ప్రతిరోజు రాత్రి నరకమే.. నా ఆస్తి కోసం ప్రేమ పేరుతో అలా..

Jaya Lalitha: సీనియర్ నటి జయలలిత గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలుగు సినీ పరిశ్రమలో వాంప్, గ్లామర్, నెగిటివ్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన ఈ నటి తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో ఆమె వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి. సినీ కెరీర్‌లో విజయాలు అందుకున్న ఆమె, వ్యక్తిగతంగా మాత్రం ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నానని వెల్లడించింది. అసలేం జరిగిందంటే?

కెరీర్ పీక్స్‌లో ప్రేమ.. పెళ్లి నిర్ణయం
ఇంద్రుడు చంద్రుడు, జంబలకిడి పంబ, మామ అల్లుడు, లారీ డ్రైవర్ వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న జయలలిత, తన కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో మలయాళ దర్శకుడు వినోద్‌తో పరిచయం ఏర్పడింది. షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటనలో వినోద్ తనను రక్షించడంతో, అతడిపై నమ్మకం పెరిగిందని ఆమె తెలిపారు.ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారి, ఇద్దరూ దాదాపు ఏడేళ్ల పాటు రిలేషన్‌లో ఉన్నారట.

Throwback Interview Jaya Lalitha Reveals Painful Marriage Abuse amp amp Survival Story

అయితే పెళ్లి విషయంలో జయలలితకు సందేహాలు ఉన్నప్పటికీ, 'నన్ను పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతాను' అంటూ వినోద్ ఒత్తిడి చేయడంతో చివరకు ఆమె అంగీకరించారని తెలిపారు. కుటుంబ సభ్యులు ఈ వివాహానికి వ్యతిరేకించినా, చివరకు ఆలయంలో పెళ్లి చేసుకున్నట్లు వెల్లడించారు.

పెళ్లి తర్వాత మారిన పరిస్థితులు

పెళ్లి అనంతరం భర్త ప్రవర్తన పూర్తిగా మారిపోయిందని జయలలిత ఆవేదన వ్యక్తం చేశారు. 'పెళ్లైన వారం రోజుల్లోనే కట్నం, ఆస్తి గురించి ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాడు. అప్పుడు నాకు అసలు విషయం అర్థమైంది' అని తెలిపారు. తనపై ప్రేమతో కాకుండా, ఆస్తి కోసం పెళ్లి చేసుకున్నాడనే అనుమానం నిజమైందని చెప్పారు. క్రమంగా వేధింపులు పెరిగాయని, 'నీ మీద అసిడ్ పోస్తా.. చంపేస్తా' అంటూ బెదిరించేవాడని చెప్పి ఆమె ఎమోషనల్ అయ్యారు. వివాహం జరిగిన కొద్ది నెలలకే పరిస్థితి మరింత దిగజారిందని జయలలిత తెలిపారు.

రోజురోజుకు తన భర్త హింసాత్మకంగా ప్రవర్తించాడనీ, ఇక చివరకు తనను గదిలో బంధించాడని చెప్పారు. ఆ సమయంలో సినీ పరిశ్రమలోని కొంతమంది ప్రముఖులు చలపతి రావు, నిర్మాత జయకృష్ణ, గోపాలకృష్ణ తనకు అండగా నిలిచారని తెలిపారు. వారి సహాయంతోనే తాను ఆ ఇంటి నుంచి బయటపడగలిగానని, 'వాళ్లు లేకపోతే నేను ఈ రోజు బతికి ఉండేదాన్నో లేదో కూడా తెలియదు' అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సంఘటన ఆమె జీవితంలో అత్యంత భయంకరమైన అనుభవంగా నిలిచిందని చెప్పారు.

ఈ వివాహం ఎక్కువ కాలం కొనసాగలేదని, ఏడాది పూర్తికాకముందే విడాకులు తీసుకున్నట్లు జయలలిత వెల్లడించారు. ఆ సంబంధం తన జీవితంలో అత్యంత బాధాకర ఘటన అని పేర్కొన్నారు. అయినప్పటికీ, ఆ అనుభవం తనను మరింత బలంగా మార్చిందని చెప్పారు. జీవితంలో ఇన్ని కష్టాలు ఎదురైనా, తాను ఎప్పుడూ ఆత్మహత్య గురించి ఆలోచించలేదని జయలలిత స్పష్టం చేశారు.

'జీవితం ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కోవాలి. పారిపోవడం కాదు' అంటూ ధైర్యంగా చెప్పారు. ప్రస్తుతం ఆమె టెలివిజన్ రంగంలో బిజీగా కొనసాగుతూ పలు సీరియల్స్‌లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. కెరీర్‌లో గ్లామర్, వాంప్ పాత్రలతో గుర్తింపు పొందిన ఆమె, ఇప్పుడు క్యారెక్టర్ రోల్స్‌ ల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం జయలలిత చెప్పిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతున్నాయి.

Read more about: tollywood jaya lalitha
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X