ఇద్దరికి ఇష్టమైతేనే తప్పులు జరుగుతుంది.. ఇండ‌స్ట్రీలో ఎవ‌రు బ‌ల‌వంతం చేయ‌రు..

తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి అన్నపూర్ణ (Annapurna). దాదాపు ఐదు దశాబ్దాలుగా సినీ రంగంలో కొనసాగుతూ, తల్లిగా, అత్తగా, కుటుంబ కథా చిత్రాల్లో తనదైన ముద్ర వేశారు. అయితే.. తాజాగా సీనియర్ నటికి సంబంధించిన ఓ ఇంటర్వ్యూ క్లిప్ మళ్లీ వైరల్ అవుతోంది. ఇండస్ట్రీలో తరచూ వినిపించే 'కమిట్‌మెంట్', 'కాస్టింగ్ కౌచ్'వంటి అంశాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి చర్చకు దారి తీశాయి. ఇంతకీ ఏమన్నారంటే?

Also Read
ఈ బాధను భరించలేకోపోతున్నా.. గుండె పగిలేలా ఏడ్చిన బిగ్‌బాస్ బ్యూటీ..
ఈ బాధను భరించలేకోపోతున్నా.. గుండె పగిలేలా ఏడ్చిన బిగ్‌బాస్ బ్యూటీ..

నటి అన్నపూర్ణ గారు.. 1975 ప్రాంతం నుంచి తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టారు. తల్లి పాత్రలు, అత్త పాత్రలు, కుటుంబ నేపథ్య పాత్రలు, కామెడీ షేడ్స్ ఉన్న పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు 900కు పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ఆమె తన కెరీర్ లో మూడు నంది అవార్డులు కూడా అందుకున్నారు. ప్రస్తుతం సినిమాలతో పాటు టెలివిజన్ కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ అలరిస్తున్నారు. ముఖ్యంగా శ్రీ దేవీ డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాల్లో కనిపిస్తూ ఈ తరం ప్రేక్షకులకు చేరువవుతున్నారు.

Throwback Senior Actress Annapurna Viral Comments on Casting Couch and Commitments Again
Recommended For You
PEDDI: రామ్ చరణ్ 'పెద్ది' రిలీజ్ డేట్ ఫిక్స్! ఇక థియేటర్లలో పూనకాలే!
PEDDI: రామ్ చరణ్ 'పెద్ది' రిలీజ్ డేట్ ఫిక్స్! ఇక థియేటర్లలో పూనకాలే!

ఇదిలాఉంటే.. తాజాగా నటి అన్నపూర్ణ గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో "కమిట్‌మెంట్" అంశంపై ఆమె మాట్లాడిన మాటలు మళ్లీ వైరల్ అవుతున్నాయి. సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఒకవైపు జరిగే వ్యవహారం కాదని, చాలా సందర్భాల్లో ఇద్దరి నిర్ణయాలు, పరిస్థితులు, ప్రయోజనాలతో కూడుకున్నదే అవుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. 'ఇద్దరికీ ఇష్టమైతేనే కొన్ని తప్పులు జరుగుతాయి' అని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇండస్ట్రీలో ఎవరూ ఎవరినీ బలవంతం చేయరని, వ్యక్తిగత ధైర్యం, స్పష్టత కూడా ఎంతో ముఖ్యం అని అన్నారు. ఒకరికి ఇష్టం లేకపోతే 'నో' చెప్పగలగాలి, అలా చెప్పిన తర్వాత కూడా ఎవరూ బలవంతం చేయలేరని పేర్కొన్నారు.

You May Also Like
నా కొత్త ప్రయాణం మొదలు.. బిగ్ బాస్ టేస్టీ తేజ ఎమోషనల్
నా కొత్త ప్రయాణం మొదలు.. బిగ్ బాస్ టేస్టీ తేజ ఎమోషనల్

అన్నపూర్ణమ్మ తన కాలం గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'మా రోజుల్లో ఉన్న బంధాలు, సంబంధాలు ఇప్పటి తరహాలో కమిట్‌మెంట్ అనేవి కావు. ఇష్టమైతే తుప్పలో కానిచేవారు. వాటిలో విలువలు ఉండేవి. స్వచ్ఛత ఉండేది' అని ఆమె పేర్కొన్నారు. పాత తరం సినీ వాతావరణం, ఇప్పటి పోటీ ప్రపంచం మధ్య తేడా ఉందన్నారు. అలాగే..టాలెంట్ ఉన్నవారికి అవకాశాలు రావనేది తాను నమ్మనని, సినీ పరిశ్రమను సరైన రీతిలో ఉపయోగించుకుంటే ఎదగవచ్చని ఆమె అన్నారు. అన్నపూర్ణమ్మ తన వ్యక్తిగత సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ, నాటకాల నుంచి తన కెరీర్ ప్రారంభమైందని చెప్పారు. మొదట తన పేరు ఉమ అని, తర్వాత అన్నపూర్ణగా మార్చుకున్నానని తెలిపారు. తాను పని చేసిన హీరోలు, దర్శకులు, సహనటులందరూ గౌరవంతో మెలిగారని, కుటుంబ సభ్యుల్లా చూసేవారని పేర్కొన్నారు.

అతను తాగొచ్చి చితకబాదేవాడు.. ప్రతి రోజు నరకం అనుభవించాం..
అతను తాగొచ్చి చితకబాదేవాడు.. ప్రతి రోజు నరకం అనుభవించాం..

అన్నపూర్ణమ్మ సినీ ప్రయాణం విషయానికి వస్తే.. ఎన్టీఆర్, ఎన్నార్, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ వంటి పలువురు స్టార్ హీరోలతో కలిసి పని చేశారు. పాత తరం నుంచి కొత్త తరం వరకు అందరితో కలిసి పనిచేసిన అనుభవం ఉన్న ఆమె చెప్పే ప్రతి మాటకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. ఇది పాత ఇంటర్వ్యూ అయినప్పటికీ నేటి సోషల్ మీడియా యుగంలో మళ్లీ హాట్ టాపిక్ అయింది. ఇండస్ట్రీలో అవకాశాలు, సంబంధాలు, వ్యక్తిగత నిర్ణయాలు, మహిళల భద్రత వంటి అంశాలపై మరోసారి చర్చకు దారి తీసింది. ఈ ఇంటర్వ్యూ క్లిప్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

Read more about: casting couch annapurna tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X