Rashmika: రూట్ మార్చిన రష్మిక.. కాంట్రవర్సీపై దర్శకుడు హాట్ కామెంట్స్

ప్రస్తుతం ఇండియా వైడ్ గా మంచి పాపులారిటీ అలాగే పాన్ ఇండియా ఆఫర్స్ ఉన్నటువంటి టాప్ హ్ాపెనింగ్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది నేషనల్ క్రష్ రష్మిక మందన్నానే అని చెప్పాలి. కాగా ఈమె మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా తెలుగు, హిందీ మరియు తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తుంది. కాగా రష్మికపై లుక్స్ పరంగా పలు ట్రోల్స్ ఉన్నప్పటికీ ఒక నటిగా మాత్రం తనపై ఇలాంటివి తక్కువ అని చెప్పవచ్చు.

కాగా ఈమె నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా హిట్ చిత్రం పుష్ప 2 ది రూల్ రికార్డులు తిరగరాసంది. ఇందులో కూడా తన పెర్ఫామెన్స్ తో రష్మిక ముద్ర వేసుకుంది. మెయిన్ గా ఇంటర్వెల్ బ్లాక్ లో అల్లు అర్జున్ తో ఉండే సీన్ పై మంచి ప్రశంసలు వచ్చాయి. కాగా ఇది మాత్రమే కాకుండా రష్మిక ఈ మధ్య కాలంలో చాలా సినిమాల్లో మంచి నటన కనబరిచే స్కోప్ ఉన్న సినిమాలే చేసింది.

this why rashmika in controversial chhaava dirctor clarified

దీనితో తనపై ఎన్నో ట్రోల్స్ ఉన్నప్పటికీ అందరికీ తన నటన తోనే సమాధానం ఇచ్చింది రష్మిక. అయితే ఇదిలా ఉండగా రష్మిక హిందీలో చేసిన మరో బిగ్ ప్రాజెక్ట్ "చ్చావా" పై అందరి కళ్ళు ఉన్నాయి. హిందీలో అనిమల్ సినిమా తర్వాత ఈ సినిమా గ్రాండ్ గా రాబోతుంది. మరి ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యిన తర్వాత పెద్ద ఎత్తున కాంట్రవర్సీ జరుగుతుంది.

మెయిన్ గా మతపరంగా సోషల్ మీడియాలో ఆల్రెడీ చాలా కాంట్రవర్సీ నడుస్తుండగా థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చాక ఎలా ఉంటుందో అని అంతా ఎదురు చూస్తున్నారు. కాగా ఈ సినిమాలో రష్మిక మందన్నా యేసుబాయ్ గా కనిపించనుంది. మరి ఆమె పాత్రలో తనపై వచ్చిన ఫస్ట్ లుక్ పై చాలా ట్రోల్స్ వచ్చాయి కానీ రష్మిక మందన్నాని ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ హాట్ కామెంట్స్ చేశారు.

this why rashmika in controversial chhaava dirctor clarified

హిందీ సినిమాలో చాలా మంది హీరోయిన్స్ ఉన్నప్పటికీ సౌత్ నుంచే ఎందుకు తీసుకున్నారు అనే ప్రశ్నకి ఇంట్రెస్టింగ్ సమాధానం ఇచ్చారు. ఈ సినిమా కోసం రష్మికనే ఎందకు తీసుకోవాల్సి వచ్చిందంటే తనైతే ఈ రోల్ కి పర్ఫెక్ట్ గా సెట్ అనిపించింది అని, రష్మిక కంటిలో ఒక స్వచ్ఛత ఉంటుంది అని ఆమె బాడీ లాంగ్వేజ్ ఏ పాత్రకి అయినా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యిపోతుంది.

చ్చావా లో ఆమె పెర్ఫామెన్స్ తో ప్రతీ ఒక్కరినీ షాక్ కి గురి చేస్తుంది. అంటూ ఆమెని ఆకాశానికి ఎత్తేసాడు దర్శకుడు. దీనితో మళ్ళీ రష్మిక మందన్నా నుంచి ఒక పవర్ఫుల్ పెర్ఫామెన్స్ ని చూసేలా ఉన్నామన చెప్పాలి. ఇక ఈ సినిమాలో శంభాజీ మహారాజ్ గా వెర్సటైల్ నటుడు విక్కీ కౌశల్ నటించగా ఈ ఫిబ్రవరి 14న గ్రాండ్ గా రిలీజ్ కి తీసుకొస్తున్నారు. ఇక హిందీలోనే రష్మిక ఈ ఒక్క సినిమానే కాకుండా మరో టాప్ హీరో సల్మాన్ ఖాన్ తో కూడా ఓ సినిమా చేస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X