బట్టలు లేని ఫొటో షేర్ చేసిన అనుపమ.. నా బ్యాక్‌కు అలా చేయాలంటూ షాకింగ్‌గా!
తెలుగు చిత్ర పరిశ్రమలో కొందరు హీరోయిన్లు మాత్రమే అన్ని జోనర్లలో సినిమాలు చేస్తూ ప్రేక్షకుల మన్ననలు అందుకుంటున్నారు. అలాంటి వారిలో క్యూట్ లేడీ అనుపమ పరమేశ్వరన్ ఒకరు. టీనేజ్‌లోనే సినిమాల్లోకి ఎంటరైన ఈ పిల్ల.. అందం, అభినయంతో చాలా తక్కువ సమయంలోనే సెన్సేషన్ అయింది. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా దూసుకుపోతోంది. ముఖ్యంగా ఈ మధ్యన వరుస ఆఫర్లు దక్కించుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా అనుపమ ఓ క్రేజీ పిక్‌ను షేర్ చేసింది. లేట్ లేకుండా దాన్ని మీరే చూసేయండి మరి!
ప్రేమమ్‌తో.. ఆ సినిమాల్లో
చిన్న వయసులోనే అనుపమ పరమేశ్వరన్ 'ప్రేమమ్' అనే సినిమాతో నటిగా వచ్చింది. ఆ తర్వాత అక్కడ మరో సినిమాలో నటించింది. ఈ క్రమంలోనే 'అఆ'తో తెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత నాగ చైతన్య 'ప్రేమమ్'లో హీరోయిన్‌గా నటించింది. అప్పటి నుంచి 'ఉన్నది ఒకటే జిందగీ', 'హలో గురూ ప్రేమకోసమే', 'కృష్ణార్జున యుద్ధం' వంటి సినిమాలు చేసింది.

వరుస హిట్లతో ఫుల్ బిజీ
తెలుగులో అనుపమ పరమేశ్వరన్ చేసిన సినిమాలు చాలా తక్కువే కానీ, మంచి గుర్తింపు మాత్రం దక్కించుకుంది. కానీ, ఆఫర్లను పెద్దగా దక్కించుకోని సమయంలో ఆమె 'రాక్షసుడు' అనే సినిమా భారీ హిట్ కొట్టింది. దీని తర్వాత 'రౌడీ బాయ్స్' నిరాశ పరిచింది. అయితేనేం నిఖిల్‌తో వరుసగా 'కార్తికేయ 2', '18 పేజెస్' వంటి హిట్లను అందుకుని సత్తా చాటుకుంది.

టిల్లు స్క్వేర్ సెన్సేషన్
దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ అనుపమ పరమేశ్వరన్ సినిమాలు చేసింది. తెలుగులో ఎలా అయితే పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుందో.. అన్ని భాషల్లోనూ అదే విధంగా పాపులర్ అయింది. ఈ క్రమంలోనే ఆ మధ్య ఆమె 'బటర్‌ఫ్లై' అనే చిత్రంలోనూ నటించింది. ఇటీవలే అనుపమ పరమేశ్వరన్ 'టిల్లు స్క్వేర్' మూవీ చేసింది. దీని ద్వారా మళ్లీ సెన్సేషన్‌గా మారిపోయింది.

అక్కడ ఎప్పుడూ యాక్టివ్
టాలీవుడ్‌లో సుదీర్ఘ కాలంగా వరుస పెట్టి ఆఫర్లను దక్కించుకుంటూ ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. దీని ద్వారానే ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను షేర్ చేస్తూ వెళ్తోంది.

హాట్ షోతోనూ హైలైట్‌గా
అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో తరచూ తన ఫొటోలు, వీడియోలను వదులుతూ రెచ్చిపోతోంది. అందులోనూ అప్పుడప్పుడూ అందాల విందు చేస్తూ దిగినవి కూడా షేర్ చేస్తోంది. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేస్తూ దిగిన ఫొటోలు పోస్ట్ చేస్తోంది. తద్వారా ఈ బ్యూటీ దేశ వ్యాప్తంగా పాపులార్ అవుతోంది. అదే సమయంలో తరచూ అనుపమ సెన్సేషన్‌గా మారిపోతోంది.

అలా మసాజ్ కావాలని
సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తోన్న అనుపమ పరమేశ్వరన్ తాజాగా ఓ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఓ వ్యక్తి బట్టలు లేకుండా పడుకుని ఉండగా.. పైన రోలర్‌తో మసాజ్ చేస్తున్నట్లు ఉంది. దీన్ని చూపిస్తూ తనకు కూడా ఇలాంటి 'బ్యాక్ మసాజ్' కావాలని క్యాప్షన్ ఇచ్చింది. దీంతో అనుపమ పరమేశ్వరన్ షేర్ చేసిన ఈ ఫొటో విపరీతంగా వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











