Anupama Parameswaran నాగవంశీకి కాల్ చేస్తే అన్నీ రొమాంటిక్ మాటలే.. సీక్రెట్ లీక్ చేసిన అనుపమ

మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి... కుర్రాళ్ల మనసును దోచేసింది. వరుస సినిమాలతో బిజీగా మారిపోయిన ఈ బ్యూటీ సిద్ధు జోన్నలగడ్డతో కలిసి టిల్లు స్క్వేర్ సినిమాలో నటించింది. ఇక ఈ సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అనుపమ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ప్రోడ్యూసర్ నాగవంశీ ఫోన్ కాల్ మాటలు లీక్ చేసింది ముద్దుగుమ్మ. అసలు విషయం ఏంటో ఈ స్టోరీలో చూసేద్దాం పదండి.

మలయాళం ప్రేమమ్ సినిమాతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది. ఇక అఆ సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టి.. ఇక్కడి తెలుగు కుర్రాళ్ల మనసు దోచేసింది. ఇక స్టార్ హీరోల సరసన నటిస్తూ.. స్టార్ హీరోయిన్ అయిపోయింది. అనుపమ.. కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ అయిన క్రమంలో.. షాకిచ్చింది. అదేనండి రొమాన్స్ డోస్ పెంచి.. యూత్ హార్ట్ బ్రేక్ చేసేసింది. అనుపమ పరమేశ్వరన్ తాజాగా నటిస్తున్న చిత్రం టిల్లు స్వ్కేర్. ఈ సినిమా డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే.

Tillu Square Heroine Anupama Parameswaran Reveals Her Romantic Calls With NagaVamsi Full Details Here

యంగ్ హీరో సిద్దూ జోన్నలగడ్డతో కలిసి రెచ్చిపోయి రొమాంటిక్ సీన్స్ లో నటించి కుర్రాళ్లకు షాకిచ్చింది. ఇప్పటికీ మా అనుపమ ఎలా ఉండేది.. ఎలా చేశావ్ టిల్లు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలు, ట్రైలర్స్ ఆకట్టుకుంటున్నాయి. అనుపమ సిద్దుతో కలిసి రెచ్చిపోయి రొమాన్స్ చేసింది. డిజే టిల్లు సినిమాకు మించి ఇందులో రొమాన్స్ ఉండబోతుందని తెలుస్తోంది. ఇక మరోవైపు ఈ సినిమాను ఫ్యామిలీ సైతం చూడొచ్చని మేకర్స్ చెబుతున్నారు.

టిల్లు స్క్వేర్ చిత్రం మార్చి 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు నరుడా డోనరుడా చిత్రం దర్శకుడు మల్లిక్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నాగ వంశీ నిర్మాతగా వ్యవహరించారు. మరో రెండు రోజుల్లో అంటే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. వరుస ప్రమోషన్స్ చేపట్టారు చిత్ర బృందం. హీరో హీరోయిన్స్ తీరక లేకుండా ఇంటర్వ్యూల్లో పాల్గొని సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు.

తాజాగా టాలీవుడ్ యాంకర్ సుమతో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ నిర్వహించారు. నిర్మాత నాగ వంశీ హీరో హీరోయిన్లు సిద్దు, అనుపమ పరమేశ్వరన్ ఈ ఇంటర్వ్యూలో సందడి చేశారు. ఈ క్రమంలోనే యాంకర్ సుమ అడిగిన ఒక ప్రశ్నలకు ఇంట్రెస్టింగ్ జవాబులు ఇచ్చారు. ఇక అందులో సుమ మీకు హీరోగా సిద్దుతో పనిచేయడం ఇబ్బందికరంగా అనిపించిందా? లేక నిర్మాత నాగ వంశీతో కలిసి పని చేయడం ఇబ్బంది అనిపించిందా అంటూ అనుపమను అడిగింది. దీనికి అనుపమ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

మొదట నాగవంశీ మాట్లాడుతూ.. ఈ సినిమా చేసేందుకు సిద్ధు, అనుపమ డేట్స్ సెట్ అయ్యేవి కావు. ఒకరివి దొరికితే మరొకరివి దొరికేవి కాదు... రెండేళ్ల నుంచి ఒకరి వెంట ఒకరు పడుతూ కొట్టుకుంటూనే ఉన్నామంటూ చెప్పుకువ్చాడు. సినిమా అంతా అయిపోయాక చిన్న ప్యాచ్ వర్క్ ఉందని అనుపమకు కాల్ చేస్తే... నన్ను తిట్టిందంటూ వెల్లడించారు. దీంతో అనుపమ మాట్లాడుతూ.. వంశీ గారికి ఫోన్ చేస్తే ఇలాంటి రొమాంటిక్ మాటలే ఉంటాయని కౌంటర్ వేసింది బ్యూటీ. నాగ వంశీతో కాల్స్ అంటే చాలా క్రిస్పీగా ఉంటాయని బయటపెట్టింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X