలంటే ఎలా ..? అని ప్రశ్నించాడు . దానికి రష్మిక ముందు మీరు నన్ను కలవండి కలిసి నాతో కొద్దిసేపు చాట్ చేయండి అప్పుడే తనని పెళ్లాడేందుకు ఏం చేయాలో వివరిస్తాను అంటూ కొంటె సమాధానం ఇచ్చింది. ఇక తనని నేరుగా కలవాలంటే తన టీమ్ ను సంప్రదించాల్సిందిగా కోరింది. మరి ఆ మాత్రం ధైర్యం చేసే మొనగాడు ఎక్కడున్నాడో చూడాలి.


Click it and Unblock the Notifications











