కో స్టార్స్ తో డేటింగ్ .. అసలు సీక్రెట్ చెప్పేసిన కాజల్ అగర్వాల్..

తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని ఆల్ టైం టాప్ మోస్ట్ హీరోయిన్స్ లిస్ట్ తీస్తే చాలా మంది స్టార్ హీరోయిన్స్ పేర్లు ఉంటే వాటిలో ఖచ్చితంగా కనిపించే పేరు బ్యూటిఫుల్ కాజల్ అగర్వాల్ పేరు కూడా ఖచ్చితంగా ఉండి తీరుతుంది. కెరీర్‌ని చిన్న గానే స్టార్ట్ చేసినప్పటికీ కాజల్ కొన్నాళ్ల పాటుగా తన హవా తెలుగు సినిమాలో చూపించి స్టార్ హీరోయిన్ గా సత్తా చాటింది.

ఒకప్పుడు తన పక్కన సెకండ్ హీరోయిన్ గా చేసిన వారు ఇపుడు టాప్ హీరోయిన్స్ గా ఉన్నారు. మరి ఆ రేంజ్ స్టార్‌డమ్‌ని కాజల్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో చూసింది. ఇక హీరోయిన్స్ విషయం అంటే అందరికీ తెలిసిందే కదా . ఉన్నన్ని రోజులు ఫామ్ లో ఉండి తర్వాత ఫేడ్ అవుట్ అయిపోతారు. కానీ కేవలం కొంతమంది మాత్రం ఇండస్ట్రీలో మినిమమ్ 20 ఏళ్ళు కొనసాగుతారు అలా ఇండస్ట్రీ లో ముద్ర వేసిన హీరోయిన్ గా కాజల్ నిలుస్తుంది.

this why kajal aggarwal did not date any co star in her career

అయితే కాజల్ తెలుగు ఇండస్ట్రీలోని దాదాపు బిగ్ స్టార్స్ పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇలా చాలా మందితో స్క్రీన్ షేర్ చేసుకుంది. కాజల్ కి తెలుగులో వచ్చిన ఫేమ్ తో తమిళ్ సహా హిందీలో కూడా పలు సినిమాలు చేసి పీక్ లోకి వెళ్ళింది. అయితే తర్వాత ఓ బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకొని ఇపుడు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంది.

ఇప్పటికీ కొన్ని సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. అయితే ఇన్నేళ్ల సినీ ప్రయాణం ఓ హీరోయిన్ చేసింది అంటే డెఫినెట్ గా ఆ హీరోతో ఈ హీరోతో డేటింగ్ అంటూ పలు వార్తలు మనం తప్పకుండా వింటాం. అలాగే కొన్ని అఫైర్స్ అంటూ కూడా వింటూ ఉంటాం. కానీ కాజల్ అగర్వాల్ విషయంలో మాత్రం ఈ తరహా వార్తలు చాలా అంటే చాలా అరుదే అని చెప్పి తీరాలి.

తన పెళ్లి వరకు కూడా ఆ హీరోతో ప్రేమలో ఉంది ఈ హీరోతో రిలేషన్ లో ఉంది అనే వార్తలు డెఫినెట్ గా చాలా తక్కువే వినిపించాయి. ఇన్నేళ్ల కెరీర్ లో కాజల్ ఈ మార్క్ ని సొంతం చేసుకుంది. అయితే కాజల్ అసలు తన కో స్టార్స్ తో ఎందుకు డేటింగ్ వంటివి చేయలేదో అసలు విషయం రివీల్ చేసింది. సినిమాలో వర్క్ చేసినపుడు హీరోలతో ఎంత క్లోజ్ గా మూవ్ అయినప్పటికీ బయటకి వచ్చే సరికి మాత్రం తాను ఏ హీరోతో కానీ తన కో స్టార్ తో కానీ క్లోజ్ గా మూవ్ అయ్యింది లేదట.

this why kajal aggarwal did not date any co star in her career

తనకి తానే ప్రొఫిషియనల్ గా కొన్ని హద్దులు పెట్టుకున్నాను అని అందుకే ఏ హీరో లేదా కో స్టార్ తో డేటింగ్ చేసింది లేదు అని ఆమె తెలిపింది. ఒకవేళ తన కో స్టార్స్ తన ఇంటి దగ్గరలో ఉంటే కావాలంటే లంచ్ వరకు ఆహ్వానించగలను తప్ప ఇంకేమి ఉండదు అని కాజల్ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

దీనితో సినిమాలో ఎలా ఉన్నప్పటికీ ఆఫ్ స్క్రీన్ లో మాత్రం కాజల్ ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. కాగా కాజల్ ప్రొఫిషనల్ గా చాలా పక్కాగా ఉంటుందని అప్పట్లో కూడా టాక్ వినిపించింది. కొంతమంది సినిమాపై ఫ్యాషన్ తో వస్తే నేను కేవలం సంపాదించడానికి మాత్రమే వచ్చాను అనే బోల్డ్ స్టేట్మెంట్స్ ని కూడా కాజల్ ఇచ్చింది.

More from Filmibeat

Read more about: kajal aggarwal prabhas ram charan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X