‘వాళ్ల కోరిక తీర్చితేనే ఆఫర్లు.. లేదంటే కెరీర్ ఖతం'

అందాల భామ ఎస్తేర్ నొరోన్హా ( Ester Noronha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు టాలీవుడ్‌లో హీరోయిన్‌గా తన అందం, నటనతో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం సెకండ్ హీరోయిన్ గానూ సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది ఈ సుందరి. ఇప్పుడు అమ్మడుకు సంబంధించిన ఓ పాత ఇంటర్వ్యూ నెట్టింట్లో వైరలవుతోంది.ఆ ఇంటర్వ్యూలో టాలీవుడ్‌లో తనకు అవకాశాలు ఎందుకు తగ్గిపోయాయి? ఎందుకు కన్నడ ఇండస్ట్రీ వైపు వెళ్లాల్సి వచ్చింది? ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎలా పనిచేస్తుంది? వంటి అనేక షాకింగ్ విషయాలు వెల్లడించింది. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతున్నాయి.

అందాల భామ ఎస్తేర్ నోరోన్హా.. తెలుగు ప్రేక్షకులకు కొత్త కాదు. భీమవరం బుల్లోడు, వేయి అబద్దాలు వంటి చిత్రాలలో హీరోయిన్‌గా నటించిన ఆమె, జయ జానకి నాయక, గరం వంటి సినిమాల్లోనూ కనిపించారు. కానీ, ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం దక్కలేదు. ఇదే విషయంపై ఓ ఇంటర్వ్యూలో స్పందించిన ఎస్టర్, ఇండస్ట్రీలో జరిగిన అనుభవాలను బహిరంగంగా పంచుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. 'భీమవరం బుల్లోడు చేస్తున్న సమయంలోనే నేను డిగ్రీ చదువుతున్నాను. కాలేజ్ చదువుతో పాటు షూటింగ్‌కి వెళ్లేదాన్ని. ఆ సమయంలో చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ దాదాపు ఒకే తరహా పాత్రలు మారుతున్నాయి కానీ నా క్యారెక్టర్ ఒక్కటే. అలాంటి పాత్రలు చేయడం నాకు బోర్ కొట్టింది. డిఫరెంట్‌గా చేయాలని అనిపించేది. అందుకే కొన్ని సినిమాలను నేనే వదిలేశాను' అని చెప్పారు.

Throwback Interview Esther Noronha Shocking Comments on Casting Couch Go Viral Again

అయితే తనకు అవకాశాలు తగ్గడానికి అసలు కారణం మాత్రం మరోదేనని ఆమె తెలిపారు. 'ఇండస్ట్రీ అంతా మంచి ప్రపంచం కాదు. కొన్ని విషయాలు చూసి నాకు చాలా చిరాకు, గలీజ్‌గా అనిపించేది. నేను ట్రైన్డ్ ఆర్టిస్ట్‌ని, సింగర్‌ని, మంచి డాన్సర్‌ని. టాలెంట్‌తో ముందుకు వెళ్లాలని అనుకున్నాను. కానీ, అక్కడ పరిస్థితులు వేరేలా కనిపించాయి" అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఇక క్యాస్టింగ్ కౌచ్ పై ఎస్టర్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించాయి. 'ఇక్కడ కాంప్రమైజ్ అంటే కమిట్‌మెంట్. కానీ ఎవరూ డైరెక్ట్‌గా అడగరు. డైరెక్ట్‌గా మనకు అర్థమయ్యేలా చెబుతారు. 'ఇలా ఉంటే ఇండస్ట్రీలో ముందుకు వెళ్లలేరు', 'వాళ్లు చెప్పినట్టు వినాలి', 'వాళ్ల దగ్గరకు వెళ్లాలి' అంటూ మాటల్లో ఒత్తిడి పెడతారు' అని చెప్పారు. ఆమె ఇంకా మాట్లాడుతూ.. "నీకంటే వెనుక వచ్చిన వాళ్లు ముందుకు వెళ్తున్నారు. వాళ్లు ఎలా ఉన్నారో చూడు. ఈమె ఎలా సెటిల్ అయిందో చూడు అని పోల్చి చూపిస్తారు. ఇలా మెంటల్‌గా ప్రిపేర్ చేస్తూ, ఒప్పించే ప్రయత్నం చేస్తారని వెల్లడించింది.

అలా తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ ఫేస్ చేశాననీ, ఇన్ డైరెక్ట్ గా కమిట్మెంట్ ఇవ్వకపోతే కెరీర్ ఖతం అని కూడా హెచ్చరించారని షాకింగ్ విషయాలు భయపెట్టింది. ఈ పరిస్థితుల్లో తాను ఎందుకు ఒప్పుకోలేదో కూడా ఎస్తేర్ వివరించారు. "నాకు యాక్టింగ్ వస్తుంది, డాన్స్ వస్తుంది, పనీ చేయగలను. నేను నా బెస్ట్ ఇస్తున్నప్పుడు ఎందుకు లొంగాలి? ఎందుకు కాంప్రమైజ్ కావాలి? ఎవరైనా నాకు ఉపకారం చేసి, అవకాశం ఇస్తే రిటర్న్ ఫేవర్ గురించి ఆలోచించవచ్చు. కానీ నేను నా టాలెంట్‌తో అవకాశాలు అడుగుతున్నాను. అలాంటప్పుడు నా సెల్ఫ్ రెస్పెక్ట్ వదిలేయాల్సిన అవసరం లేదు' అని స్పష్టం చేశారు.

"సినిమా కోసం ఇంత దిగజారాలా? నా గౌరవాన్ని ఎందుకు త్యాగం చేయాలి? సినిమా నా జీవితంలో ఒక భాగం మాత్రమే.. అంతే కానీ మొత్తం జీవితం కాదు. అందుకే 'నో' చెప్పాను. ఆ పని చేస్తేనే సినిమా వస్తుంది అంటే నాకు అవసరం లేదు" అని ఘాటుగా స్పందించారు. టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గినా తాను నిరాశ చెందలేదని కూడా ఎస్తేర్ తెలిపారు. "తెలుగులో కాకపోతే ఇంకో భాషలో అవకాశం దొరికింది. కష్టపడి చేస్తే ఎక్కడైనా అవకాశాలు వస్తాయి. అందుకే నేను కన్నడ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయ్యాను. అక్కడ నాకు మంచి అవకాశాలు వచ్చాయి. నటిగా నన్ను నేను నిరూపించుకునే అవకాశం దొరికింది" అని చెప్పారు.

ఇండస్ట్రీలో తప్పు ఎవరిదన్న ప్రశ్నకు కూడా ఆమె సరిగ్గా సమాధానం ఇచ్చారు. "అడిగేవాళ్లు ఉన్నారు.. ఆఫర్ చేసేవాళ్లు ఉన్నారు. ఆఫర్ చేసేవాళ్లు లేకపోతే అడిగేవాళ్లు ఉండరు. ఇది ఒక్క సిస్టమ్‌లా మారిపోయింది. కానీ నాకు కావాలా వద్దా అనేది నేను నిర్ణయించుకోవాలి. ఇంకొకర్ని బ్లేమ్ చేయలేను" అని చెప్పారు. ఇక వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే, నోయెల్ సీను ప్రేమించి వివాహం చేసుకున్న ఎస్తేర్, తర్వాత విడాకులు తీసుకుని విడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె తన కెరీర్‌పైనే దృష్టి పెట్టి ముందుకు సాగుతోంది.

Read more about: ester noronha noel sean tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X