‘ఆ ఘటనతో హీరోయిన్‌గా సినిమాలు మానేశా.!'

టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి ప్రగతి (Pragathi). ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఎప్పుడూ ఉత్సాహంగా, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఫిట్‌నెస్ వీడియోలతో ట్రెండ్ అవుతూ కనిపించే ప్రగతి జీవితంలో ఇంతటి కష్టాలు దాగి ఉన్నాయా అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.ప్రగతి తన జీవితంలో ఎన్నో కష్టాలు, చేదు అనుభవాలు దాగి ఉన్నాయని ఆమె ఆ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ముఖ్యంగా హీరోయిన్‌గా తన కెరీర్ ఎందుకు ఆగిపోయిందో చెప్పిన విషయాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. ఇంతకీ హీరోయిన్ పాత్రలు చేయకపోవడానికి కారణమేంటీ? ఎందుకు ఆ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారంటే?

ఓ ఇంటర్వ్యూలో నటి ప్రగతి పాల్గొని, తన సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంది. మొదట హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించినప్పటికీ ఎక్కువ కాలం ఆ స్థాయిలో కొనసాగలేకపోయానని తెలిపారు. 90వ దశకంలో కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన ఆమె, ఆ తర్వాత అనూహ్యంగా ఆ దిశలో అవకాశాలు తగ్గిపోయాయని చెప్పారు. దీనికి కారణం ఒక సినిమా షూటింగ్ సమయంలో జరిగిన సంఘటనే అని ఆమె వెల్లడించారు.

Throwback Actress Pragathi Reveals Why She Quit as Heroine After Incident Shares Emotional Journey

ఒక తమిళ చిత్రంలోని రైన్ సాంగ్ షూటింగ్ సమయంలో సెట్లో ఒక వ్యక్తి తనతో అమర్యాదగా ప్రవర్తించాడని చెప్పారు. ఆ సంఘటన తనను లోతుగా బాధించిందని, "నేను ఎవరి దగ్గరా అలా మాటలు పడే వ్యక్తిని కాదు. నా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా మాట్లాడితే నేను సహించలేను' అని ఆమె అన్నారు. అదే కారణంగా హీరోయిన్‌గా సినిమాలు కొనసాగించకూడదని నిర్ణయించుకున్నానని వెల్లడించారు.

హీరోయిన్‌గా అవకాశాలు తగ్గిన తర్వాత జీవితంలో మరో పెద్ద మలుపు తిరిగిందని ప్రగతి చెప్పారు. చాలా చిన్న వయసులోనే వివాహం చేసుకున్నప్పటికీ, వ్యక్తిగత కారణాల వల్ల ఆ బంధం ఎక్కువ కాలం నిలవలేదని వెల్లడించారు. విడాకుల తర్వాత ఆర్థికంగా, భావోద్వేగంగా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నానని ఆమె చెప్పారు. జీవితం ముందుకు నడిపేందుకు పిజ్జా షాపులు, ఎస్టీడీ బూత్‌లలో కూడా పనిచేశానని చెప్పి ఆశ్చర్యానికి గురిచేశారు. తర్వాత మెల్లగా మోడలింగ్‌లోకి అడుగుపెట్టి, అక్కడి నుంచి తిరిగి నటన వైపు వచ్చానని తెలిపారు. దూరదర్శన్ ద్వారా బుల్లితెరలో అవకాశాలు పొందుతూ, ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మళ్లీ తన కెరీర్‌ను నిర్మించుకున్నానని చెప్పారు.

ఆ తర్వాత సినిమాల్లో తల్లి, అత్త, పిన్ని, వదిన వంటి పాత్రలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఆర్థిక పరిస్థితుల గురించి కూడా ప్రగతి నిజాయితీగా మాట్లాడారు. "చాలా సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నా, నేను పెద్దగా ఆస్తులు కూడబెట్టుకోలేకపోయాను. ప్లానింగ్ లేకపోవడం, కొన్ని వ్యక్తుల వల్ల డబ్బు కోల్పోవడం జరిగింది'అని చెప్పారు. తనకు నటన ఒక్కటే ఆదాయ వనరని, అందుకే నిరంతరం పని చేస్తూనే ఉండాల్సి వస్తుందని తెలిపారు. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ప్రగతి మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. జిమ్ వర్కౌట్లు, డ్యాన్స్ వీడియోలు, పవర్‌లిఫ్టింగ్ వంటి అంశాలతో యువతలో ప్రత్యేక గుర్తింపు పొందారు. 50 ఏళ్ల వయసులో కూడా ఫిట్‌నెస్‌పై ఆమె చూపుతున్న కట్టుబాటు అందరికీ ప్రేరణగా మారింది.

ఇలా నటి ప్రగతి తన బాధలను బయటపెట్టింది. బయటకు హ్యాపీగా కనిపించే ప్రగతి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, కఠిన నిర్ణయాలు ఉన్నాయని ఈ ఇంటర్వ్యూతో మరోసారి బయటపడింది. ముఖ్యంగా ఒక సంఘటన కారణంగా హీరోయిన్ కెరీర్‌ను వదిలేసి, ఆ తర్వాత తిరిగి నిలబడిన ఆమె ప్రయాణం నిజంగా ప్రేరణాత్మకమని చెప్పాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X