లిప్ లాక్ సీన్స్ వల్ల కెరీర్ నాశనం.. చాలా అవకాశాలు కోల్పోయా..
సినీ ఇండస్ట్రీ అనేది ఆశలు, అవకాశాలు మధ్య పోటీ, సవాళ్లతో నిండిన రంగుల ప్రపంచం ఇది. సినిమాల్లోకి ఎంట్రీకి ముందు ఒక్క ఛాన్స్ కోసం ఎంతో మంది పడుగాపులు కాస్తూ ఉంటారు. అవకాశాల కోసం ఆరాటపడుతారు. మరోవైపు అవకాశాలు వచ్చిన సరైన విధంగా వినియోగించుకోలేని వారు మరికొందరూ. అలాగే, ఇండస్ట్రీలో కొన్ని నిర్ణయాలు కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది. అయితే ఓ స్టార్ హీరోయిన్ మాత్రం ఎన్ని సినిమా ఛాన్స్‌లు వచ్చినా కేవలం లిప్ లాక్ సీన్స్ ఉండడం వల్ల రిజెక్ట్ చేసిందట. ఇంతకీ ఆ హీరోయన్ ఎవరో తెలుసా?
ఆ హీరోయిన్ ఎవరో కాదు.. మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur). ఈ అమ్మడు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టే ముందే హిందీ టెలివిజన్‌లో నటిగా మంచి గుర్తింపు సంపాదించింది. కుంకుమ భాగ్య సీరియల్ ద్వారా ఫేమస్ అయ్యింది. ఈ సీరియల్ ద్వారా ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ ఫేమ్‌తో సినిమాల వైపు అడుగులు వేసింది. మొదట చిన్న పాత్రలతో బాలీవుడ్‌లో ప్రయాణం ప్రారంభించిన ఆమె, ఆ తర్వాత బాలీవుడ్ చిత్రాల్లో హీరోయిన్‌గా మారింది. కథ ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో నటించి, మెప్పించింది.

ఈ క్రమంలో బాలీవుడ్‌లో సూపర్ 30, జెర్సీ వంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఆమె కెరీర్‌లో నిజమైన మలుపు మాత్రం టాలీవుడ్‌లోకి వచ్చిన తర్వాతే వచ్చింది. దుల్కర్ సల్మాన్ సరసన 'సీతారామం' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. తొలి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. ఆ తరువాత హాయ్ నాన్న, ది ఫ్యామిలీ స్టార్ వంటి సినిమాల్లో నటించింది. తాజాగా అడివి శేష్ హీరోగా నటిస్తోన్న 'డెకాయిట్'లో నటిస్తోంది. ఈ సినిమా ఏప్రిల్ 10వ తేదీన విడుదల కానుంది.
లిప్‌లాక్ సీన్స్‌పై తల్లిదండ్రుల అభ్యంతరం
తాజాగా మృణాల్ పాత వీడియో నెట్టింట్లో వైరలవుతోంది. ఈ ఇంటర్వ్యూలో మృణాల్ మాట్లాడుతూ తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న ఒక వ్యక్తిగత అనుభవాన్ని వెల్లడించింది. ఒక సినిమాలో హీరోతో లిప్‌లాక్ సీన్ చేయడం చూసి తన తల్లిదండ్రులు చాలా ఆశ్చర్యపోయారని, ఆ విషయంలో తీవ్రంగా స్పందించారని ఆమె చెప్పింది. ఆ తర్వాత అలాంటి సన్నివేశాల్లో నటించకూడదని తల్లిదండ్రులు కండిషన్ పెట్టారని వెల్లడించింది.
తల్లిదండ్రుల భావాలను గౌరవిస్తూ తాను కూడా ఆ నిర్ణయాన్ని అంగీకరించానని మృణాల్ తెలిపింది. దీంతో కొన్ని సినిమాల్లో వచ్చిన మంచి అవకాశాలను కూడా వదులుకోవాల్సి వచ్చిందని ఆమె చెప్పింది. లిప్‌లాక్ లేదా ఎక్కువ రొమాంటిక్ సన్నివేశాలు ఉండే సినిమాలను తాను తిరస్కరించాల్సి వచ్చిందని వెల్లడించింది.కానీ కాలక్రమంలో పరిస్థితులు మారాయని మృణాల్ చెప్పింది. సినిమా రంగంలో పాత్రకు అనుగుణంగా నటించడం కూడా ఒక భాగమని తన తల్లిదండ్రులకు వివరించిందని తెలిపింది.
తన అభిప్రాయాన్ని వారికి అర్థమయ్యేలా చెప్పడంతో చివరికి వారు కూడా ఒప్పుకున్నారని చెప్పింది. ఆ తర్వాత కథకు అవసరమైతే రొమాంటిక్ లేదా లిప్‌లాక్ సన్నివేశాల్లో నటించేందుకు తాను సిద్ధమయ్యానని మృణాల్ వెల్లడించింది. వాస్తవానికి లిప్ లాక్ నిర్ణయం వల్ల తాను చాలా అవకాశాలు కోల్పోయాననీ, తన అనుకున్నంత స్థాయికి చేరుకోలేదని, తన కెరీర్ పై ప్రభావం పడిందని ఆవేదన వ్యక్తం చేసింది.


Click it and Unblock the Notifications

















