twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సొంత ఖర్చులతో అందాల రాక్షసి సమాజసేవ.. ఎంత మంచి పని చేసిందో తెలుసా?

    |

    అందాల రక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ లావణ్య త్రిపాఠి. ఆ సినిమా తరువాత అమ్మడు తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుందనే చెప్పాలి. సొట్టబుగ్గల అందంతో ఓ వర్గం కుర్రాళ్లను తెగ ఎట్రాక్ట్ చేసింది. ఇక ఈ బ్యూటీ చాలా కాలం తరువాత వార్తల్లో హాట్ టాపిక్ గా నిలుస్తోంది. కరోనా సమయంలో ఎన్నో ఇబ్బందులు తలెత్తడంతో సాటి జనాలకు తోచినంత సహాయాన్ని అందిస్తోంది.

    ఇప్పటికే ఈ బ్యూటీ కరోనా క్రిసిస్ చారిటీకి ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించగా ఇప్పుడు మరొక మంచి పనితో అందరిని ఆకర్షించింది. లావణ్య ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అనితా రెడ్డితో కలిసి ఈ మంచి పనికి శ్రీకారం చుట్టింది. కాటన్ ద్వారా నాణ్యత కలిగిన మాస్క్‌లను తయారు చేసి వాటిని ఉచితంగా అందించడానికి సిద్ధమయ్యారు. అవసరమైన అనుమతి పొందిన తర్వాత వాటిని ఆరోగ్య నిపుణులకు పంపిణీ చేయనున్నారు.

    Tollywood actress Lavanya Tripathi noble initiative in Corona times

    లావణ్య చేస్తున్న మంచి పనికి సోషల్ మీడియాలో ఆమె అభిమానులు ఆమెపై పాజిటివ్ గా ప్రశంసలు కురిపిస్తున్నారు. తెలుగు హీరోయిన్స్ లలో మొట్టమొదట ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది లావణ్య త్రిపాఠీ.

    ఆమె అర్జున్ సురవరం కో స్టార్ నిఖిల్ కూడా ఇటీవల అదే తరహాలో కరోనా కోసం పోరాడుతున్న వైద్యులకు మెడికల్ కి సంబంధించిన కేరింగ్ పరికరాలను అందించిన విషయం తెలిసిందే. ఇక అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉంది. త్వరలో పవన్ కళ్యాణ్ తో ఆమె ఒక సినిమాలో నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

    English summary
    Actress lavanya tripathi recently announced a contribution of Rs 1 lakh to the Corona Crisis Charity (CCC) fund. Now, the she is busy with yet another noble initiative. Lavanya and fashion designer Anitha are manufacturing face masks from sustainable cotton in a large number
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X