ఫరియా అబ్దుల్లా ఒంటిపై ఆ టాటూ.. దాని అర్థం ఏంటో తెలుసా?

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో చిట్టిగా గుర్తింపు పొందింది యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా. తొలి చిత్రంతోనే ఫరియా అబ్దుల్లా మంచి క్రేజ్ దక్కించుకుంది. తన నటనతో, క్యూట్ క్యూట్ మాటలతో, హవా భావాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. తనకంటూ కాస్తా స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. వరుసగా ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తుండటంతో ఫరియా అబ్దుల్లా కు కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. దీంతో ఫరియా గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఫరియా అబ్దుల్లా ఇంటిపై ఉన్న టాటూ సీక్రెట్ ఏంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.అదే విధంగా ఫరియా అబ్దుల్లా సినిమాలు, హిడెన్ టాలెంట్స్, రాబోయే చిత్రాల వివరాల్లోకి వెళితే..

తొలి చిత్రంతోనే సెన్సేషన్..
కరోనా తర్వాత 'జాతి రత్నాలు' అనే తెలుగు ప్రేక్షకులను పరిచయం చేసుకుంది యంగ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా. ఈ చిత్రానికి అనుదీప్ కేవీ దర్శకత్వం వహించగా, టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి హీరోగా నటించారు. నవీన్ సరసన ఫరియా చిట్టి పాత్రలో నటించి మెప్పించింది. స్వప్న మూవీస్ బ్యానర్ పై రూ.6 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రం కామెడీ డ్రామా రూపుదిద్దుకుంది. 2021 మార్చి 11న విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసింది. బాక్సాఫీస్ వద్ద రూ.70 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. ఇక ఈ చిత్రంతో దర్శకుడు అనుదీప్, హీరో నవీన్ పొలిశెట్టి, హీరోయిన్ గా ఫరియా అబ్దుల్లాకు మంచి పేరు దక్కింది. రాహుల్ రామకృష్ణకు కూడా మంచి క్రేజ్ దక్కింది. ఇలా తొలిసినిమాతోనే ఫరియా టాలీవుడ్ లో సంచలనం సృష్టించింది.

Tollywood Actress Faria Abdullah Tattoo Secret Her Hidden Talent Details

జాతి రత్నాలు చిట్టి మల్టీ టాలెంటెడ్..
1997 జూన్ 21న ఫరియా అబ్దుల్లా హైదరాబాద్ లో పుట్టింది. లాయోలా అకాడెమీలో మాస్ కమ్యూనికేషన్ లో పూర్తి చేసుకుంది. ఇక చిన్నప్పటి నుంచే ఫరియా అబ్దుల్లాకు కళలపై ఆసక్తి ఉండేది. దాంతోనే చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. అంతకంటే ముందే ఫరియా పలు రంగస్థల నాటకాల్లో నటించింది. ఇక తను కేవలం యాక్ట్రెస్ మాత్రమే కాదు. మోడల్, డ్యాన్సర్, విజువల్ ఆర్టిస్ట్ కూడానూ.

ఫరియా అబ్దుల్లా టాటూ సీక్రెట్..
ఇక ఫరియా అబ్దుల్లా టాటూలను కూడా ఇష్టపడుతూ ఉంటుంది. తన ఒంటిపై రెండు టాటూస్ ను వేయించుకుంది. ఒకటి తన లెఫ్ట్ హ్యాండ్ మోచేయిపై కొన్ని పదాలు రాసి ఉంటాయి. లాటిన్ భాషలో Veni Vidi Vici ఇలా రాసి ఉంటుంది. 'నేను వచ్చాను, నేను చూశాను, నేను జయించాను' అని పదాల అర్థం. ఇక తన కాలి మడిమ దగ్గర కూడా వృత్తాకారంలో టాటూ ఉంటుంది. పర్ఫెక్షన్ ను తెలియజేసేలా ఆ టాటూను వేయించుకుంది.

ఫరియా అబ్దుల్లా ప్రాజెక్ట్స్..
జాతి రత్నాలు చిత్రంతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న తర్వాత బంగార్రాజు చిత్రంలో స్పెషల్ సాంగ్ తో మైండ్ బ్లాక్ చేసింది. ఆ తర్వాత లైక్ షేర్ సబ్ స్క్రైబ్, రావణసుర, ఆ ఒక్కటి అడక్కు, కల్కి 2898 ఏడీ, మత్తు వదలారా 2 వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం తమిళంలో 'వల్లి మయిల్' చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X