ఫస్ట్ లుక్: శృంగార దేవతలా కత్రినా కైఫ్!
Recommended Video

ఫస్ట్ లుక్: శృంగార దేవతలా కత్రినా కైఫ్!
బాలీవుడ్ హాట్ బ్యూటీ కత్రినా కైఫ్ మరోమారు అభిమానులని తన అందంతో మెస్మరైజ్ చేసింది. కత్రినా కైఫ్ అమీర్ ఖాన్ సరసన చారిత్రాత్మక చిత్రం థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ కృష్ణ ఆచార్య ఈ భారీ వార్ డ్రామాని తెరకెక్కిస్తున్నారు.
ప్రధాన తరగణానికి సంబందించిన ఫస్ట్ లుక్స్ ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు. ఇటీవల అమితాబ్ బచ్చన్ లుక్ విడుదల చేసిన చిత్ర యూనిట్ తాజాగా కత్రినా కైఫ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. కత్రినా అందాల దేవతలా వెలిగిపోతోంది. క్షణాల్లో కత్రినా ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో సునామిగా మారింది. ఈ చిత్రంలో కత్రినా కైఫ్ పాత్ర పేరు సురైయా.

అందాలు ఒలికించే మహారాణిలా ఉన్న కత్రినని చూస్తే ఎవరైనా వాహ్ అనాల్సిందే. ఈ చిత్రాన్ని దీపావళికి విడుదల విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.


Click it and Unblock the Notifications











