అందరి ముందు చీర విప్పి, అలా పడుకోమన్నాడు.. స్టార్ దర్శకుడుపై తెలుగు నటి షాకింగ్ కామెంట్స్

తెలుగు సినిమా పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్, సెట్స్‌లో మహిళ నటులు ఎదురయ్యే చేదు అనుభవాలు తరచూ చర్చకు వస్తుంటాయి. తాజాగా క్యారెక్టర్ ఆర్టిస్ట్, నటి జ్యోతి చేసిన సంచలన వ్యాఖ్యలు మరోసారి హాట్ టాపిక్‌గా మార్చాయి. గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని, తన కెరీర్‌లో ఎదురైన కొన్ని అనుభవాలను వెల్లడించింది. తాను ఓ సినిమాలో ఓ స్టార్ డైరెక్టర్ తనతో అసభ్యకరంగా మాట్లాడారనీ, సెట్స్ లో అందరి ముందు చీర విప్పి పడుకోమన్నాడని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు? ఇంతకీ ఏం జరిగింది?

జ్యోతి.. తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన నటి. బోల్డ్ పాత్రలు, నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా 'ఎవడి గోల వాడిదే (Evadi Gola Vadide)' సినిమాలో "సమర్పించేసుకుంటాను" అనే డైలాగ్ ఆమెను ఒక్కసారిగా పాపులర్ అయ్యేలా చేసింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటిస్తూ తన స్థానం నిలబెట్టుకుంది. అంతేకాకుండా బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోలు, టీవీ షోల ద్వారా కూడా ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.

Throwback Actress Jyothi Makes Shocking Allegations on EVV Satyanarayana s On-Set Demand

అయితే.. గతంలో ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఆ ఇంటర్వ్యూలో జ్యోతి మాట్లాడుతూ.. దర్శకుడు ఈవీవీ సత్య నారాయణ( E. V. V. Satyanarayana)పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆయనతో పనిచేసిన సమయంలో జరిగిన ఒక సంఘటనను బయటపెట్టింది. "ఎవడి గోల వాడిది" సినిమాలో అవకాశం ఇచ్చిన తర్వాత, ఆయన దర్శకత్వంలో వచ్చిన 'కితకితలు'సినిమాకు కూడా తనను పిలిచారని ఆమె తెలిపింది. అయితే ఈసారి తన పాత్ర గురించి ముందుగా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని చెప్పింది.

షూటింగ్‌కు వెళ్లిన తర్వాతే అసలు విషయం తెలిసిందని జ్యోతి వెల్లడించింది. ఒక వాంప్ పాత్ర కోసం తనను ఎంపిక చేశారని, ఆ సన్నివేశంలో అందరి ముందు చీర పైట విప్పి మంచంపై పడుకోవాలని దర్శకుడు కోరారని తెలిపింది. సెట్లో యూనిట్ సభ్యులు, లైట్‌మెన్లు అందరూ ఉన్నారు. ఆ సమయంలో అలాంటి సీన్ చేయడం తనకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించిందని ఆమె బాధపడింది.
'నాకు ఇది కంఫర్టబుల్‌గా లేదు. కనీసం సీన్‌ను మార్చండి' అని తాను వినయంగా కోరినా, దర్శకుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని జ్యోతి వివరించింది.

చివరికి తన నిర్ణయానికి కట్టుబడి, ఆ సన్నివేశంలో నటించకుండా షూటింగ్ నుంచి బయటకు వచ్చి, మేకప్ రూంలో దుస్తులు మార్చుకుని ఇంటికి వెళ్లిపోయానని వెల్లడించింది. ఈ సంఘటన తర్వాత ఆయన దర్శకత్వంలో మళ్లీ ఎప్పుడూ పనిచేయలేదని కూడా స్పష్టం చేసింది. అయితే ఈ విషయాన్ని చెబుతూ, తనకు దర్శకుడిపై వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషం లేదని కూడా జ్యోతి పేర్కొంది. ఆ సమయంలో తాను తీసుకున్న నిర్ణయం తన స్వాభిమానానికి సంబంధించినదని ఆమె స్పష్టం చేసింది. ఒక నటిగా తనకు అనుకూలంగా లేని సన్నివేశాలను తిరస్కరించే హక్కు ఉందని ఆమె అభిప్రాయపడింది.

ఇదే సందర్భంలో మరో ఆసక్తికర అంశాన్ని కూడా జ్యోతి ప్రస్తావించింది. గతంలో నటి తెలంగాణ శకుంతల కూడా ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నారని చెప్పింది. బ్యాంకాక్‌లో జరిగిన ఒక షూటింగ్ సమయంలో ఆమెకు ముందుగా తెలియజేయకుండా.. జయప్రకాశ్ గారితో బెడ్ రూమ్ సీన్ చేయమని అడిగారని, ఆవిడ కూడా ఆ సీన్ ఆ ఇష్టంగా చేశారనీ, ఆ షూటింగ్ అయిపోయిన తరువాత.. ఆమె కూడా కుటుంబ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తీవ్రంగా బాధపడ్డారని జ్యోతి తెలిపింది. ఇలా సన్నివేశాల గురించి ముందుగానే స్పష్టత ఇవ్వడం చాలా అవసరమని ఆమె నొక్కి చెప్పింది.

కెరీర్ కోసం ఏదైనా చేయాలని ఒత్తిడి చేయడం సరికాదని, ఒకసారి చేసిన పాత్ర జీవితాంతం గుర్తింపుగా మిగిలిపోతుందని ఆమె అభిప్రాయపడింది. అదే సమయంలో, ఇండస్ట్రీలో అందరూ ఇలానే వ్యవహరిస్తారని కాదు అని కూడా జ్యోతి స్పష్టం చేసింది. తాను పనిచేసిన చాలా మంది దర్శకులు, నిర్మాతలు ప్రొఫెషనల్‌గా వ్యవహరించారని, తనకు పెద్దగా ఇబ్బందులు ఎదురుకాలేదని తెలిపింది. కొన్ని సందర్భాలు మాత్రమే ఇలాంటి అనుభవాలను కలిగించాయని ఆమె పేర్కొంది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X