ఆ మూవీ నుంచి బయటకు తోశారు, నగ్న ఫోజులే కారణమా? అమలా పాల్ ఘాటుగా

విజయ్ సేతుపతి హీరోగా రూపొందుతున్న ఓ తమిళ చిత్రం(విఎస్‌పి 33) లో అమలా పాల్ హీరోయిన్‌గా ఎంపికైంది. ఏమైందో తెలియదు కానీ... ఈ మూవీ నుంచి ఆమెను తీసేసి ఆ స్థానంలో మేఘా ఆకాష్‌ను తీసుకున్నారు. డేట్స్ ఇష్యూ వల్లనే అమలా పాల్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. నిర్మాతల నుంచి ఈ ప్రకటన వచ్చిన ఒక రోజు తర్వాత... గురువారం ఆమె ట్విట్టర్లో సంచలన పోస్ట్ చేశారు.

విఎస్‌పి 33, ది ట్రూత్ పేరుతో సుధీర్ఘ లేఖ సంధించిన ఆమె.... ఈ సినిమా నుంచి నన్ను బయటకు తోశారు అంటూ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రొడక్షన్ ఫ్రెండ్లీగా లేదు అనే కారణం చూపుతూ తనను తప్పించడంతో... డిసప్పాయింట్ అయిన అమలా పాల్ తన ట్వీట్లో ఘాటుగానే స్పందించారు.

చాలా డిసప్పాయింట్ అయి ఈ లేఖ రాస్తున్నాను

చాలా డిసప్పాయింట్ అయి ఈ లేఖ రాస్తున్నాను

‘నేను చాలా డిసప్పాయింట్ అయి ఈ లేఖ రాస్తున్నాను. విజయ్ సేతుపతి సినిమా నుంచి నన్ను బయటకు తోశారు. నేను ప్రొడక్షన్ ఫ్రెండ్లీ కాదని సింపుల్‌గా ఒక మాట చెప్పి ఇలా చేయడం నాకు బాధేసింది. వారు అలా చేయడంతో నేను ప్రొడక్షన్ ఫ్రెండ్లీ అవునా? కాదా? అని ఆత్మశోధన చేసుకున్న తర్వాత ఈ లేఖ రాస్తున్నాను'' అని అమలా పాల్ తెలిపారు.

నిర్మాతలకు సపోర్టుగా ఉంటూ వచ్చాను

నిర్మాతలకు సపోర్టుగా ఉంటూ వచ్చాను

నేను దశాబ్దకాలం పాటు సాగించిన సినిమా కెరీర్లో నిర్మాణ సంస్థలకు సపోర్టుగా ఉంటూనే వచ్చాను. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వారికి నా వంతుగా చేయాల్సింది చేశాను. ‘భాస్కర్ ఓరు రాస్కెల్' సినిమా సమయంలో నిర్మాత కోసం నా సాలరీలో కొంత వదులుకున్నాను. సినిమా విడుదల సమయంలో నిర్మాతలకు డబ్బు సహాయం కూడా చేశాను అని అమలా పాల్ గుర్తు చేసుకున్నారు.

తక్కువ మొత్తానికే సినిమాలు చేశాను

తక్కువ మొత్తానికే సినిమాలు చేశాను

త్వరలో విడుదల కాబోతున్న అమలా పాల్ తమిళ మూవీ ‘అధో అధా పరవాయ్ పోలా' సినిమా చిన్న బడ్జెట్‌లో తెరకెక్కుతోంది కాబట్టి షూటింగ్ సమయంలో మామూలు విలేజ్ ఇంట్లో ఉండటానికి ఆమె ఎలాంటి అభ్యంతరం తెలుపలేదట. సినిమా షూటింగ్ సమయంలో యాక్షన్ సీన్లు చేస్తుండగా గాయమైనా భరించి షూటింగ్ పూర్తి చేసిందట. త్వరలో రాబోతున్న ‘ఆడై'(ఆమె) మూవీ కోసం తక్కువ సాలరీ తీసుకుని, చాలా తక్కువ మొత్తంలో ప్రాఫిట్ షేరింగ్ అగ్రిమెంటు మీద చేయడానికి ఒప్పుకందట.

నిర్మాత ఈ నిర్ణయం తీసుకునే ముందు కనీసం ఫోన్ కూడా చేయలేదు

నిర్మాత ఈ నిర్ణయం తీసుకునే ముందు కనీసం ఫోన్ కూడా చేయలేదు

విజయ్ సేతుపతి సినిమాలో తన లుక్‌కు సంబంధించిన కాస్టూమ్స్ కోసం ముంబైలో షాపింగ్ చేస్తుండగా.... నిర్మాత నుంచి ఆమెను తీసివేస్తున్నట్లు సందేశం వచ్చిందట, అమలా పాల్ డిమాండ్లు, షరతులు తమ ప్రాజెక్టుకు సూటవ్వవు అని చెబుతూ ఈ నిర్ణయం తీసుకున్నారట. అయితే నిర్మాత ఈ నిర్ణయం తీసుకునే ముందు కనీసం ఫోన్ కూడా చేయక పోవడంపై అమలా పాల్‌ను మరింత బాధించింది. అందుకే ఈ ప్రాజెక్టు విషయంలో జరిగిన వాస్తవాలు తన లేఖ ద్వారా వివరించే ప్రయత్నం చేశారు అమలా పాల్.

‘ఆడై'(ఆమె)లో నగ్నంగా కనిపించడమే కారణమా?

‘ఆడై'(ఆమె)లో నగ్నంగా కనిపించడమే కారణమా?

ఇటీవల విడుదలైన ‘ఆడై' (ఆమె) టీజర్లో అమలా పాల్ నగ్నంగా కనిపించిన సంగతి తెలిసిందే. ఇది కూడా అమలా పాల్‌ను ఈ చిత్రం నుంచి తీసివేయడానికి కారణం అని అంటున్నారు. ఈ విషయంపై కూడా అమలా పాల్ పరోక్షంగా స్పందించారు.

విజయ్ సేతుపతితో ఎలాంటి సమస్య లేదు

విజయ్ సేతుపతితో ఎలాంటి సమస్య లేదు

విజయ్ సేతుపతితో తనకు ఎలాంటి ఇష్యూ లేదని, భవిష్యత్తులో అతడితో కలిసి నటించడానికి తాను సిద్ధమే అని అమలా పాల్ స్పష్టం చేశారు. అతడితో గొడవ వల్లే సినిమా నుంచి తప్పుకున్నట్లు వచ్చిన వార్తలను అమలా పాల్ ఖండించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X