ఆ హీరోయిన్ కు జెనీలియా భర్త ముద్దులు.. స్పందించిన స్టార్ హీరోయిన్
టాలీవుడ్ లో కొన్నేళ్ళ పాటు హీరోయిన్ గా ఊపూపింది నటి జెనీలియా. బ్యూటీఫుల్ పాత్రల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కించుకుంది. తన క్యూట్ లుక్స్, చిలిపితనంతో ఆడియెన్స్ కు ఎంతగానో దగ్గరైంది. తన టాలెంట్ తోనూ మంచి ప్రశంసలు అందుకుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఇక ప్రస్తుతం బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తోంది. ఇక రీసెంట్ గా తను ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భర్త గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..
తెలుగు జెనీలియా టాప్ సినిమాలివే..
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో జెనీలియా చాలా గుర్తుండిపోయే సినిమాలు చేసింది. జూ.ఎన్టీఆర్, నితిన్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. 2003 నుంచి 2012 వరకు టాలీవుడ్ లో యాక్టివ్ గా ఉంది. తెలుగులో సత్యం అనే చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. సై, నా అల్లుడు, హ్యపీ, బొమ్మరిల్లు, ఢీ, ఆరెంజ్, నా ఇష్టం వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం బాలీవుడ్ లోనే నటిస్తూ ఉంది.

జెనీలియా, రితేష్ దేశ్ ముఖ్ వైరల్ వీడియో..
బాలీవుడ్ స్టార్ నటుడు రితేశ్ దేశ్ ముఖ్, జెనీలియా డిసౌజా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొన్నేళ్లుగా ఆదర్శ దంపతులుగా బాలీవుడ్ లో ప్రశంసలు అందుకుంటున్నారు. బాలీవుడ్ లోని ప్రతి ఈవెంట్ లో వీరద్దరి ఎంట్రీ అట్రాక్షన్ గా ఉంటుంది. జంటగా సినీ ఫంక్షన్లు, ఇతర ఈవెంట్స్ కు హాజరవుతూ ఆకట్టుకుంటూ ఉంటారు. అయితే ఓ ఫంక్షన్ లో రితేశ్ దేశ్ ముఖ్ జెనీలియాకు షాక్ ఇచ్చాడు. రితేశ్ దేశ్ ముఖ్ హీరోయిన్ ప్రీతి జింటాతో క్లోజ్ గా మూవ్ అవుతాడు. జెనీలియా ముందే ఆమె చేతులను తాకుతూ, ముద్దులు పడుతాడు. అయితే పక్కనే ఉన్న జెనీలియా గుర్రుమని చూస్తుంది. ఆ వీడియో సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారింది.
తన భర్త గురించి ఇలా..
తాజాగా జెనీలియా తన భర్త రితేశ్ దేశ్ ముఖ్ వైరల్ వీడియోపై జెనీలియా ఇలా స్పందించింది. తన భర్తతో పాటు తను ఉన్న ఆ వీడియోను బాగా వైరల్ చేశారు. ముందుగా ఆ కెమెరా మెన్ ను ప్రశంసించాలి. నేను అలాంటివన్నీ పెద్దగా పట్టించుకోను. ఇక సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటాను. ఇక నా భర్త రితేశ్ దేశ్ ముఖ్ తో కలిసి 25 ఏళ్లుగా ఉంటున్నాను. నాకు ఆయనపై చాలా నమ్మకం ఉందని చెప్పుకొచ్చింది. ఇక రితేశ్ దేశ్ ముఖ్ కు 2012లో జెనీలియాతో పెళ్లైంది. వాళ్లిద్దరికీ ఇద్దరు పిల్లలు ఉన్నారు.
12 ఏళ్లకు రీఎంట్రీ..
2013లో జెనీలియా డిసౌజా రానా దగ్గుబాటి సరసన నా ఇష్టం చిత్రంతో అలరించింది. అదే టాలీవుడ్ లో ఆమె చివరి చిత్రం. ఆ తర్వాత తెలుగు సినిమాలకు దూరమైంది. అప్పటి నుంచి బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తుంది. ఇక 12 ఏళ్ల తర్వాత జూనియర్ అనేసినిమాతో మళ్లీ దక్షిణాది ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యింది. మరోవైపు హిందీలో రాజా శివాజీ అనే చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది.


Click it and Unblock the Notifications











