‘రోజూ రాత్రి అలా చేయకపోతే నిద్ర పట్టదు'.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

తెలుగు నటి, యాంకర్ గాయత్రీ గుప్తా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడు తన సినిమాల కంటే ఎక్కువగా తన బోల్డ్ కామెంట్స్‌, ఇండస్ట్రీలో ఎదురైన అనుభవాల గురించి ఓపెన్‌గా మాట్లాడటం ద్వారా గాయత్రీ గుప్తా ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ అంశాన్ని బహిరంగంగా ప్రస్తావిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద చర్చకు దారితీశాయి. అవకాశాల పేరుతో అమ్మాయిలను ఎలా మోసం చేస్తారు, ఇండస్ట్రీలో కొత్తగా వచ్చే నటీమణులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు వంటి విషయాలపై కూడా ఆమె ఎన్నో ఇంటర్వ్యూల్లో మాట్లాడింది. అయితే.. ఇటీవల ఆమె గతంలో చేసిన ఆసక్తికర వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

గాయత్రి గుప్తా కేవలం ఇండస్ట్రీ విషయాలే కాదు.. తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న బాధలను కూడా ఎలాంటి భయం లేకుండా బయటపెట్టింది. ముఖ్యంగా తన చిన్నతనంలో ఎదుర్కొన్న కుటుంబ సమస్యల గురించి చెబుతూ ఆమె కన్నీళ్లు పెట్టుకోవడం అప్పట్లో వైరల్ అయ్యింది. తన తండ్రి తన తల్లిని, తనను తీవ్రంగా హింసించేవాడని, గొడ్డును కొట్టినట్టు కొట్టేవాడని ఆమె చెప్పిన మాటలు చాలామందిని షాక్‌కు గురి చేశాయి. దీంతో గాయత్రీ గుప్తా జీవితంలో ఎంత మానసిక ఒత్తిడి ఉందో ప్రేక్షకులు అర్థం చేసుకున్నారు.

Gayathri Gupta Says 12 Hugs a Day Make Her Feel Safe

ఇక కెరీర్ విషయానికి వస్తే.. యాంకర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన గాయత్రీ గుప్తా, ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. హీరోయిన్‌గా కొన్ని చిత్రాల్లో నటించిన ఆమె.. తర్వాత సపోర్టింగ్ రోల్స్‌తో ప్రేక్షకులకు దగ్గరైంది. ముఖ్యంగా 'ఫిదా' సినిమాలో సాయి పల్లవి ఫ్రెండ్ పాత్రలో కనిపించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే 'కొబ్బరిమట్ట', 'గ్యాంగ్ స్టర్స్', 'దయా', 'స్టోరీ డిస్కషన్స్ 2' వంటి చిత్రాల్లో కూడా నటించింది. అయితే ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో సినిమాలకు కాస్త దూరమై.. ఇంటర్వ్యూలు, సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటుంది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో గాయత్రీ గుప్తా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. మనుషుల జీవితంలో "ఫిజికల్ టచ్" ఎంత అవసరమో ఆమె తనదైన శైలిలో వివరించింది. "ఒక మనిషి సేఫ్‌గా ఉన్నానని ఫీల్ అవ్వాలంటే రోజుకు కనీసం 8 నుంచి 12 హగ్గులు కావాలి. అలా చేయకపోతే నిద్ర పట్టదు" అంటూ ఆమె చెప్పుకొచ్చింది. అయితే ఈ హగ్గులు చెడు ఉద్దేశంతో కాకుండా.. ప్రేమ, ఆప్యాయత, భద్రతను ఇచ్చేలా ఉండాలని స్పష్టం చేసింది. "అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు.. ఇలా కుటుంబ సభ్యుల నుంచి వచ్చే ఆప్యాయతతో కూడిన హగ్ మనలో భద్రత భావన కలిగిస్తుంది. కనీసం 20 సెకన్ల పాటు ఆ టచ్ ఉండాలి. అప్పుడు మన బాడీ, మనసు రిలాక్స్ అవుతాయి. మనం ఈ ప్రపంచంలో సేఫ్‌గా ఉన్నామనే ఫీలింగ్ వస్తుంది" అంటూ గాయత్రీ గుప్తా చెప్పింది.

ఇక పాతకాలం కుటుంబ వ్యవస్థ గురించి కూడా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. "ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీలు ఉండేవి. అమ్మ ఒడిలో పడుకోవడం, అమ్మమ్మతో గడపడం, తాత దగ్గర ఉండడం వల్ల సహజంగానే మనుషులకు ప్రేమ, ఆప్యాయత, ఫిజికల్ టచ్ దొరికేవి. అందుకే అప్పట్లో మనుషులు మానసికంగా బలంగా ఉండేవారు" అని తెలిపింది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని గాయత్రీ గుప్తా ఆవేదన వ్యక్తం చేసింది. "ఇప్పుడు అందరూ పరుగులు తీస్తున్నారు. రోబోల్లా జీవిస్తున్నారు. కనీసం మాట్లాడటానికి కూడా టైమ్ లేదు. ఫిజికల్ టచ్ సంగతి పక్కనపెడితే.. ఒకరితో ఒకరు ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి కూడా కనిపించడం లేదు" అంటూ ప్రస్తుతం సమాజంలో పెరుగుతున్న ఒంటరితనంపై ఆమె ఆందోళన వ్యక్తం చేసింది.

Read more about: gayatri gupta tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X