బికినీలో మంచు లక్ష్మి మాయాజాలం.. తొలిసారి ఇలాంటి ఫొటోలతో అరాచకం
తెలుగు సినిమా రంగంలోకి కూడా ఎంతో మంది నటీమణులు స్టార్ల వారసులుగా ఎంట్రీ ఇచ్చారు. అయితే అందులో కొందరు మాత్రమే తమదైన రీతిలో ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు సాగుతోన్నారు. అలాంటి వారిలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమార్తె లక్ష్మి ప్రసన్న ఒకరు. చాలా కాలంగా టాలీవుడ్‌లో తనదైన సినిమాలతో అలరిస్తోన్న ఈ భామ.. ఇప్పుడు కూడా పలు ప్రాజెక్టులను చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా మంచు లక్ష్మి బికినీలో దిగిన కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. వాటిపై మీరే లుక్కేయండి మరి!
తండ్రి బాటలో.. అలా ఎంట్రీ
దాదాపు నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో విలన్‌గా, హీరోగా, సపోర్టింగ్ ఆర్టిస్టుగా, నిర్మాతగా ఆయన ఎన్నో రకాలుగా సేవలు అందించిన మోహన్ బాబు తన కుమార్తె లక్ష్మి ప్రసన్నను సైతం సినిమాల్లోకి తీసుకు వచ్చారు. అలా ఆమె 'ద ఓడ్' అనే ఇంగ్లీష్ ఫిల్మ్‌తో యాక్టింగ్ కెరీర్‌ను మొదలు పెట్టింది. ఆ తర్వాత 'అనగనగా ఓ ధీరుడు' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి వచ్చింది.

విలక్షణమైన నటనతో ఫుల్లు
మొదటి చిత్రంలోనే అదిరిపోయే నటనతో ఆకట్టుకున్న మంచు లక్ష్మి.. ఆ తర్వాత 'గుండెల్లో గోదారి'లో ఊహించని రీతిలో యాక్టింగ్ చేసి మెప్పించింది. ఈ ఉత్సాహంతోనే హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చాలా చిత్రాల్లో నటించింది. అలాగే, నిర్మాతగానూ పలు మూవీలను నిర్మించంది. ఇలా చాలా తక్కువ సినిమాల్లో నటించినా లక్ష్మి ప్రసన్నకు క్రేజ్ ఫుల్లుగా లభించింది.
ఇప్పుడలా.. యక్షిణి సిరీస్‌తో
ఇటీవలి కాలంలో మంచు లక్ష్మి లేడీ ఓరియెంటెడ్ మూవీల్లో ఎక్కువగా నటిస్తోంది. ఇలా ఇప్పుడు 'ఆదిపర్వం' అనే సినిమాను చేస్తోంది. ఇక, ఇటీవలే ఈ అమ్మడు 'యక్షిణి' అనే వెబ్ సిరీస్‌తో వచ్చింది. ఇందులో అద్భుతమైన పాత్రను పోషించిన మంచు లక్ష్మి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఫలితంగా మరిన్ని సిరీస్‌లలో ఆఫర్లను కూడా సొంతం చేసుకుంటోంది.

సోషల్ మీడియాలో యాక్టివ్
కెరీర్ ఆరంభం నుంచీ వరుసగా సినిమాలు, షోలు చేస్తూ తీరిక లేకుండా ఉంటోన్నా.. మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలతో పాటు కెరీర్ విశేషాలను కూడా షేర్ చేస్తోంది. అలాగే తన ఫొటోలు, వీడియోలను సైతం వదులుతోంది. తద్వారా తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.
హాట్ ట్రీట్‌తో కవ్విస్తోందిగా
చాలా ఏళ్లుగా సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో యాక్టివ్‌గా ఉంటోన్న మంచు లక్ష్మి.. అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్ కూడా చేస్తూ రచ్చ చేస్తోంది. అలాగే, పొట్టి బట్టలు ధరించుకుని మరీ దిగిన ఫొటోలను, వీడియోలను సైతం ఇంటర్నెట్‌లో షేర్ చేస్తోంది. వీటిలో చాలా వరకూ అందాలు మొత్తం ఆరబోస్తూ దిగినవి ఉంటున్నాయి. దీంతో మంచు లక్ష్మి పేరు మారుమ్రోగిపోతోంది.

మంచు లక్ష్మి పిక్స్ వైరల్
మంచు లక్ష్మి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఘాటు ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె బీచ్‌లో టూ పీస్ బికినీ ధరించి కనిపించింది. అలాగే, రెచ్చగొట్టేలా ఫోజులు కూడా ఇచ్చింది. ఫలితంగా మంచు లక్ష్మి అందాలు కుర్రకారును యమా కవ్విస్తున్నాయి ఫలితంగా ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి ఊహించని రీతిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇవన్నీ ఫుల్ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











