‘ఆ పాట వల్లే నేను హీరోయిన్‌గా చేయడం మానేశా.!'

దక్షిణాది సినీ పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రగతి (Pragathi). తల్లిగా, అత్తగా, వదినగా ఎన్నో స్ట్రాంగ్ రోల్స్ తో ప్రేక్షకులను మెప్పించిన ఆమె, ఒకప్పుడు హీరోయిన్‌గా కూడా కెరీర్ ప్రారంభించారనే విషయం చాలామందికి తెలియదు. అయితే స్టార్ హీరోయిన్‌గా ఎదగాల్సిన సమయంలోనే ఆ అవకాశాన్ని ఎందుకు వదులుకున్నారో తాజాగా వెల్లడించారు. గతంతో తన తన కెరీర్ ప్రారంభ దశలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను వెల్లడించి మరోసారి చర్చనీయాంశంగా మారారు.

ప్రగతి తన సినీ ప్రయాణాన్ని తమిళ దర్శకుడు భాగ్యరాజ్ సినిమాతో ప్రారంభించారు. ప్రారంభంలోనే మంచి గుర్తింపు దక్కినా, హీరోయిన్‌గా కొనసాగడం అంత సులభం కాదని త్వరగానే గ్రహించారట. ముఖ్యంగా ఓ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన సంఘటన ఆమె జీవితాన్ని పూర్తిగా మలుపుతిప్పిందని వెల్లడించారు. 19 ఏళ్ల వయసులో హీరోయిన్‌గా నటిస్తున్న సమయంలో, అదే సినిమాలో హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా ఉన్న వ్యక్తితో తనకు తీవ్రమైన విభేదాలు తలెత్తాయని చెప్పారు.

Throwback Interview Pragathi Reveals Why She Quit Heroine Roles Over Self-Respect Issue

ఆ సినిమా కోసం ప్రత్యేకంగా షూట్ చేసిన ఓ వర్షపు పాటలో తనకు ఇచ్చిన దుస్తులు అసభ్యంగా అనిపించడంతో, అవి ధరించడానికి నిరాకరించానని తెలిపారు. అయితే, ఈ నిర్ణయంపై ఆ హీరో తీవ్రంగా స్పందించి, తనతో అమర్యాదగా ప్రవర్తించాడని ప్రగతి వెల్లడించారు. 'ఇతర హీరోయిన్లు చేస్తే నువ్వెందుకు చేయలేవు?' అని ప్రశ్నించగా, 'వాళ్లు వాళ్లలా ఉంటారు... నేను నా విధంగా ఉంటాను' అని తాను స్పష్టంగా చెప్పినట్టు పేర్కొన్నారు. ఈ వివాదం క్రమంగా పెద్ద గొడవగా మారి, చివరకు షూటింగ్ మధ్యలోనే ఇంటికి వెళ్లిపోయానని చెప్పారు.

ఈ ఘటనతో మూవీ యూనిట్ ప్రొడ్యూసర్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయడంతో పరిస్థితి మరింత క్లిష్టమైంది. కౌన్సిల్ సభ్యులు ఇంటికి వచ్చి షూటింగ్ నిలిచిపోయిందని, నష్టాలు జరిగాయని చెప్పినప్పుడు, తనకు ఎదురైన అవమానాన్ని వారికి వివరించానని చెప్పారు. 'ఆ వ్యక్తితో ఇక పని చేయను' అని తెగేసి చెప్పినప్పటికీ, చివరకు పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కొన్ని షరతులతో షూటింగ్ పూర్తి చేయడానికి అంగీకరించానని తెలిపారు. ముఖ్యంగా తన పూర్తి పారితోషికం ముందుగానే చెల్లించాలని షరతు పెట్టడంతో, నిర్మాతలు అంగీకరించారని వెల్లడించారు.

ఈ సంఘటన తన మనసుకు తీవ్రంగా తాకిందని, ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా గుడ్‌బై చెప్పాలని కూడా నిర్ణయించుకున్నానని ప్రగతి చెప్పారు. ఆత్మగౌరవం కంటే పెద్దది ఏదీ లేదని, గౌరవం లేని చోట ఎన్ని కోట్లు వచ్చినా ఉపయోగం లేదని ఆమె స్పష్టం చేశారు. ఈ ఆలోచనల కారణంగానే హీరోయిన్‌గా అవకాశాలను వదులుకుని, కొంతకాలం సినీ రంగానికి దూరమయ్యారు. తర్వాత వివాహం చేసుకుని కుటుంబ జీవితం ప్రారంభించిన ప్రగతి, ఆర్థిక అవసరాల నేపథ్యంలో మళ్లీ నటన వైపు మళ్లారు.

ఈసారి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి, వరుస అవకాశాలతో బిజీ అయ్యారు. "హీరోయిన్‌గా కంటే ఇప్పుడు చేస్తున్న పాత్రలే నాకు గౌరవం, గుర్తింపును ఇచ్చాయి" అని ఆమె చెప్పడం గమనార్హం. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ, తన ఫిట్‌నెస్ వీడియోలు, డ్యాన్స్ క్లిప్‌లతో యువతకు స్ఫూర్తినిస్తున్నారు. పవర్‌లిఫ్టింగ్‌పై ఆసక్తి ఉన్నప్పటికీ, అది కేవలం అభిరుచి మాత్రమేనని, ఆర్థికంగా లాభం ఉండదని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X