అతనితోనే అనుష్క శెట్టి పెళ్లి, పిల్లలు.. కానీ కండీషన్స్ పెట్టిన స్వీటీ?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. అక్కినేని నాగార్జున అనుష్క శెట్టి తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. తొలి చిత్రంతోనే అందరి హృదయాలను గెలుచుకుంది. ఆ తర్వాత మంచి అవకాశాలను అందుకొని తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా మారింది. అయితే అనుష్క శెట్టి గురించి అభిమానులు కోరుకుంటున్నది ఒక్కటే. ఇప్పటికీ అనుష్క శెట్టి ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదని సందేహిస్తున్నారు. కానీ ఒక సమయంలో అనుష్క శెట్టి తన పెళ్లిపై ఇలా స్పందించింది..

నాలుగు పదుల వయస్సు దాటినా..
2005 నుంచి అనుష్క శెట్టి తెలుగు చిత్ర పరిశ్రమలో యాక్టివ్ గా ఉంటోంది. వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ ఆకట్టుకుంటోంది. 1981 నవంబర్ 7న పుట్టిన అనుష్క శెట్టి ఇప్పటికే 43 ఏళ్లకు చేరుకుంది. బెంగళూరులో పుట్టిన పెరిగిన స్విటీ తొలుత యోగా టీచర్ గా క్లాస్ లు తీసుకునేది. కానీ ఆమెకు మోడలింగ్ పై ఆసక్తి ఉండటంతో సినిమాల్లోకి వచ్చింది. ఇక అక్కినేని నాగార్జన - పూరీ కాంబినేషన్ లో వచ్చిన 'సూపర్' చిత్రంతో హీరోయన్ గా మారింది. తెలుగు, తమిళంలోనూ నటించి మెప్పించింది. కెరీయర్ లో పీక్స్ చూసిన అనుష్క శెట్టి తన మ్యారేజ్ విషయంలో వెనకబడటం అభిమానులకు బాధగా ఉంది. నాలుగు పదుల వయస్సు దాటినా ఇంకా సింగిల్ గానే ఉండటం గమానర్హం.

Tollywood Actress Anushka Shetty Will Going to Marry That Person

పెళ్లి, పిల్లలపై అనుష్క శెట్టి అభిప్రాయం..
అనుష్క శెట్టి ఒక సందర్భంలో తన పెళ్లి గురించి, పిల్లల గురించి కూడా స్పందించింది. తనకు పెళ్లిపై నమ్మకంగా ఉందని, అలాగే తనకు పెళ్లి, పిల్లలు కావాలని కోరుకుంటున్నట్టు చెప్పింది. కానీ చాలా సమయం తీసుకుంటానని చెప్పారు. తను గాఢంగా ప్రేమించిన అతన్ని మాత్రమే పెళ్లి చేసుకోబోతున్నట్టు చెప్పారు. అతను సినీ పరిశ్రమకు చెందిన వాడు కాదని అనుష్క శెట్టి చెప్పడం ఆసక్తికరంగా మారింది. దీంతో అతను ఎవరనేది ఇంట్రెస్టింగ్ అంశంగా మిగిలింది.

ఈ స్టార్స్ తో అనుష్క లవ్?
అనుష్క శెట్టి కెరీయర్ ప్రారంభంలో పలు స్టార్స్ తో లవ్ స్టోరీలు నడిపిందంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి. మ్యాచో స్టార్ గోపీచంద్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లతో అనుష్క శెట్టి లవ్ స్టోరీ సాగిందని పుకార్లు వచ్చాయి. కానీ వాళ్లతో పనిచేయడం మూలంగా పుట్టినవే అని కొట్టి పారేశారు. ఇక ప్రభాస్ తో అనుష్క లవ్ లో ఉందంటూ ఇప్పటికీ రూమర్లు వస్తుండటం గమనార్హం.

అనుష్క శెట్టి రాబోయే చిత్రాలు..
బాహుబలి లాంటి భారీ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న తర్వాత అనుష్క శెట్టి పెద్దగా సినిమాలు చేయడం లేదు. వచ్చి అవకాశాల్లో నామ మాత్రంగా సినిమాలు చేస్తోంది. చివరిగా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. ఇక ప్రస్తుతం అనుష్క శెట్టి క్రిష్ జాగర్లముడి దర్శకత్వంలో 'ఘాటీ' అనే చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీ జూలై 11న గ్రాండ్ గా విడుదల కాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X