36 ఏండ్ల వయస్సులో పెళ్లి పీఠలెక్కబోతున్న టాలీవుడ్ ముద్దుగుమ్మ.. ఇంతకీ వరుడు ఎవరంటే?

Nithya Menen: రోజుకో కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇస్తూ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించడం అంత సులభమేమీ కాదు. అందం, అభినయంతో పాటు కాసింత అదృష్టం కూడా కావాలి. అలా అన్ని కలిసి వస్తే ఆఫర్స్ వస్తాయి. ఈ క్రమంలో నటించిన మూవీకి హిట్ టాక్ వస్తే స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో నిలుస్తారు. ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా కాస్త సేఫ్ అవుట్.. అయితే, ఫేడ్ అవుట్ అవ్వాల్సిందే. అందుకే కెరీర్ సక్సెస్ ట్రాక్ లో నడిసినని రోజులు స్టార్ హీరోయిన్స్ పెళ్లి దూరంగా ఉంటున్నారు. కేరీర్ కొంత డైన్ ఫాల్ ఉన్నసమయంలో పెళ్లికి సిద్దమతున్నారు. ఇలా 36 ఏళ్ల వయస్సులో ఓ హీరోయిన్ పెళ్లి పీటలెక్కబోతున్నది. ఇంతకీ ఆ టాలీవుడ్ బ్యూటీ ఎవరు? మీరో లూక్కేయండి.

ఈ బ్యూటీ ఆ స్టార్ బ్యూటీ ఎవరో కాదు.. టాలీవుడ్ నటి నిత్యామీనన్. ఈ బ్యూటీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సినీ ఇండస్ట్రీలో టాలెంటెడ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది టాలీవుడ్ ముద్దుగుమ్మ నిత్యామీనన్. తన అందం, అభినయంతో ఎన్నో సినిమా అవకాశాలను కైవసం చేసుకుంది. నటనకు ప్రాధాన్యతకు ఇచ్చే అమ్మడు.. తన నటించే పాత్రలను ఎంచుకుని మరీ నటిస్తోంది. తన నటనతో మెప్పిస్తోంది. ఈ అమ్మడు 'అలా మొదలైంది' అనే సినిమా ద్వారా కథానాయకగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నిత్య మీనన్. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆక్ట్రాక్ చేసింది. ఆ తర్వాత అనేక సినిమాల్లో నటించారు.

Tollwood heroin Nithya Menen marriage rumours may marry Tamil star hero are going viral

అలా మొదలైంది తర్వాత సెగ, ఇష్క్ తో హీరో నితీన్ సరసన నటించారు. వీరి ఫేర్ కు మంచి క్రేజ్ రావడంతో గుండెజారి గల్లంతయ్యిందే అనే సినిమాలో నటించింది. ఈ మూవీకి కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. దీంతో తెలుగు ఆడియన్స్ దగ్గర మార్కులు కొట్టేశారు నిత్యా మీనాన్. ఆ తర్వాత జబర్దస్త్ , ఒక్కడినే, సినిమాల్లో నటించి..తన నటనకు గాను మంచి మార్కులు కొట్టేసింది. దీంతో పాటు గీతగోవిందం, ప్రాణ, జనతా గ్యారేజ్ వంటి సినిమాల్లో గెస్ట్ పాత్రల్లో నటించి మెప్పించింది. తెలుగులో చివరిగా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లానాయక్ సినిమాలో మెరిసింది.

నిత్యమీనన్ తెలుగు, కన్నడ, మలయాళ సినిమాల్లో నటిస్తోంది. ఆమె తన అందం, అభినయంతో అట్రాక్ట్ చేయడమే కాకుండా..ఆమె మంచి గాయనిగా కూడా. ఈ అమ్మడు పలు చిత్రాల్లో పాటలు పాడి.. ప్రేక్షకులను అలరించింది. ఇటీవల ఈ అమ్మడు నేషనల్ అవార్డునుసొంతం చేసుకుంది. ధనుష్ తో కలిసి ఆమె నటించిన సినిమాకు గాను ఉత్తమ నటిగా నిత్యా అవార్డు అందుకుంది. ఈ క్రమంలో సాయి పల్లవి ఫ్యాన్స్ నిత్యామీనన్ ను ఆడిపోసుకున్న విషయం తెలిసిందే.

Tollwood heroin Nithya Menen marriage rumours may marry Tamil star hero are going viral

ఇదిలా ఉంటే తాజాగా నిత్యామీనన్ పెళ్ళికి సంబందించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కోలీవుడ్ నుంచి వినిపిస్తున్న టాక్ ప్రకారం నిత్యామీనన్ తమిళ్ స్టార్ హీరోను పెళ్లి చేసుకోనుందని అంటున్నారు. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని ప్రచారం జరుగుతోంది. అయితే.. దీనిపై మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇంతకూ ఆ స్టార్ హీరో ఎవరు అనేది మాత్రం తెలియడం లేదు. ఇటీవల కొంతమంది ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

More from Filmibeat

Read more about: nithya menen
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X