Divyansha Kaushik: రవితేజ హీరోయిన్ చబ్బీ లుక్స్ లో బికినీ అందాలు.. బెస్ట్ బికినీ అవార్డ్ ఇవ్వొచ్చు!
కొంతమంది హీరోయిన్స్ వచ్చిన కొత్తలో చాలా సింపుల్ గా కనిపించినప్పటికీ మెల్లగా ఆ తర్వాత గ్లామర్ లుక్స్ తో ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ఇటీవల తెలుగులో సినిమాలు చేస్తున్న దివ్యాంశ కౌశిక్ కూడా మెల్లగా తన గ్లామర్ డోస్ ను పెంచుతుంది. ఈ బ్యూటీ ఇంతకుముందే మోడల్ గా మంచి గుర్తింపును అందుకుంది. ఇక ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో బిజీ అయ్యేందుకు గ్లామర్ తో షాక్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇక ఆమెకు సంబంధించిన ఒక బికినీ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

మోడల్ నుంచి నటిగా..
ఢిల్లీకి చెందిన దివ్యాంశ కౌశిక్ మొదట మోడల్ గా తన కెరీర్ను స్టార్ట్ చేసింది. ఇక తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ బ్యూటీ అవకాశాలు అందుకోవాలి అని చాలా ప్రయత్నాలు చేసింది. కానీ అక్కడ పెద్దగా అవకాశాలు దొరకలేదు. ఇక స్పెషల్ ఫోటోషూట్స్ తో అమ్మడు తెలుగు ఇండస్ట్రీని కాస్త గట్టిగానే ఆకర్షించింది. ఇక మొదట ఆమె 2019లో నాగచైతన్య మజిలీ సినిమాలో ఒక మంచి పాత్రలో కనిపించింది.

రవితేజ సినిమాతో డిజాస్టర్
ఇక మజిలీ సినిమా తర్వాత అమ్మడికి మళ్లీ పెద్దగా అవకాశాలు రాలేదు. ఇక బాలీవుడ్ లోనే ఆమె ది వైఫ్ అనే ఒక సినిమా చేసింది. అయితే ఆ సినిమా కూడా అంతగా సక్సెస్ కాలేదు. ఇక మళ్ళీ తెలుగు వైపు యు టర్న్ తీసుకున్న ఈ బ్యూటీ రవితేజతో రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమా చేసింది. ఆ సినిమా విడుదలకు ముందు కొంత పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసినప్పటికీ విడుదల తర్వాత మాత్రం డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది.

పాన్ ఇండియా ఫ్లాప్
మొదటి సినిమా సక్సెస్ అయినప్పటికీ రెండవ సినిమా తెలుగులో ఈ బ్యూటీకి అనుకున్నంతగా గుర్తింపును తీసుకురాలేదు. ఇక ఈ ఏడాది అమ్మడు ఎలాగైనా మైఖేల్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అందుకోవాలని అనుకుంది. సందీప్ కిషన్ కథానాయకుడిగా విజయసేతుపతి మరొక ముఖ్యమైన పాత్రలో నటించిన మైఖేల్ సినిమా కూడా తీవ్ర స్థాయిలో నిరాశపరిచింది. దీంతో అమ్మడికి మరో ఫ్లాప్ ఎదురైంది.

బికినీ అందాలతో స్టన్నింగ్
ఇక సినిమా అవకాశాలు వస్తున్నా రాకపోయినా కూడా దివ్యాంశ మాత్రం తన గ్లామర్ తో సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తుంది. గతంలో చాలాసార్లు బికినీ అందాలతో కిక్ ఇచ్చిన ఈ బ్యూటీ ఈసారి మరింత డోస్ పెంచింది. రీసెంట్ గా బీచ్ ఒడ్డున అమ్మడు బికినీ అందాలతో కూర్చున్న విధానం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ బ్యూటీకి బెస్ట్ అవార్డు ఇవ్వవచ్చు
బికినీ అందాల పోటీలు పెడితే ఈ బ్యూటీకి బెస్ట్ అవార్డు ఇవ్వచ్చు అని కూడా ఫాలోవర్స్ పాజిటివ్ గా ఆమె గ్లామర్ పై స్పందిస్తున్నారు. ప్రస్తుతం హాలిడేస్ లో ఉన్న ఈ బ్యూటీ నెక్స్ట్ సుదీర్ దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న ఒక సినిమాలో నటించబోతోంది. అలాగే తమిళంలో టక్కరి ఉన్న ఒక సినిమా కూడా చేస్తోంది. కానీ ఆ సినిమా షూట్ కు మళ్ళీ బ్రేక్ పడింది. అలాగే మరొక వెబ్ సిరీస్ లో కూడా నటించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











