Anasuya Bharadwaj: ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తున్న అనసూయ - ముద్దులిస్తూ, కన్నుగీటుతూ ఫోజులు
Anasuya Bharadwaj: యాంకర్ గా కెరియర్ ప్రారంభించిన అనసూయ భరద్వాజ్.. తన అంద, చందాలతో బుల్లితెర ప్రేక్షకుల్ని తెగ ఆగట్టుకుంది. ఓ వైపు టీవీ షోలలో నటిస్తూనే మరోవైపు సినిమాల్లోనూ తనదైన నటనతో మంచి మార్కులు తెచ్చుకుంది. బోల్డ్ అండ్ చలాకీ యాంకర్ గా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ సినిమాల్లోనూ ఛాన్సులు దక్కించుకుంటూ అదరగొడుతోంది. ప్రస్తుతం కేవలం సినిమాలపైనే దృష్టి పెట్టిన ఈ అమ్మడు వరుసగా చిత్రాలు చేస్తోంది. ఎలాంటి సినిమాల్లో అయినా నటిస్తూ.. తన అందం, అభినయాన్ని మరింత మెరుగు పరుచుకుంటుంది.
సోగ్గాడే చిన్ని నాయన చిత్రంలో ఓ క్యారెక్టర్ పోషించిన అనసూయ భరద్వాజ్.. ఆ తర్వాత క్షణం, విన్నర్, గాయత్రి వంటి చిత్రాల్లోనూ మెరిసింది. ముఖ్యంగా రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా నటించి అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆ తర్వాత మీకు మాత్రమే చెప్తా, కథనం, ఎఫ్2, చావు కబురు చల్లగా, థాంక్యూ బ్రదర్, పుష్ప, భీష్మపర్వం, ఖిలాడీ, దర్జా, వాంటెడ్ పండుగాడు, మైఖేల్, రంగమార్తాండ, విమానం సినిమాల్లోనూ నటించి తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంది. తాజాగా ఈమె పెదకాపు చిత్రంలోనూ నటించింది.

సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుందీ ముద్దుగుమ్మ. తనకు సంబంధించిన సినీ అప్ డేట్లతో పాటు పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను కూడా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. ఎవరైనా నెగిటివ్ కామెంట్లు చేసినా, ట్రోల్స్ చేసినా గట్టిగానే స్పందిస్తూ.. రచ్చ చేస్తుంటుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో అద్భతంగా కనిపిస్తూ అందరినీ ఆకర్షిస్తోంది.

పిస్తా గ్రీన్ కలర్ కుర్తా సెట్ వేసుకొని అదిరిపోయే ఫోజులు ఇచ్చింది యాంకర్ అనసూయ. చేతులకు ఫుల్లుగా ఉంగరాలు పెట్టుకొని క్యూట్ గా చూస్తూ ఫొటోలు దిగింది. హెయిర్ లీవ్ చేసుకొని క్యూట్ క్యూట్ గా లుక్స్ ఇచ్చింది. ముఖ్యంగా కన్ను గీటుతూ.. తలపై కొమ్ములు పెట్టుకుంటూ, ఫ్లయింగ్ కిస్ ఇస్తూ, లవ్ సింబల్ చూపిస్తూ ఇచ్చిన ఫోజులు అదిరిపోయాయి. హై హీల్స్ వేసుకొని తన బాడీలోని ప్రతీ అందం హైలెట్ అయ్యేలా చేసింది. ఎద అందాలతో పాటు, నడుము, బ్యాక్ అందాలు బహుబాగా కనిపించేలా దిగిన ఫొటోలను షేర్ చేసింది.

అనసూయ పోస్ట్ చేసిన ఈ ఫొటోలకు లక్షల్లో లైకులు, వేలల్లో కామెంట్లు వచ్చాయి. ఓ నెటిజెన్ అయితే.. హమ్మయ్యా ఇప్పటికైనా ఒంటి నిండా బట్టలు వేసుకున్నావ్, చూడు ఎంత బాగా కనిపిస్తున్నావో అంటూ కామెంట్ చేశాడు. అందంగా ఉన్నావు, అదిరిపోయావు అని చెబుతూ కామెంట్లు వర్షం కురిపించారు. మరికొందరేమే వ్యంగ్యంగా స్పందించారు. అందంగా ఉన్నావు ఆంటీ అని చెప్పుకొచ్చారు. మరి ఈ కామెంట్లపై అనసూయ ఎలా స్పందించనుందో చూడాలి. తిట్టుకుంటూ దుమ్మెత్తిపోస్తుందో, లేదా లైట్ తీసుకొని సైలెంట్ గా తన పని తాను చేసుకుంటుందో.


Click it and Unblock the Notifications











