Anasuya Bharadwaj: మహానటిని మరిపిస్తున్న అనసూయ అందాలు.. ఇలా చూస్తే సావిత్రిని చూసినట్లే ఉంది!

యాంకర్ గా కెరియర్ ప్రారంభించిన అనసూయ భరద్వాజ్ ఇప్పుడు నటిగా కూడా దూసుకెళ్తోంది. బ్యూటిఫుల్ అండ్ హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ దశాబ్ద కాలం పాటు టెలివిజన్ ను ఏలింది. ముఖ్యంగా జబర్దస్త్ షో ద్వారా విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. అనసూయ చేసే కామెడీ అయినా ఆమె అందాలు అన్నా అందరికీ ఇష్టమే. అందుకే ఇద్దరు పిల్లల తల్లి అయినా ఆమె ఇంకా నటిగా కొనసాగుతోంది. రోజురోజూకు తన గ్లామర్ ను పెంచుకుంటూ కుర్రకారు గుండెల్ని హీటెక్కిస్తోంది. ఓ వైపు సినిమాల్లో ఫుల్ బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో అదిరిపోయే లుక్కులో కనిపించిన అందరి చేత ఆహా అనిపించుకుంటుంది. ముఖ్యంగా అనసూయ భరద్వాజ్.. మహానటి సావిత్రి లుక్కును రీక్రియేట్ చేసింది. అచ్చం సావిత్రాలాగే తయారై వీణ పట్టుకొని ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. ఆ ఫొటోల్లో అనసూయ భరద్వాజ్ ను చూస్తే అచ్చం సావిత్రిని చూసినట్లే అనిపిస్తోంది. డార్క్ గ్రీన్ కలర్ శారీ కట్టుకున్న అనసూయ.. సావిత్రిలాగే మేకప్ వేసుకుంది. జుట్టును సిగలాగా చుట్టుకొని అచ్చం సావిత్రి పెట్టుకునే బొట్టు పెట్టుకుంది.

Tollywood Actress Anasuya Bharadwaj Recreates Mahanati Savitri Look Photos Goes Viral

ఓ చేతికి ఓ బ్లాక్ కలర్ పట్టీ వాచ్, మరో చేతికి ఓ గాజు వేసుకున్న అనసూయ.. మెడలో సింపుల్ నల్లపూసల దండ వేసుకుంది. అలాగే చెవులకు సిల్వర్ జర్మన్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంది. ఏదో షోలో పాల్గొన్న అనసూయ అచ్చం సావిత్రాలాగా తయారై.. నీవు లేక వీణా పలుకలేనన్నది అంటూ సాగే పాటకు డ్యాన్స్ చేసింది. అదిరిపోయే స్టెప్పులు వేస్తూ మహానటిని మైమరిపించింది. అనసూయన అందాచందాలకు, ఆమె పర్ఫార్మెన్స్ కు అంతా ఫిదా అయిపోయారు. ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఫొటోలు షేర్ చేసిన అనసూయ.. కింద ఈ పాటను కూడా రాసుకొచ్చింది.

Tollywood Actress Anasuya Bharadwaj Recreates Mahanati Savitri Look Photos Goes Viral

అనసూయ షేర్ చేసిన ఈ ఫొటోలు చూసిన నెటిజెన్లు పెద్ద ఎత్తున లైకులు, కామెంట్లు, షేర్లు చేస్తున్నారు. నెట్టింట ఈమె ఫొటోలను వైరల్ గా మారుస్తూ రచ్చ చేస్తున్నారు. అనసూయవిత్రి అంటూ సావిత్రి, అనసూయలను కలిపేశాడో నెటిజెన్. అలాగే అచ్చం సావిత్రిలాగే కనిపిస్తున్నావని కొందరు, ఆ మహానటిని మళ్లీ గుర్తు చేశావంటూ మరికొంత మంది తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. ఏది ఏమైనా అనసూయ భరద్వాజ్ మహానటి లుక్ లో అదరగొట్టిందనే చెప్పొచ్చు. ఈ ఫొటోలపై మీరూ ఓ లుక్ వేస్తే మీకే ఆ విషయం అర్థం అవుతుంది.

Tollywood Actress Anasuya Bharadwaj Recreates Mahanati Savitri Look Photos Goes Viral

రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా నటించిన అసనూయ.. తన మార్కును చూపించింది. ఆ తర్వాత కూడా చాలా చిత్రాలు చేసి అదరగొట్టింది. ముఖ్యంగా పుష్ప సినిమాలో డిఫరెంట్ లుక్ లో కనిపించి అందరినీ మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం ఆమె పుష్ప2 చిత్రంలోనూ నటస్తోంది. ఈ సెకండ్ పార్ట్ లో అనసూయ క్యారెక్టర్ మరింత హైలెట్ అయిందని టాక్ నడుస్తోంది. సినిమా రిలీజ్ అయితే గానీ అసలు విషయం తెలియదు. చూడాలి మరి ఏం జరగనుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X