45 ఏళ్ల క్రితమే ఛార్టెర్డ్ ఫ్లైట్.. విమానంలోనే షూటింగ్‌కి, ఆ సీనియర్ హీరోయిన్ ఎవరో తెలుసా?
భారతీయ చిత్ర పరిశ్రమలో దేవుళ్ల పాత్రలు పోషించి మెప్పించిన నటీనటులు చాలా అరుదు. చాలామందే ఈ క్యారెక్టర్లు చేసినా జనం మదిలో నిలిచిపోయింది మాత్రం కొందరే. రాముడిగా, కృష్ణుడిగా, వెంకటేశ్వర స్వామిగా నటించి జీవం పోశారు నటరత్న నందమూరి తారక రామారావు. ఆయన తర్వాత ఆ పాత్రలను చాలా మంది పోషించినా.. తెలుగువారికి రాముడంటే అన్నగారే. ఆ మనోహర రూపం, తేజస్సు, నటన.. నిజంగా భగవంతుడే నేలపైకి దిగివచ్చాడా అన్నంతగా ఎన్టీఆర్ లీనమయ్యారు.
ఇక అమ్మవారి క్యారెక్టర్లంటే టక్కున గుర్తొచ్చేది కేఆర్ విజయే. కనర దుర్గ, మహాలక్ష్మీ, పార్వతి దేవి వంటి పాత్రలను పోషించి వన్నె తెచ్చారు కేఆర్ విజయ. ఆరు దశాబ్ధాల సుదీర్ఘ కెరీర్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించారు. నాటి అగ్రనటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎంజీఆర్, శివాజీ గణేశన్, శోభన్ బాబు, కృష్ణ తదితరులతో నటించారు. పాతతరం నటీమణుల్లో సావిత్రి, జమున, కాంచనమాల తదితరులతో సమానంగా గుర్తింపు తెచ్చుకున్నారు.

హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన కేఆర్ విజయ.. అవకాశాలు తగ్గుతున్న దశలో సపోర్టింగ్ రోల్స్‌లోనూ సత్తా చాటారు. ముఖ్యంగా ఏదైనా దేవీదేవత పాత్రలు చేయాల్సి వస్తే ఖచ్చితంగా కేఆర్ విజయనే సంప్రదించారు. ఇలా కొన్నేళ్లపాటు అమ్మవారి క్యారెక్టర్‌లకు ఆమె కేరాఫ్‌గా మారిపోయారు. ఈమె దేవత పాత్రలలో నటించారంటే చాలు జనం థియేటర్లకు క్యూకట్టేవారు. అయితే ఆ రోల్ కోసం అదే స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకునేవారట కేఆర్ విజయ. ఈ విషయాన్ని దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ పలు సందర్భాల్లో ప్రస్తావించారు.
అలనాటి తారల్లో సావిత్రి .. హీరోలతో సమానంగా ఆస్తులను సంపాదించారు. 1958 నాటికే మద్రాస్ నగరంలోని హై ప్రొఫైల్ ఏరియా టీ.నగర్‌లో సొంత ఇల్లు, విశాలమైన భవంతిని కట్టుకున్నారు. లగ్జరీ కార్లు, ఖరీదైన ఆభరణాలతో విలాసవంతమైన జీవితాన్ని గడిపారు. మద్రాస్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లోనూ సావిత్రికి ఆస్తులు ఉన్నాయని అంటారు.కేఆర్ విజయ సైతం ఇదే స్థాయిలో ఆస్తులు సంపాదించారని అంటారు. కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో ప్రతి ఏడాది పదుల సంఖ్యలో సినిమాలు చేసిన కేఆర్ విజయ అప్పట్లోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న నటీమణిగా నిలిచారు.

స్వతహాగా నటీనటులు తమ స్టేటస్ సింబల్‌గా కాస్ట్‌లీ కార్లు కొనుగోలు చేసి తమ గ్యారేజీల్లో పెట్టుకుంటారు. ఇప్పుడు ఏకంగా ఛార్టెర్డ్ ఫ్లైట్స్‌ను కొనే రేంజ్‌కు తారలు చేరుకున్నారు. రామ్ చరణ్, నాగార్జున, ఎన్టీఆర్, నయనతార, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి నటులకు సొంతంగా విమానాలు ఉన్నాయి. కానీ 45 ఏళ్ల క్రితమే కేఆర్ విజయకు సొంతంగా ప్రైవేట్ జెట్ ఉందంటే ఇప్పటి తరానికి ఆశ్చర్యం కలగకమానదు. కోట్లాది రూపాయల ఆస్తుల్ని కూడబెట్టిన ఆమె.. సొంత విమానాన్ని కూడా కొనుగోలు చేశారట. ఎప్పుపడైనా షూటింగ్ ఆలస్యం అయితే తన సొంత విమానంలోనే కేఆర్ విజయ షూటింగ్‌కు వచ్చేవారట. ఆమె రెమ్యునరేషన్, ప్రైవేట్ ఫ్లైట్, ఆస్తుల వివరాలు తెలుసుకుని ప్రేక్షకులు నోరెళ్లబెడుతున్నారు.


Click it and Unblock the Notifications











