నాగార్జున అంటే పిచ్చి ప్రేమ.. ఆ అవకాశం వస్తే అసలు వదులుకోను
టాలీవుడ్‌లో కింగ్ నాగార్జున (Nagarjuna) అంటే ప్రత్యేకమైన స్టైల్, క్లాస్, రొమాన్స్‌కు మరో పేరు. నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆయన, ఇప్పటికీ అదే చార్మ్‌తో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఆరు పదుల వయసులోనూ యంగ్ హీరోలకు పోటీగా నిలుస్తున్నారు. తన ఫిట్‌నెస్, లుక్స్, ఎనర్జీతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నారు. అందుకే అభిమానులు ప్రేమగా ఆయనను 'మన్మథుడు', 'కింగ్ నాగ్'అంటూ పిలుస్తుంటారు.
ఇలాంటి అక్కినేని నాగార్జున క్రేజ్ కేవలం అభిమానుల్లోనే కాదు.. సినీ ఇండస్ట్రీలోని నటీమణుల్లో కూడా ఇప్పటికీ అలాగే ఉంది. తాజాగా ఓ థ్రోబ్యాక్ ఇంటర్వ్యూలో సీనియర్ హీరోయిన్ కస్తూరి శంకర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. అప్పట్లో ఆమె నాగార్జునపై ఉన్న అభిమానాన్ని, టీనేజ్ క్రష్‌ను ఓపెన్‌గా బయటపెట్టడం అప్పుడే కాదు, ఇప్పటికీ క్రష్ అని కామెంట్స్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

యాంకర్ వర్ష హోస్ట్ చేసిన 'కిస్సిక్ టాక్స్' అనే కార్యక్రమంలో గెస్ట్‌గా కస్తూరి శంకర్ (Kasthuri Shankar) పాల్గొన్నారు. తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితం, ఇండస్ట్రీ అనుభవాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా యాంకర్ వర్ష 'నాగార్జున గారంటే మీకు ఎందుకంత అభిమానం?' అని అడగగా, కస్తూరి చెప్పిన సమాధానం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 'నేను చదువుకునే రోజుల నుంచే నాగార్జున గారంటే నాకు చాలా ఇష్టం. అప్పట్లోనే ఒకసారి ఆయనను కలిసే అవకాశం వచ్చింది. ఆయన వేసుకున్న షర్ట్ కలర్, ఆయన లుక్, స్టైల్ ఇప్పటికీ నాకు స్పష్టంగా గుర్తున్నాయి. ఆ రోజు ఆయనతో షేక్‌హ్యాండ్ ఇచ్చుకున్నాను. ఆ టచ్ చేసిన చేయిని రెండు రోజులు కడగకుండా అలాగే ఉంచుకున్నాను. నా ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ చూపిస్తూ 'ఇది నాగార్జున టచ్ చేసిన చేయి' అని చెప్పేదాన్ని,' అంటూ నవ్వుతూ గుర్తుచేసుకున్నారు.
ఆమె మాటల్లోని ఆ అమాయకమైన టీనేజ్ అభిమానం చూసి యాంకర్ వర్ష కూడా నవ్వులు పూయించింది. అంతేకాకుండా 'ఇప్పుడు నాగార్జున గారిని చివరిసారి ఎప్పుడు కలిశారు?'అని అడగగా.. కస్తూరి సరదాగా స్పందించారు. 'చాలా రోజులు అయ్యింది. ఒకసారి వెళ్లి కలవాలి అనిపిస్తోంది. ఏదైనా సాకు పెట్టుకుని వెళ్లి కలవాలి కదా ' అంటూ ఫన్నీగా కామెంట్ చేశారు. ఇక నాగార్జున గురించి మాట్లాడుతూ కస్తూరి మరిన్ని ప్రశంసలు కురిపించారు.
'మా జనరేషన్‌లో నాగార్జున అంటే హీరో మాత్రమే కాదు. అందరి క్రష్. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఈ తరం యువతకు కూడా ఆయనంటే ఇష్టం. ఆయన నటిస్తున్న నెగటివ్ రోల్స్, మిస్టీరియస్ క్యారెక్టర్స్ చూసి కొత్త జనరేషన్ కూడా ఫిదా అవుతోంది. ఏ వయసులోనైనా యంగ్‌గా కనిపించడం ఆయనకే సాధ్యం. ఆ లుక్స్, ఆ చార్మ్ ఎప్పటికీ తగ్గవు'అంటూ చెప్పారు.
అంతటితో ఆగని యాంకర్ వర్ష 'ఇప్పుడు నాగార్జున గారితో ఒక సినిమాలో రొమాంటిక్ సీన్ చేసే ఛాన్స్ వస్తే చేస్తారా?' అని ప్రశ్నించగా, కస్తూరి వెంటనే స్పందించారు. 'ఇలా అడిగి నన్ను టెంప్ట్ చేయకండి. అలాంటి ఆఫర్ వస్తే ఎవరైనా వదులుకుంటారు? నాగార్జున చాలా ప్రొఫెషనల్, జెంటిల్మెన్. ఆయనతో నటించడం ఏ హీరోయిన్‌కైనా కంఫర్ట్. చాలెంజింగ్ సీన్స్ చేయాల్సి వచ్చినా ఆయన నుంచి ఎంకరేజ్మెంట్ తప్పకుండా ఉంటుంది. అలాంటి కింగ్ నాగార్జున గారితో నటించే అవకాశం వస్తే నేను ఎప్పుడూ సిద్ధమే' అంటూ ఓపెన్‌గా చెప్పేశారు. ఈ థ్రోబ్యాక్ ఇంటర్వ్యూ క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications




