18 ఏళ్ల వయసులోనే అలాంటి అనుభవం.. జాతకాలు చూసి అలాంటి ప్లాన్ అంటూ రకుల్ ప్రీత్ సింగ్

సినిమాల్లో ఢిల్లీ అందం రకుల్ ప్రీత్ క్రేజే వేరు. తన గ్లామర్‌తో కుర్రకారుకు చెమటలు పెట్టించిన ఈ బ్యూటీ.. పలు సూపర్ హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకొని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. వరుసగా స్టార్ హీరోల సరసన నటించి టాలీవుడ్ లో ఫుల్ పాపులర్ అయింది.

ఈ మధ్యకాలంలో కెరీర్ పరంగా కాస్త స్లో అయిన రకుల్, రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో దిమ్మతిరిగే సీక్రెట్స్ బయటపెట్టింది. కాలేజీ రోజుల నుంచి మొదలుకొని తన సినీ ఎంట్రీ, ఆ సమయంలో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ ఓపెన్ గా చెప్పేసింది. మరి అవేంటో చూసేద్దామా..

Throwback Rakul Preet Singh Reveals interesting things in college days and entry into Films

ఇండస్ట్రీ చూపంతా రకుల్ వైపే:
కెరటం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్.. ఆ తర్వాత వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోలతో రొమాన్స్ చేసింది. లౌక్యం, నాన్నకు ప్రేమతో, ధృవ వంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకొని తిరుగులేని క్రేజ్ కొట్టేసింది. దీంతో ఇండస్ట్రీ మొత్తం రకుల్ వైపే చూసింది. రెమ్మ్యూనరేషన్ పరంగా కూడా భారీగానే వసూలు చేసింది ఈ ముద్దుగుమ్మ.

వెంటపడ్డ నిర్మాత.. అతనే కారణం:
గ్లామర్ రోల్స్ చేస్తూ యూత్ మొత్తాన్ని ఉర్రూతలూగించిన రకుల్ ప్రీత్.. కెరీర్ ఆరంభంలో ఇంత క్రేజ్ వస్తుందని, స్టార్ హీరోయిన్ అవుతానని ఊహించలేదట. ఓ నిర్మాత తన జాతకం తెలుసుకొని వెంటపడటం కారణంగానే ఈ స్టేజ్ వచ్చిందన్నట్లుగా చెబుతూ.. ఆ సమయంలో ఏం జరిగిందో క్లియర్‌గా వివరించింది రకుల్.

Throwback Rakul Preet Singh Reveals interesting things in college days and entry into Films

కాలేజీ రోజులు.. బూతు సినిమాలు
తన కాలేజీ రోజుల్లో సినిమాల గురించి పెద్దగా తెలియదని చెప్పిన రకుల్..
సౌత్ సినిమాల్లో బూతు ఎక్కువగా ఉంటుందని తన స్నేహితులు చెప్పేవారని, దీంతో తాను అదే ఫిక్సయ్యానని తెలిపింది రకుల్. అందుకే తాను మోడలింగ్ చేస్తున్న సమయంలో ఓ కన్నడ సినిమాలో అవకాశం వస్తే రిజెక్ట్ చేశానని, అయినా ఆ తనను వదిలిపెట్టలేదని పేర్కొంది. అప్పుడు నా వయసు కేవలం 18 ఏళ్ళు. నా వెంట పడటమే గాక, మా నాన్నతో రెగ్యులర్ గా టచ్‌లో ఉంటూ ఆ ప్రాజెక్ట్ చేయించారని తెలిపింది.

క్లైమాక్స్‌లో శృంగారం.. నా వల్ల కాదు అనేశా:
7 జి బృందావన కాలనీకి కన్నడ రీమేక్ చూడమని ఆ నిర్మాత సీడీ పంపించారు. క్లైమాక్స్‌లో శృంగార సన్నివేశం చూసి నాకు ఏడుపు వచ్చింది. ఈ సినిమా చేయనని నాన్నకు చెబితే నిర్మాతకి ఫోన్ చేసి అదే విషయం చెప్పారు. అయినా ఆ నిర్మాత వదల్లేదు. పర్వాలేదు సినిమాలో ఆ సీన్ తీసేస్తాం.. క్లైమాక్స్ మార్చేస్తాం అని చెప్పి ఆ ప్రాజెక్ట్ ఓకే చేయించారు అని రకుల్ చెప్పింది.

Throwback Rakul Preet Singh Reveals interesting things in college days and entry into Films

నా జాతకం చూసి మరీ చేయించారు:
అయితే ఆ నిర్మాత అంతలా పట్టు బట్టడానికి కారణం తన జాతకం ఆయనకు తెలియడమే అని రకుల్ చెప్పింది. అప్పటికే తన బర్త్ డే తెలుసుకున్న ఆ నిర్మాత తన జాతకం చూపించి స్టార్ హీరోయిన్ అవుతానని తెలుసుకున్నాడు. అదే కారణంతో ఆ నిర్మాత నన్ను వదల్లేదు అని రకుల్ చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X