టాలీవుడ్ నటి సంచలనం.. దర్శక నిర్మాతల మైండ్ బ్లాక్ చేస్తున్న మ్యాడ్ హీరోయిన్ అనంతిక సనిల్ కుమార్

తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోలుగా, హీరోయిన్లుగా నిలబడలాంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ఫిల్మ్ క్రాఫ్ట్స్ తో పాటు స్పెషల్ టాలెంట్ కూడా తప్పనిసరిగా ఉండాలి. అలాగైతే కోట్లాది ప్రేక్షకులను వెండితెరపై మెప్పించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే టాలీవుడ్ లో యంగ్ టాలెంట్ దుమ్ములేపుతున్న సంగతి తెలిసిందే. రష్మిక శ్రీలీలా, మీనాక్షి చౌదరి, మాళవికా మోహన్, ఆషికా రంగనాథ్ వంటి హీరోయిన్లు ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో నటి సంచనలంగా మారింది. 64 కళల్లో ఆరితేరిన వీర వనితలా కనిపిస్తోంది. ఆమె టాలెంట్ ను చూసి దర్శక, నిర్మాతలే ఆశ్చర్యపోతుండటం ఇప్పుడు ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్ గ్గా మారింది. ఇంతకీ ఆమె ఎవరు? ఎక్కడ నుంచి వచ్చింది? ఎలాంటి నైపుణ్యాలు కలిగి ఉంది? నెక్ట్స్ రాబోయే సినిమా ఏంటనే వివరాల్లోకి వెళితే..

అనంతిక సనిల్ కుమార్ వివరాలు..
అనంతిక కుమార్ కేరళలో పట్టి పెరిగింది. 2 ఫిబ్రవరి 2006లో జన్మించింది.చిన్నప్పటి నుంచే అనంతి కుమార్ కళల పట్ల చాలా ఆసక్తిని కలిగి ఉండేది. సోషల్ మీడియాలో తనకు సంబంధించిన వీడియోలను పంచుకుంటూ ఉండేది. అలా సినిమా అవకాశాలు అందుకుంది. తన తల్లి జీనీ ప్రోత్సాహంతోనే యాక్టింగ్ ను తన కెరీయర్ గా మలుచుకుంది. ఆమె లాయర్ డిగ్రీని పొందడం విశేషం.

Tollywood actress Ananthika Sanilkumar extraordinary skills

అనంతిక సనిల్ కుమార్ తెలుగు సినిమాలు..
అనంతిక సనిల్ కుమార్ పూర్తిగా తన టాలెంట్ తోనే దక్షిణ చిత్ర పరిశ్రమలో చోటు సంపాదించుకుంది. 2015లోనే మిలి అనే తమిళ చిత్రంలో కీలక పాత్రలో అవకాశం దక్కించుకుంది. కరోనా లాక్ డౌన్ తర్వాత హీరోయిన్ గా సినీ అవకాశాలు అందుకుంది. తమిళంలో రైడ్, లాల్ సలామ్, తెలుగు లో మ్యాడ్, రాజమండ్రి రోజ్ మిల్క్ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది. నెక్ట్స్ 8 వసంతాలు అనే చిత్రంలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది.

అనంతిక సనిల్ కుమార్ హిడెన్ టాలెంట్స్..
బ్యూటీఫుల్ లుక్ తో ఆకట్టుకునే అనంతిక సనిల్ కుమార్ తనలో దాగిన హిడెన్ టాలెంట్స్ తోనూ ఆశ్చర్య పరుస్తోంది. అనంతిక క్లాసికల్ డ్యానర్ కావడం విశేషం. ఆమె భరతనాట్యం, కూచిపూడిలో నైపుణ్యం సాధించింది. అలాగే కరాటే, మార్షల్ ఆర్ట్స్ లో బ్లాక్ బెల్ట్ లెవల్ కు చేరుకుంది. కేరళ రక్షణ యుద్ధ విద్య కలరియాపట్టులోనూ అనుభవం కలిగి ఉంది. తను డ్రమ్స్ వాయించగదు. ఇక నటిగా ఇప్పటికే అలరిస్తోంది. మరోవైపు లా స్టూడెంట్ గానూ విద్యనభ్యసించడం విశేషం. ఇవన్నీ ఆమె 19 ఏళ్లలోనే చేయడం విశేషంగా మారింది.

8 వసంతాలు సినిమా విశేషాలు..
అనంతిక సనిల్ కుమార్ నెక్ట్స్ 8 వసంతాలు చిత్రంలో అలరించబోతోంది. ఈ చిత్రానికి ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించారు. అనంతిక సనిల్‌కుమార్, రవి తేజ దుగ్గిరాల, హను రెడ్డి, కన్నా పసునూరి ప్రధాన పాత్రలు పోషించారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తుండటం విశేషం. సినిమాటోగ్రఫీగా విశ్వనాథ్ రెడ్డి, శశాంక్ మాలి ఎడిటింగ్ బాధ్యతలు చూస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 20న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X