Himaja: బిగ్ బాస్ బ్యూటీ అరెస్ట్.. షాకింగ్ వీడియో రిలీజ్ చేసిన హిమజ!
బిగ్ బాస్ బ్యూటీ, తెలుగు నటి హిమజ గురించి తెలుగు సినీ ప్రేక్షుకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అందం, అభినయంతో సినిమాలతో పాటు పలు టీవీ షోలు చేస్తున్న ఈమె.. బిగ్ బాస్ షో ద్వారా పుల్ క్రేజ్ సంపాధించుకుంది. ముఖ్యంగా బిగ్‌బాస్ టైటిల్ అందుకోకపోయినా.. తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. అలా వచ్చిన క్రేజ్ తో పలు షోలలో దర్శనమిచ్చింది. అన్ని ఛానల్స్ లో వచ్చే ప్రత్యేక షోలలో కనిపిస్తూ, అడపాదడపా సినిమాల్లోనూ కనిపిస్తోంది హిమజ. అయితే తాజాగా ఈమె అరెస్టు అయినట్లు వార్తలు వస్తున్నాయి.
ముఖ్యంగా హిమజ ఓ వివాదంలో చిక్కుకుందని.. రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్లు ఆరోపిస్తూ స్పెషల్ టీం పోలీసులు హిమజను అదుపులోకి తీసుకున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. హైదరాబాద్ శివారులో ఉన్న ఇబ్రహీంపట్నం జిబి వెంచర్స్ లో ఒక ఇంటిపై దాడి చేసిన పోలీసులు.. కొంత మంది సెలబ్రిటీలను అదుపులోకి తీసుకున్నట్లు చాలా మీడియా ఛానెళ్లు రాసుకొచ్చాయి. ఇందులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు హిమజ. హిమజ ఆధ్వర్యంలోనే రేవ్ పార్టీ జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందించిందని అంతా భావించారు.

బిగ్‌బాస్ హిమజతో పాటు హేమ, నీలిమ, యాంకర్ ప్రవీణ, తేజు, పవిత్ర, రోహిణి వంటి వారు ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం సాగింది. ఈ రేవ్ పార్టీ కూడా బిగ్‌బాస్ హిమజ నివాసంలోనే జరిగినట్లు పుకార్లు షికార్లు చేశాయి. సౌండ్ సిస్టమ్ తో హడావిడి చేస్తుండటంతో స్థానికులు ఫిర్యాదు చేశారని... ఆక్రమంలోనే పోలీసులు దాడి చేసి మరీ 15 లీటర్ల మద్యం, సౌండ్ సిస్టమ్ సీజ్ చేసినట్లు చాలా వెబ్ సైట్లలో రాసుకొచ్చారు.
కానీ విటపై హిమజ స్పందించింది. ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియోను కూడా విడుదల చేసింది. ముందుగా అందరికీ హ్యాపీ దివాళి అని చెప్పిన ఆమె.. చాలా హ్యాపీగా పండుగ చేసుకున్నట్లు చెప్పింది. నిన్న తాను తన ఇంట్లో దీపావళి పూజ చేసుకోవాలని స్నేహితులను, కుటుంబ సభ్యులను పిలిచానని చెప్పింది. ఎవరో పాపం ఏదో అనుకొని ఫిర్యాదు చేస్తే.. పోలీసులు వచ్చి చెక్ చేసి వెళ్లారని వివరించింది.
అయితే తన అరెస్టు వార్త అవాస్తవం అని చెప్పుకొచ్చిది. అలాగే పండుగ సందర్భంగా ఇంట్లోనే ఉన్న తాను పూజ కూడా చేసుకున్నాని చెప్పుకొచ్చింది. ఈ వీడియోను కూడా షేర్ చేయగా అంతా షాకయ్యారు. ఇంట్లో ఉండి లైవ్ వీడియో చేసిన ఈమె.. తన మూడ్ ఆఫ్ అయ్యేలా చేశారని హిమజ ఫైర్ అయింది. అలాంటి తప్పుడు వార్తలు రాస్తే మీకు ఏమీ రాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఆ వార్తలను ఆపేయాలని.. నిజం తెలుసుకున్న తర్వాతే వార్తలను స్ప్రెడ్ చేయాలని సూచించింది. దీంతో ఆమె అరెస్టు వార్తకు తెరదించినట్లు అయింది.


Click it and Unblock the Notifications











