మీనా చేసిన పెద్ద తప్పు అదేనా? నాగార్జునతో ఆ ఛాన్స్ వదులుకొన్నదా?

ఒకప్పుడు దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన నటి మీనా(Meena). తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అగ్ర హీరోలందరి సరసన నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు ఆమె అంటే ప్రత్యేక అభిమానం. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేశ్ వంటి స్టార్ హీరోలతో కలిసి ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.

అయితే ఎంతటి స్టార్ హీరోయిన్ అయినా కెరీర్‌లో కొన్ని అవకాశాలు చేజారిపోతుంటాయి. కొన్ని నిర్ణయాలు అప్పట్లో సరైనవిగా అనిపించినా, కాలక్రమంలో అవే జీవితంలో పెద్ద తప్పులుగా అనిపిస్తాయి. అంతేకాదు.. అలాంటి చిన్న చిన్న తప్పదాలే కెరీర్ పై కూడా ప్రభావాన్ని చూపుతుంటాయి. అలాంటి ఒక సంఘటనను తాజాగా మీనా ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంటూ తన మనసులోని బాధను బయటపెట్టింది.

Meena Regrets Missing Nagarjuna s Ninne Pelladatha and Other Hits

ఇంటర్వ్యూలో మీనా మాట్లాడుతూ.. ఒకప్పుడు తనకు వచ్చిన పాత్రల్లో ఎక్కువగా భావోద్వేగాలకు ప్రాధాన్యత ఉండేదని, అందుకే ఇండస్ట్రీలో తనను సరదాగా "గ్లిజరిన్ హీరోయిన్" అని పిలిచేవారని చెప్పారు. తాను నటిస్తున్న సినిమా అంటే షూటింగ్ స్పాట్‌లో గ్లిజరిన్ బాటిల్స్ తప్పనిసరిగా ఉండాల్సిందే అన్నంతగా ఆ తరహా పాత్రలు చేసేదాన్నని గుర్తు చేసుకున్నారు. సావిత్రి, శ్రీదేవి వంటి దిగ్గజ నటీమణుల సినిమాలు చూసి ఎంతో నేర్చుకున్నప్పటికీ, వారిని అనుకరించకుండా తనకంటూ ప్రత్యేక నటన శైలిని ఏర్పరచుకోవడానికే ప్రయత్నించానని మీనా తెలిపారు.

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో రోజుకు రెండు, మూడు షిఫ్ట్‌లలో పనిచేసేదాన్నని, అప్పట్లో భోజనం చేయడానికి, నిద్రపోవడానికి కూడా సమయం ఉండేది కాదని ఆమె పేర్కొన్నారు. హిందీ సినిమాల్లో ఎందుకు ఎక్కువగా కనిపించలేదన్న ప్రశ్నకు సమాధానంగా.. దక్షిణాదిలో అప్పటికే వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండటమే ప్రధాన కారణమని చెప్పారు. ఒక హిందీ సినిమా చేయడానికి పట్టే సమయంతో దక్షిణాదిలో నాలుగు సినిమాలు పూర్తి చేయొచ్చనే అభిప్రాయం అప్పట్లో ఉండేదని వెల్లడించారు. అంతేకాకుండా, ఇక్కడ నిర్మాతలకు ఇచ్చిన కమిట్‌మెంట్లను వదిలేసి బాలీవుడ్‌కు వెళ్లడం తనకు ఇష్టం లేకపోయిందన్నారు.

బాలీవుడ్‌లో కెరీర్ నిర్మించుకోవాలనే ఆలోచన పూర్తిగా లేకపోయినా, హిందీలో నటించాలని మాత్రం కోరిక ఉండేదని మీనా చెప్పారు. అయితే అప్పట్లో వస్తున్న మంచి అవకాశాలను వదులుకుని కొత్తగా బాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోవడం సరైన నిర్ణయంగా అనిపించలేదని వెల్లడించారు. మిథున్ చక్రవర్తి వంటి స్టార్ హీరోల నుంచి కూడా తనకు పలుమార్లు ఆఫర్లు వచ్చాయని, కానీ డేట్స్ సమస్యల కారణంగా వాటిని అంగీకరించలేకపోయానని చెప్పారు.

ఇలాంటి సందర్భాల్లోనే తన జీవితంలో అత్యంత బాధ కలిగించిన సినిమా గురించి మీనా ప్రస్తావించింది. అక్కినేని నాగార్జున హీరోగా తెరకెక్కిన క్లాసిక్ లవ్ స్టోరీ 'నిన్నే పెళ్లాడతా' తనకు వచ్చిన అవకాశం అని వెల్లడించింది. అయితే అప్పటికే తమిళంలో కొన్ని సినిమాలకు కమిట్ కావడంతో ఆ సినిమాకి కావాల్సిన 60 రోజుల డేట్స్ కేటాయించలేకపోయానని చెప్పింది. 'అప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను. నిర్మాతలు, దర్శకులు 60 రోజుల డేట్స్ కావాలని అడిగారు. కానీ, నా చేతిలో ఇప్పటికే చాలా తమిళ సినిమాలు ఉండటంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయాను. అందుకే ఆ సినిమా చేయలేకపోయాను' అని మీనా వివరించింది.

అయితే సినిమా విడుదలై భారీ విజయం సాధించిన తర్వాత తనకు కలిగిన బాధను కూడా ఆమె దాచుకోలేదు. "నిన్నే పెళ్లాడతా సినిమా చూసిన తర్వాత నిజంగానే చాలా బాధపడ్డాను. ఎంత మంచి సినిమా మిస్ అయ్యానో అప్పుడు అర్థమైంది. అయ్యో.. ఇది నేను చేసి ఉంటే బాగుండేది అనిపించింది. ఆ బాధతో ఏడ్చేశాను కూడా" అంటూ మీనా ఎమోషనల్ అయ్యింది. ఇదొక్కటే కాదు, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'నరసింహ' సినిమాలో రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి పాత్ర కూడా ముందుగా తనకు వచ్చిన అవకాశమేనని వెల్లడించింది. అయితే వివిధ కారణాల వల్ల ఆ సినిమా కూడా చేయలేకపోయానని తెలిపింది. తర్వాత ఆ పాత్ర ఎంత పెద్ద సంచలనంగా మారిందో అందరికీ తెలిసిందే. రమ్యకృష్ణ కెరీర్‌లోనే అత్యంత గుర్తుండిపోయే పాత్రల్లో నీలాంబరి ఒకటి.

అంతేకాకుండా విశ్వనటుడు కమల్ హాసన్‌తో కలిసి చేసే అవకాశం కూడా తన చేతుల నుంచి జారిపోయిందని మీనా పేర్కొంది. కెరీర్‌లో అవకాశాలు రావడం ఎంత ముఖ్యమో, సరైన సమయంలో వాటిని అందిపుచ్చుకోవడం కూడా అంతే ముఖ్యమని తన అనుభవం ద్వారా చెప్పకనే చెప్పింది. అయితే ఈ విషయాలన్నింటిని గుర్తు చేసుకుంటూనే ఒక విషయం మాత్రం స్పష్టం చేసింది. తాను తీసుకున్న నిర్ణయాలు అప్పటి పరిస్థితులకు అనుగుణంగానే ఉన్నాయని, కావాలని ఏ సినిమా వదులుకోలేదని తెలిపింది. ఆ సమయంలో తన కెరీర్ పీక్స్‌లో ఉండటంతో డేట్స్ సమస్యలు తప్పవని, కానీ కొన్ని సినిమాలు మిస్ అయిన తర్వాత మాత్రం వాటి విలువ మరింత అర్థమైందని చెప్పింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X