HBD Anupama మందు కొడుతూ.. బీచ్‌లో పొట్టి బట్టలతో డ్యాన్స్‌లు వేస్తూ.. అనుపమ మసాలా డోస్
అనుపమ పరమేశ్వరన్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ మలయాళి ముద్దుగుమ్మకు యూత్‌లో ఫుల్ క్రేజ్ ఉంది. తన తొలి చిత్రం ప్రేమమ్‌తో యూత్ అందరినీ ఫిదా చేసేసింది. పువ్వు లాంటి నవ్వు, నల్లటి కారు మేఘాల్లాంటి కురులతో కుర్రాళ్ల మనసు దోచేసింది. ఆ తర్వాత తెలుగు ప్రేమమ్‌తో మరింత నిద్రపట్టకుండా చేసి గుండెల్లో తిష్ట వేసి కూర్చంది. అయితే నేడు(ఫిబ్రవరి 18) ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ అందాల భామ తన వెకేషన్ వీడియోను పోస్ట్ చేసి అభిమానుల గుండెల్ని మరోసారి బ్రేక్ చేసింది. ఇందులో ఆమె మందు కొడుతూ బీచ్‌లో అందాలను ఆరబోస్తూ డ్యాన్స్‌లతో రచ్చ రచ్చ చేసింది. దాని గురించే ఈ కథనం..
మలయాళి భామ అనుపమ పరమేశ్వరన్ ప్రేమమ్ తర్వాత పలు చిత్రాల్లో నటించి యూత్‌లో డ్రీమ్ గర్ల్‌లా మారిపోయింది. మొదట్లో ట్రెడిషనల్‌గానే కనిపించినా ఆ తర్వాత క్రమక్రమంగా గేర్ మార్చి గ్లామర్ డోస్ పెంచింది. శతమానం భవతి, వున్నది ఒకటే జిందగీ, కృష్ణార్జున యుద్ధం, తేజ్ ఐ లవ్ యూ, హలో గురు ప్రేమ కోసం వంటి చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. ఇన్ని చిత్రాలు చేసినా స్టార్ హీరోల సరసన నటించే అవకాశం ఈ ముద్దుగుమ్మకు రాలేదు.

అందుకేనేమో బహుశ గ్లామర్ డోస్ పెంచడం ప్రారంభించింది. సోషల్ మీడియాలో అభిమానులు షాక్ అయ్యే రేంజ్లో అందాలను ఆరబోసింది. ఎద అందాలతో పాటు, నడుము అందాలను ప్రదర్శించడం,. చీరను కాస్త కిందకు లాగి చూపించడం ఇలాంటివి సెన్సేషన్ క్రియేట్ చేసింది.. కుర్రకారుకు నిద్ర లేకుండా చేసేసింది.
ఆ తర్వాత రౌడీ బాయ్స్ చిత్రంలో లిప్ లాక్ కిస్‌లో రెచ్చిపోయింది. అప్పుడు ఫ్యాన్స్ పోనిలే అని సర్దుకుపోయారు. ఆ తర్వాత మళ్లీ కార్తికేయ 2, 18 పేజీస్ వంటి చిత్రాల్లో ట్రెడిషనల్‌గానే కనిపించి మంచి సక్సెస్ అందుకుంది. మళ్లీ ఇప్పుడు సడెన్‌గా సిద్ధు జొన్నల్లగడ్డ డీజే టిల్లు స్క్వేర్‌లో ఊహించని రేంజ్లో హద్దులు లేకుండా లిప్ కిస్‌లతో షాక్ ఇచ్చింది. కుర్రాళ్లైతే పరేషాన్ అయిపోయారు. అను పాపను టిల్లు గాడు ఇలా మార్చేశాడేంట్రా అంటూ అందరూ ఫీలైపోయారు.

ఇకపోతే నేడు(ఫిబ్రవరి 18) ముద్దుగుమ్మ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా తన వెకేషన్ వీడియోను పోస్ట్ చేసి మళ్లీ షాక్ ఇచ్చింది. ఇందులో ఆమె తాను హోటల్ రూమ్‌ను చూపిస్తూ చిల్ కొడుతూ కనిపించింది. వైన్ బాటిల్‌తో డ్యాన్స్‌లు వేస్తూ ఫుల్ ఎంజాయ్ చేసింది. బెడ్‌పై, బీట్‌లో పొట్టి డ్రెస్సులు ధరించి చిందులేస్తూ రచ్చ రచ్చ చేసింది. తన చేష్టలతో కుర్రాళ్లకు మరోసారి నిద్ర లేకుండా చేసింది. మొత్తానికి ఒంటరిగా ఫుల్ ఎంజాయ్ చేస్తూ కనిపించింది. మరి ఈ వెకేషన్ నుంచి ఎప్పుడు తిరిగి వస్తుందో..
ఇక ఈ వీడియో చూసిన అనుపమ అభిమానులు ఫన్నీ ఫన్నీగా పెడుతూనే తెగ ఫీలైపోతున్నారు. టిల్లు గాడే ఇలా అనుపమను మొత్తం మార్చేశాడు, బేబీ నాకు బ్రేకప్ కన్నా ఇదే ఎక్కువ బాధిస్తుంది ప్లీజ్ మారిపో అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. కాగా, టిల్లు స్క్వేర్ సినిమా మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్‌ను అందుకుంటుందో..


Click it and Unblock the Notifications











